Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 21 , 2026 | 06:09 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 21, 2026 06:55 IST

    విశాఖ కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

    • ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ నిర్వహణ

    • అలాగే ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలు

    • Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని అధికారుల సూచన

  • Sep 21, 2026 06:50 IST

    హైదరాబాద్: నేడు జూరాల డ్యామ్‌పై ఆందోళనకు BRS పిలుపు

    • రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్

    • కాలువల రెగ్యులేటర్ల దగ్గర పోలీసుల మోహరింపు

  • Sep 21, 2026 06:45 IST

    యూపీ ఎన్నికలపై దృష్టి సారించిన నితిన్ నబీన్

    • నేడు, రేపు మీరట్, సహారన్‌పూర్‌లో నబీన్ పర్యటన

    • ఎన్నికల సన్నాహాలపై సంస్థాగత సమావేశాలు

    • మీరట్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్న నబీన్

    • శక్తి కేంద్ర సమ్మేళనంలో పాల్గొననున్న నితిన్ నబీన్

  • Sep 21, 2026 06:40 IST

    నేడు 4వ రోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటన

    • నేడు షాబాద్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

    • షాబాద్‌లో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి భూముల పరిశీలన

  • Sep 21, 2026 06:35 IST

    భద్రాద్రి కొత్తగూడెం: నేడు ములకలపల్లి మండలంలో మంత్రి తుమ్మల పర్యటన

    • సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ పనులను పరిశీలించనున్న మంత్రి తుమ్మల

  • Sep 21, 2026 06:30 IST

    కర్నూలులో నేడే వినాయక నిమజ్జనం

    • కర్నూలులో 2 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం

    • నిమజ్జనానికి 3 వేల మంది పోలీసులతో బందోబస్తు

    • కర్నూలులో ఉదయం నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు

  • Sep 21, 2026 06:27 IST

    రేపు కాకినాడలో జనసేన స్థానిక ఎన్నికల సన్నాహక భేటీ

    • ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన జనసేన కీలక సమావేశం

    • 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలకు ఆహ్వానం

    • పార్టీ కార్యాచరణపై జనసేన అధినాయకత్వం దిశా నిర్దేశం

    • ఎన్నికల్లో సమన్వయంపై పవన్‌ కల్యాణ్‌ కీలక సూచనలు

  • Sep 21, 2026 06:20 IST

    నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

    • రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్ టూర్‌

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

    • రూ.1500 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌

  • Sep 21, 2026 06:15 IST

    తిరుమలలో ఏడోరోజుకు చేరిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

    • ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై విహరించనున్న స్వామివారు

    • రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న కోనేటిరాయుడు

  • Sep 21, 2026 06:12 IST

    హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

    • నేటి నుంచి అలాట్‌మెంట్ లెటర్ల జారీ

    • SMS, వాట్సాప్ ద్వారా లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు

    • TGHB వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో అలాట్‌మెంట్ లెటర్లు

  • Sep 21, 2026 06:10 IST

    తెలంగాణ: నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శంకుస్థాపన

    • రాయదుర్గంలో శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

    • 2.85 ఎకరాల ప్రభుత్వ TGHB భూమిలో 480 ప్లాట్ల నిర్మాణం

  • Sep 21, 2026 06:07 IST

    కాకినాడ: మంత్రి నారా లోకేశ్‌పై చాగంటి ప్రశంసలు

    • విద్యార్థులకు దేశభక్తి కార్యక్రమం నిర్వహించాలని లోకేశ్ కోరారు: చాగంటి కోటేశ్వరరావు

    • ఒక రోజంతా మాతో ఉండగలరా అని అడగ్గా తప్పకుండా వస్తానన్నారు: చాగంటి

    • పిల్లలు దేశభక్తి పొందాలన్న తాపత్రయం ఉన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది: చాగంటి

  • Sep 21, 2026 06:05 IST

    తెలుగు రాష్ట్రాలకు నేడు భారీ వర్ష సూచన

    • బంగాళాఖాతంలో అల్పపీడనం

    • నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

    • దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

    • తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

    • మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

  • Sep 21, 2026 06:00 IST

    చిత్తూరు: నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

    • రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటన

    • గుండిశెట్టిపల్లి దగ్గర హంద్రీనీవా జలహారతిలో పాల్గొననున్న సీఎం

    • తంబిగానిపల్లిలో రైతుబజార్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు