Share News

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:02 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు రోజంతా సానుకూల ట్రెండ్‌ను ప్రదర్శించాయి.

 లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
Stock Market Today: Nifty, Sensex End Higher in Bullish Trade

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (బుధవారం) లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు రోజంతా సానుకూల ట్రెండ్‌ను ప్రదర్శించాయి. నిఫ్టీ 117.80 (0.50శాతం) పాయింట్లు పెరిగి 23,446.80 దగ్గర ముగియగా, సెన్సెక్స్ 299.17 పాయింట్లు (0.40శాతం) పెరిగి 74,828.25 దగ్గర స్థిరపడింది.

గత ముగింపు కంటే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఉదయం నుంచే స్థిరంగా పెరిగాయి. మధ్యాహ్నం 1:00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 74,900 మార్కును దాటి అత్యున్నత స్థాయికి చేరుకుంది. ముగింపు సమయానికి స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, ఆఖరి నిమిషాల్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో రెండు సూచీలు కూడా మంచి లాభాల్లో గ్రీన్ మార్క్‌లో ముగిశాయి.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 04:02 PM