Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 13 , 2026 | 05:55 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 13, 2026 21:04 IST

    రంగారెడ్డి: శంషాబాద్‌ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

    • ఆటోనగర్‌లోని గోదాంలో ఎగిసిపడిన మంటలు

    • మంటలను అదుపుచేసిన ఫైర్‌ సిబ్బంది

  • Aug 13, 2026 20:34 IST

    ఏపీ లిక్కర్‌ రవాణా కేసు నిందితులు రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు చట్టవిరుద్ధం: హైకోర్టు

    • అరెస్టు విషయంలో చట్ట విధానాలను సిట్‌ అనుసరించలేదు: హైకోర్టు

    • కేసు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోం: హైకోర్టు

    • IO పిలిచినప్పుడు నిందితులు హాజరుకావాలి: హైకోర్టు

    • ఏసీబీ కోర్టు రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి

  • Aug 13, 2026 20:25 IST

    రాజధాని అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ కథనం

    • అభివృద్ధి లక్ష్యాలను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్‌

    • దేశానికే ఆదర్శంగా అమరావతి నిర్మాణం: చంద్రబాబు

    • జీవన ప్రమాణాలకు కొత్త బెంచ్‌మార్క్‌గా అమరావతి

    • గ్రీన్, సమర్థవంతమైన, సమ్మిళిత నగరంగా అమరావతి

    • ప్రజల జీవన నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ నిర్మాణం

    • నిర్ణీత కాలంలోనే అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు

  • Aug 13, 2026 20:23 IST

    అమరావతి: మహిళా ఉద్యోగి ఫిర్యాదుపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్

    • చిత్తూరులో మహిళా ఉద్యోగిపై వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు

    • చైర్‌పర్సన్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు

    • బాధితురాలి ఫిర్యాదుపై వివరాలు సేకరించిన అధికారులు

    • బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు: మహిళా కమిషన్‌

  • Aug 13, 2026 20:12 IST

    అమిత్‌ షాను వైసీపీ ఎంపీలు కలిశారు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

    • జగన్ భద్రత విషయంలో అమిత్‌ షాను నుంచి వైసీపీ ఎంపీలకు ఘాటు సమాధానం వచ్చింది: లావు

    • జగన్ భద్రత కంటే జగన్ నుంచి ప్రజలకు భద్రత కల్పించాలని వైసీపీ ఎంపీలకు చెప్పారు: ఎంపీ లావు

    • శాంతిభద్రతలకు జగన్‌ విఘాతం కలిగిస్తున్నారు: లావు

    • వైసీపీ నిరసనల్లో డీఎస్సీ అభ్యర్థులు లేరు.. కొన్నిచోట్ల ఒడిశా కూలీలు పాల్గొన్నారు: ఎంపీ లావు

  • Aug 13, 2026 20:04 IST

    అమరావతి: జీవో 102 అమలు నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

    • అందుకు ఎలాంటి కారణాలు కనిపించలేదని వెల్లడి

    • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు

    • MBBS, BDS కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్‌కు ముందు వెబ్ ఆప్షన్లు ఇచ్చే వీలు కల్పిస్తూ జీవో జారీచేసిన వైద్యారోగ్య శాఖ

  • Aug 13, 2026 20:03 IST

    అమరావతి: విద్యుత్‌ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం: చంద్రబాబు

    • విద్యుత్ సంస్థలపై రుణభారం తగ్గించేలా నిరంతర చర్యలు

    • డిజిటల్‌ ట్విన్‌, అసెట్‌ హెల్త్‌ ఇండెక్స్‌పై సీఎం ప్రశంసలు

  • Aug 13, 2026 20:03 IST

    మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు నిమ్మల, ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష

    • ఈనెల 22న ప్రాజెక్టు టన్నెల్ ద్వారా నీరు విడుదల చేసి ట్రైల్ రన్ నిర్వహించాలని నిర్ణయం

  • Aug 13, 2026 20:02 IST

    జగిత్యాల: బీర్పూర్‌ లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

    • తహసీల్దార్ ఆఫీస్‌లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ రాహుల్‌

  • Aug 13, 2026 19:50 IST

    తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్

    • TPCC చీఫ్‌ మహేశ్ గౌడ్‌ అధ్యక్షతన సమావేశం

    • పాల్గొన్న సీఎం రేవంత్‌, ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి

    • రాష్ట్రంలో SIR ప్రక్రియపై నేతల చర్చ

  • Aug 13, 2026 19:35 IST

    అమరావతి: నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రుల కమిటీ కసరత్తు

    • ఏపీలో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30తో ముగింపు

    • ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన సమావేశం

    • 2024-26 రిటైల్ ఎక్సైజ్ పాలసీ అమలు ద్వారా జులై వరకు వచ్చిన ఫలితాలపై మంత్రులకు అధికారుల వివరణ

  • Aug 13, 2026 19:18 IST

    హైదరాబాద్: గత సంక్షేమ పథకాలను మేం రద్దు చేయలేదు: సీఎం రేవంత్‌

    • ప్రజలకు అదనంగా మరిన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం: సీఎం రేవంత్

    • దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యం ఇస్తున్నాం: సీఎం రేవంత్

    • గతంలో పేదలకు దొడ్డుబియ్యం ఇచ్చారు: సీఎం రేవంత్‌

    • పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం: రేవంత్‌

    • ఉచిత విద్యుత్‌ ద్వారా 55 లక్షల కుటుంబాలకు లబ్ధి: రేవంత్‌

  • Aug 13, 2026 19:07 IST

    హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి దందా

    • డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి అమ్మకాలు

    • వాట్సాప్ ద్వారా ఆర్డర్ తీసుకుని సప్లై చేస్తున్న ముఠా

    • ముఠా నివాసం ఉంటున్న ప్రదేశాలు కాకుండా వేరొక ప్రాంతాల్లో గంజాయిని పెట్టి లొకేషన్, ఫొటోల షేరింగ్

    • 2022 నుంచి ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు

    • ఇప్పటివరకు 2,003 మంది గంజాయి వినియోగదారుల గుర్తింపు

  • Aug 13, 2026 18:52 IST

    ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు

    • ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని మోదీ

    • వందేమాతరం థీమ్‌తో స్వాతంత్ర్య వేడుకలు

    • తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గేయాలాపన

  • Aug 13, 2026 18:34 IST

    ఢిల్లీ: త్వరలో బొగ్గు ఎక్స్ఛేంజ్ పెడుతున్నాం: కిషన్‌రెడ్డి

    • దేశమంతా ఒకే రేటు ఉండేలా చర్యలు: కిషన్‌రెడ్డి

    • తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు 2018 నుంచి బొగ్గు ధర పెంచడం లేదు: కిషన్‌రెడ్డి

    • మినరల్స్ అంశంలో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండదు: కిషన్ రెడ్డి

    • పన్నులు, సెస్‌ల విషయంలో జోక్యం చేసుకోం: కిషన్‌రెడ్డి

    • మినరల్స్‌ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చర్యలు: కిషన్‌రెడ్డి

  • Aug 13, 2026 18:03 IST

    హైదరాబాద్: CURE పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం

    • కూకట్‌పల్లిలో సీఎం రేవంత్‌ శంకుస్థాపన

    • హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం

  • Aug 13, 2026 17:46 IST

    హైదరాబాద్‌: KPHB కాలనీలో సీఎం రేవంత్‌ పర్యటన

    • ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు సీఎం రేవంత్‌ భూమిపూజ

    • లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక

    • ఒక్కో ఫ్లాట్‌కు రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ

  • Aug 13, 2026 17:39 IST

    ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు

    • ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని మోదీ

    • 150 ఏళ్ల వందేమాతరం థీమ్‌తో స్వాతంత్ర్య వేడుకలు

    • తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గానం

  • Aug 13, 2026 17:25 IST

    హైదరాబాద్‌: ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

    • VB-G RAM G కింద ఎకో పండ్లు, వెదురు సాగుకు చర్యలు

    • రైతు సంక్షేమ పథకాల అమలులో సిబ్బంది కొరత ఉండకూడదు: తుమ్మల

    • కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి: తుమ్మల

  • Aug 13, 2026 17:16 IST

    గత ప్రభుత్వం గ్రూప్‌-1 పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకపోయింది: రేవంత్

    • గతంలో ఓ RMP డాక్టర్‌ను TSPSC సభ్యుడిగా నియమించారు: రేవంత్

    • మేం వచ్చాకే TSPSCని ప్రక్షాళన చేశాం: సీఎం రేవంత్

    • UPSC తరహాలో TSPSCని బలోపేతం చేశాం: రేవంత్‌

    • రిటైర్డ్‌ డీజీపీని TSPSC ఛైర్మన్‌ చేశాం: సీఎం రేవంత్‌

    • ఎంతో పారదర్శకంగా గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించాం: రేవంత్

  • Aug 13, 2026 17:14 IST

    హైదరాబాద్‌: మైనారిటీల ప్రతిభా సదస్సు.. హాజరైన సీఎం రేవంత్

    • ప్రతిభ కనబరిచిన పలువురు మైనారిటీలకు అవార్డుల ప్రదానం

    • ముస్లింలకు కాంగ్రెస్‌ 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది: రేవంత్‌

    • ఈ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నించాయి: రేవంత్

    • రిజర్వేషన్ల రద్దుకు అత్యున్నత న్యాయస్థానాలకూ వెళ్లారు: రేవంత్‌

  • Aug 13, 2026 17:10 IST

    సుప్రీంకోర్టులో మరో రెండు కోర్టు హాళ్లు ప్రారంభం

    • 18, 19 కోర్టు హాళ్లను ప్రారంభించిన CJI జస్టిస్‌ సూర్యకాంత్‌

    • సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంచుతూ ఇటీవల పార్లమెంట్‌ చట్ట సవరణ

    • సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 37కు పెంచుతూ పార్లమెంట్‌ చట్ట సవరణ

    • పార్లమెంటులో పాస్‌ అయిన బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

  • Aug 13, 2026 17:01 IST

    హైదరాబాద్‌: బాలానగర్‌లో ఈగల్‌ టీమ్‌ తనిఖీలు

    • ఓ ఇంట్లో 14 కేజీల గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

    • తనిఖీల సమయంలో అధికారులపై కుక్కను వదిలిన నిందితులు

  • Aug 13, 2026 16:48 IST

    తెలంగాణలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు

    • ఈగల్ ఫోర్స్ కీలక ఆపరేషన్‌‌లో దాదాపు 100 మంది డ్రగ్ వినియోగదారుల అరెస్ట్

    • డ్రగ్స్ సరఫరా, వినియోగ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

  • Aug 13, 2026 16:35 IST

    అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్

    • APPSC గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో YCP దొరికిపోయింది: సీఎం చంద్రబాబు

    • తమవారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలిచేశారు: సీఎం చంద్రబాబు

    • అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ హయాంలోని APPSC గ్రూప్-1 వ్యవహారంపై చర్చిద్దామన్న మంత్రులు

    • సిట్ నివేదికపై కోర్టు నిర్ణయం తర్వాత చూద్దామన్న సీఎం చంద్రబాబు

  • Aug 13, 2026 16:11 IST

    కర్నూలు: పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కేటీఆర్‌, BRS ఎమ్మెల్యే ఫ్లెక్సీలు

    • జగనన్నకు స్వాగతం అంటూ అలంపూర్‌ MLA విజయుడు పేరుతో ఫ్లెక్సీ

    • రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా BRS ఫ్లెక్సీలు

  • Aug 13, 2026 15:52 IST

    భారతీయులకు గూగుల్ గుడ్ న్యూస్!

    • పిక్సెల్ వాచ్-5లో ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను గుర్తించే ఫీచర్

    • రక్త పరీక్ష లేకుండానే ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ గుర్తింపు

    • షుగర్ వ్యాధి రాకుండా ముందే జాగ్రత్త పడే ఛాన్స్

    పూర్తికథనం

  • Aug 13, 2026 15:45 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసిన వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, గురుమూర్తి

    • ఏపీలో ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: వైసీపీ ఎంపీలు

    • కేంద్రంపై ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఒత్తిడి తీసుకురావాలి: వైసీపీ ఎంపీలు

    • టీచర్లకు న్యాయం చేయాలి: వైసీపీ ఎంపీలు

    • ఆన్‌లైన్ పరీక్షలు పెట్టడం సరికాదు: వైసీపీ ఎంపీలు

  • Aug 13, 2026 15:39 IST

    లాభ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 113 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

    • 40 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Aug 13, 2026 15:37 IST

    హైదరాబాద్: MLAల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ

    • పిటిషనర్ల తరఫున న్యాయవాది మోహన్‌రావు వాదనలు

    • MLAలు కాంగ్రెస్‌ కండువా కప్పుకుని పార్టీ మారారు: న్యాయవాది మోహన్‌రావు

    • దానం నాగేందర్ పార్టీ మారడమే కాదు.. సికింద్రాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: న్యాయవాది

    • పార్టీ మారినట్టు అన్ని ఆధారాలు ఉన్నా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు: న్యాయవాది

  • Aug 13, 2026 15:23 IST

    తెలంగాణ వ్యాప్తంగా ఈగల్‌ టీమ్‌ ఆపరేషన్‌

    • ఇప్పటివరకు 69 మంది డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్ట్

    • డ్రగ్స్‌ వినియోగిస్తున్న 49 మందిని అదుపులోకి తీసుకున్న ఈగల్‌ టీమ్‌

  • Aug 13, 2026 15:11 IST

    వరంగల్: మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ప్రమాదం

    • వస్త్ర పరిశ్రమ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు టెక్నికల్‌ సిబ్బంది మృతి

    • మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూర్యప్రకాష్‌(31), అభిలాష్‌(30)గా గుర్తింపు

    • గీసుగొండ మండలం శాయంపేట వద్ద ఘటన

    • సిబ్బంది మృతికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

  • Aug 13, 2026 14:55 IST

    మహారాష్ట్ర: నాందేడ్‌లో అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్‌పై దాడి

    • సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు తీవ్రగాయాలు

    • సుఖ్‌బీర్‌ సింగ్‌ను ఆస్పత్రికి తరలింపు

    • గురుద్వారా సందర్శన అనంతరం దాడి

    • సుఖ్‌బీర్‌ సింగ్‌ భద్రతా సిబ్బందికీ గాయాలు

    • దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు

  • Aug 13, 2026 14:53 IST

    అసెంబ్లీ కమిటీ హాల్‌లో సెలెక్ట్ కమిటీ సమావేశం

    • కమిటీ ఛైర్మన్ మంత్రి పొన్నం అధ్యక్షతన భేటీ

    • హేట్ స్పీచ్ బిల్లుపై చర్చిస్తున్న సెలెక్ట్ కమిటీ

    • BRS నుంచి హాజరైన కోవా లక్ష్మి, మాణిక్‌రావు

  • Aug 13, 2026 14:52 IST

    పార్లమెంట్‌ నుంచి ప్రభుత్వం పారిపోయింది: ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

    • ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు: వేం నరేందర్‌రెడ్డి

    • సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చ జరగలేదు: వేం నరేందర్‌రెడ్డి

    • NDA ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి: ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

    • విద్యార్థులపై లాఠీఛార్జ్‌ చేయడం దారుణం: ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

  • Aug 13, 2026 14:47 IST

    సీఎం రేవంత్‌ కుటుంబంపై BRS విష ప్రచారం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • కేటీఆర్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: ఎంపీ చామల

    • భూ కేటాయింపులపై ఆధారాలు లేకుండా ఆరోపణలు: చామల

    • ప్రజలను BRS తప్పుదోవ పట్టిస్తోంది: ఎంపీ చామల

  • Aug 13, 2026 14:39 IST

    ప్రజల అత్యున్నత దేవాలయం పార్లమెంట్: మంత్రి పొన్నం ప్రభాకర్

    • పార్లమెంట్‌కు రాకుండా అమిత్‌ షా తప్పించుకున్నారు: పొన్నం

    • బీజేపీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల గౌరవంలేదు: పొన్నం

    • Gen-Z అంటే బీజేపీకి భయం: మంత్రి పొన్నం

  • Aug 13, 2026 14:35 IST

    నెల్లూరు: మున్సిపల్ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో గందరగోళం

    • నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధీనంలో ఉన్న 40 సెంట్ల పోరంబోకు స్థలం విక్రయానికి అనుమతి ఇవ్వొద్దని వైసీపీ డిమాండ్

    • టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం

    • కమిషనర్ నందన్‌కు వైసీపీ కార్పొరేటర్‌ నాగార్జున వార్నింగ్‌

    • తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతుచూస్తామంటూ బెదిరింపులు

  • Aug 13, 2026 14:23 IST

    అమరావతి: MLA, MLC గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • నూతన భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అందించిన CRDA

    • రాయపూడి వద్ద 12 టవర్లుగా MLA, MLCల నివాస భవనాలు

    • ఒక్కోటి 3,500 చ.అ. విస్తీర్ణంతో 288 ఫ్లాట్లను నిర్మించిన CRDA

  • Aug 13, 2026 14:01 IST

    జగిత్యాల: సీఎం రేవంత్‌రెడ్డికి మహిళల ఉసురు తగులుతుంది: BRS నేత జీవన్‌రెడ్డి

    • షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మిపై హైకోర్టు స్టే విధిస్తుంటే అడ్వొకేట్ జనరల్ ఏం చేస్తున్నారు?

    • రేవంత్‌కు నైతికత ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి

    • సీఎం పదవిని కాపాడుకోవడానికి రేవంత్ అక్రమ మార్గంలో వెళ్తున్నారు: BRS నేత జీవన్‌రెడ్డి

  • Aug 13, 2026 14:00 IST

    హైదరాబాద్: ఎల్బీనగర్‌లో మల్కాజ్‌గిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ దాడులు

    • 97 గ్రాముల హాష్‌ఆయిల్, 110 గ్రాముల గంజాయి పట్టివేత

    • ఇద్దరి అరెస్ట్, కారు, సెల్‌ఫోన్ల స్వాధీనం

  • Aug 13, 2026 13:59 IST

    తెలంగాణకు తీవ్ర నష్టం చేసిన వ్యక్తి కేసీఆర్: యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి

    • స్వలాభం కోసం తెలంగాణ నీటిని తాకట్టు పెట్టారు: ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

    • రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ మాటలు మరిచారా?

    • కేటీఆర్, హరీశ్, జగదీశ్వర్‌రెడ్డి కలిసి తెరపైకి రోజుకో డ్రామా తెస్తున్నారు

    • BRS నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు: ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

  • Aug 13, 2026 13:36 IST

    అమరావతిలో MLA, MLC గృహ సముదాయాల పరిశీలన

    • గృహ సముదాయాలను పరిశీలించిన సీఎం

    • క్వార్టర్స్‌లో వసతులు, సదుపాయాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

  • Aug 13, 2026 13:07 IST

    జయశంకర్ భూపాలపల్లి: మహముత్తారం మండలం ములుగుపల్లిలో అగ్నిప్రమాదం

    • గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మండెపు లక్ష్మీ అనే మహిళ ఇల్లు దగ్ధం

    • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

  • Aug 13, 2026 13:04 IST

    జార్ఖండ్ అసెంబ్లీ మార్చ్ ఘటనలో ప్రభుత్వం చర్యలు

    • 600 మంది నిరసనకారులపై FIR నమోదు

    • నిరసనకారుల్లో 500 మంది విద్యార్థులు

  • Aug 13, 2026 12:51 IST

    హైదరాబాద్: ECI పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: CEO సుదర్శన్‌రెడ్డి

    • ఓటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్ మెసేజ్‌లు: CEO సుదర్శన్‌రెడ్డి

    • ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించొద్దు: CEO సుదర్శన్‌రెడ్డి

    • ఇలాంటి మెసేజ్‌లు ECI, CEO కార్యాలయం నుంచి రావు: సుదర్శన్‌రెడ్డి

    • మోసపూరిత సందేశాలు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి: CEO

  • Aug 13, 2026 12:49 IST

    మైనర్ల ఖాతాలపై మెటా భారీ చర్యలు

    • 7 లక్షలకు పైగా ఖాతాల తొలగింపు

    • ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఖాతాలపై వేటు

    • మైనర్ల ఖాతాల గుర్తింపుపై మెటా దృష్టి

    • మరిన్ని ఖాతాలు తొలగిస్తామని మెటా హెచ్చరిక

    • కొనసాగుతున్న మెటా ఖాతాల తొలగింపు చర్యలు

  • Aug 13, 2026 12:47 IST

    తెలంగాణలో బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పథకం ప్రారంభం

    • సచివాలయంలో పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    • 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి మిషన్ల పంపిణీ

    • మొత్తం 1.19 లక్షల మంది బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు

  • Aug 13, 2026 12:45 IST

    విశాఖ: ఏనుగులు భారత సహజ వారసత్వానికి ప్రతీక: పవన్‌ కల్యాణ్

    • ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • ఏపీలో ప్రస్తుతం 132 నుంచి 142 ఏనుగులు: పవన్‌

    • ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులను తరలించాం: పవన్‌

    • కుంకీ ఏనుగులతో ఇప్పటికే 15 ఆపరేషన్లు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

  • Aug 13, 2026 12:32 IST

    హైదరాబాద్: డీఎస్పీ భీమ్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న ACB

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB కస్టడీకి డీఎస్పీ భీంరెడ్డి

    • సాయంత్రం 5 గంటల వరకూ భీంరెడ్డిని ప్రశ్నించనున్న ACB

    • బినామీల ఆస్తులపై వివరాలను రాబట్టనున్న ACB అధికారులు

    • రెండు రోజుల పాటు కస్టడీకి ACB స్పెషల్ కోర్టు అనుమతి

  • Aug 13, 2026 12:27 IST

    అమరావతి ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి నాదెండ్ల మనోహర్

    • అమరావతి కోసం 30 వేల మంది రైతులు ముందుకొచ్చారు: మంత్రి నాదెండ్ల మనోహర్

    • ల్యాండ్‌ పూలింగ్‌పై అనేక అనుమానాలు సృష్టించారు: నాదెండ్ల

    • సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌తో ప్రయాణం వేగవంతం: మంత్రి నాదెండ్ల

    • అమరావతి అభివృద్ధిలో ఇది చిన్న అడుగుమాత్రమే: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Aug 13, 2026 12:16 IST

    కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కొత్త సర్వీసుల ప్రారంభం

    • వర్చువల్‌గా సర్వీసులను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

    • గన్నవరం నుంచి వారణాసి, కోల్‌కతాకు ఇండిగో సర్వీసులు

    • వారంలో 3 రోజులు గన్నవరం నుంచి సర్వీసులు నడపనున్న ఇండిగో

  • Aug 13, 2026 12:14 IST

    పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా

    • వందేమాతరం గీతాలాపనతో ఉభయసభలు వాయిదా

    • 19 రోజుల పాటు సాగిన పార్లమెంట్‌ ఉభయసభలు

    • 12 బిల్లులను ఆమోదించిన పార్లమెంట్‌

  • Aug 13, 2026 12:13 IST

    మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • బిల్లుపై అభ్యంతరాలు తెలిపిన విపక్షాలు

    • మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం

    • ఇప్పటికే బిల్లును ఆమోదించిన లోక్‌సభ

  • Aug 13, 2026 12:10 IST

    కామారెడ్డి: పట్టణంలో ఘనంగా హర్‌ఘర్ తిరంగా ర్యాలీ

    • గాంధీగంజ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకూ భారీ ర్యాలీ

    • పాల్గొన్న ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

  • Aug 13, 2026 12:01 IST

    ఢిల్లీ: గొప్ప మనసు చాటుకున్న రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్

    • తన తొలి నెల జీతం రూ. 3 లక్షలను ఆర్మీ కుటుంబాలకు విరాళంగా అందజేత

    • దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

    • కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విరాళం చెక్కును అందజేసిన విజయ్

    పూర్తి కథనం..

  • Aug 13, 2026 12:01 IST

    శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో విషాదం

    • సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

    • మృతుడు మంచినీళ్లపేటకు చెందిన సూరాడ విశాఖ(58)గా గుర్తింపు

    • అలల తాకిడికి బోటు బోల్తా పడడంతో ప్రమాదం

    • సురక్షితంగా ఒడ్డుకు చేరిన మరో ఇద్దరు మత్స్యకారులు

  • Aug 13, 2026 11:45 IST

    ఏపీకి గొప్ప చరిత్ర ఉంది: సీఎం చంద్రబాబు

    • అమరావతి రైతుల త్యాగమే కాదు.. స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

    • నాడు రాజధాని ఎక్కడ కట్టాలనే కన్ఫూజన్ ఉండేది: చంద్రబాబు

    • శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు: చంద్రబాబు

    • ప్రజల నిర్ణయం మేరకే అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు

  • Aug 13, 2026 11:36 IST

    అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

    • పి&టి కాలనీలో భారీ దొంగతనం

    • తాళం వేసిన ఇంట్లోకి కిటికీ గ్రిల్ కట్ చేసి చొరబడిన దుండగులు

    • 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి దోచుకెళ్లిన దొంగల ముఠా

    • సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

    • క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించిన పోలీసులు

  • Aug 13, 2026 11:33 IST

    ఖర్గే వ్యాఖ్యలకు జేపీ నడ్డా సమాధానం

    • శుద్ధి ఘటనలను ఖండిస్తున్నాం: జేపీ నడ్డా

    • శుద్ధి ఘటనలను బీజేపీ ప్రోత్సహించదు: నడ్డా

    • ఘటనపై విచారణ జరుపుతున్నాం: జేపీ నడ్డా

    • ఇలాంటి ఘటనను రాజకీయం చేయొద్దు: కేంద్రమంత్రి జేపీ నడ్డా

  • Aug 13, 2026 11:32 IST

    బీజేపీ దళిత వ్యతిరేకి: మల్లికార్జున ఖర్గే

    • ఉత్తరాఖండ్‌లో నా ర్యాలీ తర్వాత స్టేజ్‌ను శుద్ధి చేశారు: ఖర్గే

  • Aug 13, 2026 11:16 IST

    అమరావతి అభివృద్ధిలో మరో కీలక మైలురాయి

    • సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • సీడ్ యాక్సెస్ రోడ్‌తో అమరావతికి కనెక్టివిటీ

    • రూ.1,519 కోట్లతో 21.77 కి.మీ.ల E-3 రహదారి నిర్మాణం

    • బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Aug 13, 2026 11:15 IST

    ఉబర్‌, ఓలా ప్రీ-రైడ్‌ టిప్‌లకు చెక్‌

    • ప్రయాణానికి ముందే టిప్‌ అడగొద్దన్న కేంద్రం

    • యాప్‌లలో ప్రీ-రైడ్‌ టిప్‌ ఆప్షన్‌ తొలగింపు

    • ప్రయాణం తర్వాతే టిప్‌ ఇవ్వాలని స్పష్టీకరణ

    • టిప్‌ పూర్తిగా స్వచ్ఛందమేనన్న కేంద్రం

    • టిప్‌ ఇవ్వకపోయినా సేవలపై ప్రభావం ఉండదు

  • Aug 13, 2026 11:14 IST

    బంగ్లాదేశ్‌లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు

    • షాపింగ్ మాల్స్, మార్కెట్లు, షాపులకు ఆంక్షలు

    • ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకే వ్యాపారం చేసుకోవాలని ఆంక్షలు

    • ఇప్పటికే అదనంగా డీజిల్ సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించిన బంగ్లాదేశ్

  • Aug 13, 2026 11:10 IST

    తిరుపతి: యల్లంపల్లిలో ఏనుగుల హల్‌చల్

    • వరి పంటలను ధ్వంసం చేసిన 15 ఏనుగులు

    • భయాందోళనలో రైతులు, గ్రామస్థులు

  • Aug 13, 2026 11:05 IST

    లోక్‌సభ నిరవధిక వాయిదా

    • లోక్‌సభలో వందేమాతర గీతాలాపన

    • 19 రోజుల పాటు వాయిదాలతోనే సాగిన సభ

  • Aug 13, 2026 11:03 IST

    ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

    • ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్ ఆర్మీ

    • అదియాలా జైలులో ఇమ్రాన్ పరిస్థితిపై PTI ఆందోళన

    • ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని డిమాండ్

    • కలవనివ్వకపోతే జైలును ముట్టడిస్తామని హెచ్చరిక

  • Aug 13, 2026 10:59 IST

    అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

    • ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటించిన అమెరికాలోని రాష్ట్రాలు

    • న్యూయార్క్‌, న్యూజెర్సీ గవర్నర్ల ప్రకటన

    • మసాచుసెట్స్‌, డెలావేర్‌ కూడా ప్రకటన

    • భారత పతాకాలతో వేడుకలకు ఏర్పాట్లు

    • ఎంపైర్‌ స్టేట్‌ భవనంపై త్రివర్ణ లైటింగ్‌

    పూర్తి కథనం..

  • Aug 13, 2026 10:30 IST

    కొలంబియా సరిహద్దులో భారీగా కొకైన్ పట్టివేత

    • 469 కిలోల కొకైన్ సీజ్ చేసిన ఈక్వెడార్ పోలీసులు

  • Aug 13, 2026 10:20 IST

    సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ

    • రేవంత్.. మీరు ముఖ్యమంత్రా? లేక రియల్ఎస్టేట్ ఏజెంటా?: హరీశ్ రావు

    • ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా?: హరీశ్ రావు

    • నాడు భూములు కాపాడాలని కోర్టుకెళ్లి.. నేడు అడ్డుగోలుగా అమ్మకాలా?

    • రాయదుర్గంలో భూములు అమ్మే కుట్రలు ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు

  • Aug 13, 2026 10:11 IST

    తూ.గో.: రాజమండ్రి పీఎస్ పరిధిలో గంజాయి పట్టివేత

    • రూ.4.29లక్షల విలువైన 25.970 కేజీల గంజాయి పట్టివేత

    • సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో గంజాయి గుర్తింపు

    • ఇద్దరి అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు, కేసు నమోదు

    పూర్తి కథనం..

  • Aug 13, 2026 10:08 IST

    వరంగల్: నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ వివాదం

    • అనుమతి లేకుండా మెడికల్ కాలేజీ సమీపంలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారన్న మున్సిపల్ అధికారులు

    • ప్రైవేట్ భూమిలో ఏర్పాటు చేసుకుంటే తప్పేంటంటున్న BRS

    • విగ్రహం దగ్గర నిన్నటి నుంచి మోహరించిన పోలీసులు

    • విగ్రహం తొలగిస్తే ఊరుకునేది లేదంటున్న BRS శ్రేణులు

  • Aug 13, 2026 09:49 IST

    ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

    • మాకు అమెరికా 10శాతం ఆయుధాలు విక్రయిస్తే.. రష్యా క్షిపణులను నాశనం చేస్తాం

    • ప్రస్తుతం మా దగ్గర 1శాతం మాత్రమే ఆయుధాలు ఉన్నాయి: జెలెన్‌స్కీ

  • Aug 13, 2026 09:45 IST

    ఢిల్లీ పేలుళ్ల వెనుక 'అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' హస్తం

    • ధ్రువీకరించిన ఐరాస నివేదిక

    • తాలిబన్ల నుంచి ఈ సంస్థకు మద్దతు

    • అత్యంత ప్రమాదకరమైన రైసిన్ తయారీ బాధ్యతను ఐసిస్‌కు చెందిన వ్యక్తికి అప్పగింత

    • అతడిని భారత అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం

    పూర్తి కథనం..

  • Aug 13, 2026 09:34 IST

    అవయవదానం.. మానవత్వానికి ప్రతీక: డిప్యూటీ సీఎం పవన్

    • అవయవదానం సామాజిక బాధ్యతకు నిదర్శనం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పవన్

    • దేశంలో అవయవదానంపై విస్తృత అవగాహన కల్పించాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పవన్

  • Aug 13, 2026 09:31 IST

    అనకాపల్లి: నక్కపల్లిలో హోంమంత్రి అనిత పర్యటన

    • రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింటి ప్రచారం

    • ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన అనిత

  • Aug 13, 2026 09:15 IST

    ములుగు: మంగపేట మండలం కమలాపూర్‌లో వ్యక్తి హత్య

    • తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శేషును గొడ్డలితో నరికి చంపిన నర్సింహారావు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 13, 2026 09:00 IST

    ఏలూరు: ACB డీఎస్పీ పేరుతో సైబర్ మోసం

    • ఏలూరు నగరపాలక సంస్థ ఈఈ నుంచి రూ.లక్ష కాజేసిన వైనం

    • వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈఈ సురేంద్రబాబు, కేసు నమోదు

  • Aug 13, 2026 08:45 IST

    కర్నూలు: తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

    • పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.. ప్రస్తుతం:1628.20 అడుగులు

    • ఇన్ ఫ్లో 26,834 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 2,266 క్యూసెక్కులు..

    • పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు.. ప్రస్తుతం 87.454 టీఎంసీలు

  • Aug 13, 2026 08:30 IST

    హైదరాబాద్: హనుమాన్‌నగర్‌లో కిడ్నాప్ కలకలం

    • బాకీ తీర్చలేదని రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నం

    • రూ.30వేల అప్పు ఇచ్చేవరకూ బాలికను తీసుకెళ్తానని బెదిరింపులు

    • డయల్ 100కు బాధితుల ఫిర్యాదు, నిందితుడి అరెస్ట్

  • Aug 13, 2026 08:15 IST

    టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ అధ్యక్షతన రాత్రి 7గంటలకు టీకాంగ్రెస్ జూమ్ మీటింగ్

    • పాల్గొననున్న మీనాక్షి, రేవంత్, సచిన్ సావంత్, మంత్రులు, ఇన్‌ఛార్జ్‌లు

    • తెలంగాణలో SIR ప్రక్రియపై చర్చించనున్న నేతలు

  • Aug 13, 2026 08:00 IST

    నాగర్‌కర్నూల్: వెల్దండ మండలం కొట్రలో వివాహిత దారుణ హత్య

    • వివాహిత అనూషను హతమార్చి, మృతదేహాన్ని తగలబెట్టిన దుండగులు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 13, 2026 07:45 IST

    నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద నీరు

    • ఇన్ ఫ్లో : 26,939 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 71,176 క్యూసెక్కులు

    • పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 879.50 అడుగులు

    • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం : 185.5638 టీఎంసీలు

  • Aug 13, 2026 07:30 IST

    బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం

    • పిల్లలను కనడానికే USకు వచ్చేవారిని నియంత్రిస్తోన్న ట్రంప్ సర్కార్

    • గత నెలలో 9వ నెల గర్భంతో USకు వచ్చిన 600 మంది వీసాల రద్దు

    • వీసాలను పరిశీలించి రద్దు చేసిన బర్త్ టూరిజం నిరోధక టాస్క్‌ఫోర్స్

    • US పౌరసత్వం అమ్మకానికి లేదన్న విదేశాంగ మంత్రి మార్కో రుబియో

  • Aug 13, 2026 07:20 IST

    కర్నూలు: ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద జగన్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు

    • ‘డీఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలి’

    • ‘ఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించేందుకు రావడానికి సిగ్గుందా’

    • ‘దమ్ముంటే అభివృద్ధిపై చర్చించడానికి అసెంబ్లీకి రా జగన్’

    • టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ పేరుతో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఫ్లెక్సీలు

  • Aug 13, 2026 07:15 IST

    అనకాపల్లి: నేడు నక్కపల్లిలో హోంమంత్రి అనిత పర్యటన

    • ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న హోంమంత్రి

  • Aug 13, 2026 07:00 IST

    నేడు విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం

    • హాజరుకానున్న కేంద్ర మంత్రి భూపేందర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • Aug 13, 2026 06:45 IST

    నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

    • నేడు విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో చర్చ

  • Aug 13, 2026 06:40 IST

    నేడు కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాల పిలుపు

    • కావేరి జలాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్

    • అప్రమత్తమైన పోలీసులు.. కీలక ప్రాంతాల్లో భద్రత పెంపు

    • బంద్ ప్రభావంతో రవాణా, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం

  • Aug 13, 2026 06:37 IST

    తెలంగాణలో వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు

    • ఇవాళ, రేపు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

  • Aug 13, 2026 06:37 IST

    ఏపీ అసెంబ్లీలో స్వాతంత్య్ర సంబరాలు

    • మన సభ-జన సభ పేరుతో సంబరాలు

    • ప్రజలకు ఏటా 4 రోజులు అసెంబ్లీ సందర్శనకు అవకాశం

    • రేపు, ఎల్లుండి సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకూ సందర్శన

    • విద్యార్థులకు అసెంబ్లీ మెయిన్‌హాల్‌ చూసేందుకు అవకాశం

  • Aug 13, 2026 06:37 IST

    ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవాలకు ఏర్పాట్లు

    • పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఢిల్లీలో హైఅలర్ట్‌

    • ఉగ్రముప్పు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత

    • ఎర్రకోట చుట్టూ భారీగా భద్రతా బలగాల మోహరింపు

    • కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు, నిరంతర నిఘా

  • Aug 13, 2026 06:30 IST

    కర్నూలు జిల్లాలో జగన్‌ పర్యటనపై పోలీసుల ప్రకటన

    • ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందన్న ఎస్పీ విక్రాంత్‌

    • కాన్వాయ్‌ వాహనాలకు మాత్రమే అనుమతి

    • జగన్‌ కాన్వాయ్‌కు బందోబస్తు ఇస్తామన్న ఎస్పీ

    • మధ్యాహ్నం 12:30 గంటలకు ములాఖత్‌

    • కర్నూలులో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందన్న ఎస్పీ

  • Aug 13, 2026 06:25 IST

    నేడు కర్నూలులో మాజీ సీఎం జగన్‌ పర్యటన

    • జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని కలవనున్న జగన్‌

    • అనంతరం విరూపాక్షి కుటుంబానికి జగన్‌ పరామర్శ

  • Aug 13, 2026 06:20 IST

    నేడు విరూపాక్షి బెయిల్‌పై ఆదోని కోర్టులో విచారణ

    • ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి

  • Aug 13, 2026 06:18 IST

    త్రయంబకేశ్వర్‌ ఆలయంలో వీఐపీ దర్శనాల రద్దు

    • నేటి నుంచి సెప్టెంబర్‌ 13 వరకూ వీఐపీ దర్శనాల రద్దు

  • Aug 13, 2026 06:15 IST

    నేడు ఖమ్మంలో సీపీఐ ప్రజాచైతన్య యూత్ర ముగింపు సభ

    • సభకు హాజరుకానున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

  • Aug 13, 2026 06:12 IST

    నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో CBI ఛార్జ్‌షీట్‌

    • CBI అభియోగాలపై నేడు కోర్టు విచారణ

    • 13 మందిపై CBI అభియోగాలు

    • 20 వేల పేజీలతో CBI ఛార్జ్‌షీట్‌

  • Aug 13, 2026 06:10 IST

    హైదరాబాద్‌: ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ పథకానికి నేడు శ్రీకారం

    • సచివాలయంలో పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

    • 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి మిషన్ల పంపిణీ

    • మొత్తం 1,19,000 మంది బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు

  • Aug 13, 2026 06:05 IST

    హైదరాబాద్: క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి నేడు శ్రీకారం

    • నేడు కూకట్‌పల్లిలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం

    • తొలి విడతలో 7,680 ఫ్లాట్లను నిర్మించనున్న ప్రభుత్వం

  • Aug 13, 2026 06:02 IST

    హైదరాబాద్‌: నేడు సెలక్ట్‌ కమిటీ సమావేశం

    • కమిటీ చైర్మన్‌ మంత్రి పొన్నం అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 గంటలకు భేటీ

    • హేట్‌ స్పీచ్‌ బిల్లుపై చర్చించనున్న సెలక్ట్ కమిటీ

  • Aug 13, 2026 06:00 IST

    నేడు సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన

    • స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • స్టీల్ బ్రిడ్జి, బహిరంగ సభా వేదిక దగ్గర ఏర్పాట్లు