Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 23 , 2026 | 08:02 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 23, 2026 08:36 IST

    భారీ వర్షాలపై మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సమీక్ష

    • R&B శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశం

    • ప్రత్యేక కంట్రోల్ రూమ్‌తో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం

    • ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా చర్యలు: బీసీ జనార్ధన్‌రెడ్డి

  • Sep 23, 2026 08:35 IST

    విజయనగరం: జిల్లాపై వాయుగుండ ప్రభావం

    • ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటన

  • Sep 23, 2026 08:34 IST

    నేడు హైదరాబాద్‌లో కేటీఆర్ పర్యటన

    • ఖైరతాబాద్‌, బాలాపూర్‌, BN రెడ్డి నగర్‌లో వినాయక పూజలో పాల్గొననున్న కేటీఆర్‌

  • Sep 23, 2026 08:33 IST

    శ్రీకాకుళం: జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

    • నాగావళి, వంశధార నదులకు పొంచి ఉన్న వరద ముప్పు

    • తీర ప్రాంత మండలాల్లో కొనసాగుతున్న హైఅలర్ట్‌

  • Sep 23, 2026 08:32 IST

    ఎన్టీఆర్ జిల్లా: కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్‌ దయా అరెస్ట్‌

    • విజయవాడకు తరలించిన ఇబ్రహీంపట్నం పోలీసులు

    • దేవినేని అవినాష్ సన్నిహితుడు దయా

  • Sep 23, 2026 08:31 IST

    ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పోలీసుల అదుపులో వైసీపీ నేత మోదుగు ప్రసాద్‌

    • విజయవాడలో DSCపై వైసీపీ ఆందోళనలో పాల్గొన్న ప్రసాద్‌

    • విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు మోదుకు ప్రసాద్ తరలింపు

  • Sep 23, 2026 08:30 IST

    నల్లగొండలో నేడు గణేష్ శోభాయాత్ర

    • విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ చంద్రశేఖర్‌

    • గణేష్ నిమజ్జనంతో అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై ట్రాఫిక్‌ ఆంక్షలు

    • హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, నకిరేకల్‌, తిప్పర్తి మీదుగా మళ్లింపు

    • నల్లగొండలో వల్లభరావు చెరువు, 14వ మైలు, వేములపల్లి కాలువలో విగ్రహాలు నిమజ్జనం

  • Sep 23, 2026 08:29 IST

    బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం

    • టేకాఫ్‌కు సిద్ధమైన తర్వాత ఆగిపోయిన విమానం

    • విమానంలో మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు

    • విజయవాడలో కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు మంత్రి ప్రయాణం

  • Sep 23, 2026 08:28 IST

    నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన

    • మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభించనున్న మంత్రులు

    • అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర లిఫ్ట్ ప్రారంభోత్సవం

  • Sep 23, 2026 08:26 IST

    నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

    • ఎథిక్స్ కమిటీ భేటీలో కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై చర్చ

    • గతంలో నోటీసులపై వివరణ ఇచ్చేందుకు 3 వారాల గడువు కోరిన కౌశిక్‌రెడ్డి

    • అసెంబ్లీ కమిటీ హాల్‌లో చైర్మన్ రేవూరి ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన భేటీ

  • Sep 23, 2026 08:26 IST

    నేటినుంచి అమెరికాలో చైనా అధ్యక్షుడి పర్యటన

    • అమెరికాలో 3 రోజులు పర్యటించనున్న జిన్‌పింగ్‌

    • ద్వైపాక్షిక అంశాలపై ట్రంప్‌తో భేటీకానున్న జిన్‌పింగ్‌

  • Sep 23, 2026 08:26 IST

    బొల్లారం ఆయుధాల చోరీ కేసు

    • నేడు రెండో రోజు నిందితుడు మల్లేష్‌ విచారణ

  • Sep 23, 2026 08:25 IST

    ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

    • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన దానం

  • Sep 23, 2026 08:25 IST

    వైభవంగా కాణిపాకం వినాయక బ్రహ్మోత్సవాలు

    • కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు తెప్పోత్సవం

  • Sep 23, 2026 08:24 IST

    తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

  • Sep 23, 2026 08:24 IST

    హైదరాబాద్: నేటి అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్‌ బడా గణేష్ దర్శనం

    • రేపు ఉదయం బడా గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభం

    • ఎల్లుండి ట్యాంక్‌బండ్‌లో ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం

  • Sep 23, 2026 08:24 IST

    బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

    • పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం

    • నేడు విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం

    • కళింగపట్నం దగ్గర తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

    • ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ హెచ్చరిక

  • Sep 23, 2026 08:23 IST

    ఢిల్లీ: ఇవాళ, రేపు బీజేపీ 'చింతన్‌ బైఠక్‌' కార్యక్రమం

    • ప్రధాని మోదీ అధ్యక్షతన 'సేవా తీర్థ్‌'లో కేంద్రమంత్రుల కీలక భేటీ

    • 6 గ్రూప్‌లుగా 8 మంది చొప్పున కేంద్రమంత్రుల సమావేశం

    • పాలన, విధానపర నిర్ణయాలు, సంస్కరణలపై విస్తృత చర్చ

    • ప్రభుత్వ పథకాల పురోగతి, గడువులోగా అమలుపై రివ్యూ

  • Sep 23, 2026 08:22 IST

    బెంగళూరు: కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు

    • డీకే శివకుమార్‌తో జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు సమావేశం

    • కృష్ణా జలాలు విడుదల చేయాలంటూ లేఖను అందజేసిన మంత్రులు

    • 5 వేల క్యూసెక్కుల నీటిని నెల రోజుల పాటు విడుదల చేయాలని వినతి

    • తెలంగాణ రైతులు నష్టపోకుండా సకాలంలో నీరు అందించాలని అభ్యర్థన

  • Sep 23, 2026 08:14 IST

    విజయవాడ: టీచర్లపై దాడి కేసులో వైసీపీ ముఖ్యనేతలు సహా పలువురిపై రౌడీషీట్

    • వారిపై రౌడీషీట్ ఓపెన్‌ చేయాలని సీపీ రాజశేఖర్‌ బాబు ఆదేశాలు

    • 51 మందిపై రౌడీషీట్ తెరవాలని SHOలకు ఆదేశాలు

    • గతంలో TDP కార్యాలయంపై దాడి కేసులో ఉన్న వారందరిపైన రౌడీషీట్ తెరుస్తూ ఉత్తర్వులు

    • వైసీపీ ముఖ్య నేతలు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్ సహా 51 మంది పేర్లు నమోదు

    • శాప్ కార్యాలయం దగ్గర మెగా DSC ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు

    • మంగళగిరి TDP ఆఫీసుపై దాడి కేసులో నిందితులుగా ఉన్న కొందరు టీచర్లపై దాడి కేసులోనూ ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తింపు

    • రెండు చోట్లా ఉన్న వారిపై రౌడీషీట్లు తెరవాలని సీపీ ఆదేశాలు

  • Sep 23, 2026 08:09 IST

    నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

    • ఉ.10.30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

    • మధ్యాహ్నం తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో LV ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు భూమిపూజ

  • Sep 23, 2026 08:09 IST

    తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

    • తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్

    • పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

    • భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

  • Sep 23, 2026 08:02 IST

    నేడు ఏపీలో 12 జిల్లాల్లో భారీ వర్షాలు

    • ఐదు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన

    • రాయలసీమకు మోస్తరు వర్ష సూచన