-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Breaking Live Updates of 12th May 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 12 , 2026 | 05:46 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 12, 2026 21:17 IST
నంద్యాల: ప్యాపిలి మండలం వెంగళంపల్లె చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం
బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన జేసీబీ
ఒకరి మృతి, ముగ్గురికి స్వల్ప గాయాలు
-
May 12, 2026 21:03 IST
పుదుచ్చేరి సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న రంగసామి
16వ శాసనసభకు ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎన్.రంగసామి
సీఎంతో పాటు ఇద్దరు సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం
-
May 12, 2026 20:40 IST
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం
డీసీపీ రితిరాజ్ సమక్షంలో బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు
బాధితురాలి స్టేట్‌మెంట్ తర్వాత పోక్సో సెక్షన్ల మార్పు
భగీరథ్‌పై పోక్సో సెక్షన్ 5(1) రీడ్ విత్ 6ను యాడ్ చేసిన పోలీసులు
-
May 12, 2026 20:05 IST
కరీంనగర్: భగీరథ్ అంశంపై స్పందించిన బండి సంజయ్
నా కుమారుడు నిజాయతీగా బయటకు వస్తా అన్నాడు: బండి సంజయ్
నా కుమారుడిని క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు: బండి సంజయ్
మేం కలిసి ఉన్నామని నా కుమారుడు చెప్పాడు: బండి సంజయ్
నా కుమారుడు తప్పు చేస్తే శిక్ష పడుతుంది: బండి సంజయ్
చట్టం ముందు అందరూ సమానమే: బండి సంజయ్
తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదు: బండి సంజయ్
-
May 12, 2026 20:01 IST
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున
తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాడుకుంటూ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ పిటిషన్
నాగార్జున టీ-షర్టులు మీరెలా అమ్ముతారంటూ వ్యాపారిని ప్రశ్నించిన హైకోర్టు
నాగార్జున పేరు, చిత్రాలతో టీ-షర్టులను విక్రయించడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
తదుపరి విచారణ ఆగస్టు 3కు వాయిదా
-
May 12, 2026 19:45 IST
హైదరాబాద్: బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు
పోక్సో కేసులో నోటీసులు జారీ చేసిన సిట్
రేపు మ. 2 గంటలకు విచారణకు హాజరు కావాలన్న సిట్
రేపు పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో సిట్ విచారణ
-
May 12, 2026 19:45 IST
ఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై సీబీఐ కేసు నమోదు
కేంద్ర విద్యాశాఖ లిఖితపూర్వక ఫిర్యాదుతో కేసు నమోదు
-
May 12, 2026 19:39 IST
హైదరాబాద్: మూడేళ్ల క్రితం జరిగిన బాలుడి హత్య కేసు నిందితుడికి మరణ శిక్ష
2023లో సనత్ నగర్‌లో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసు
నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్(33)కు మరణ శిక్షించిన కూకట్‌పల్లి కోర్ట్
నిందితుడికి సహకరించిన మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధింపు
-
May 12, 2026 19:13 IST
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన కీలక సమావేశం
పాల్గొన్న అటవీ, రెవెన్యూ, పర్యావరణ, దేవాదాయ శాఖల అధికారులు
తెలంగాణలోని చెరువులు, సరస్సుల పరిరక్షణపై చర్చ
వెట్‌ల్యాండ్స్ అభివృద్ధి కార్యాచరణపై సమీక్ష
చెరువుల ఆక్రమణల నివారణపై అధికారులకు కొండా సురేఖ దిశానిర్దేశం
-
May 12, 2026 19:02 IST
హైదరాబాద్: మంత్రి పొన్నం వ్యాఖ్యలను ఖండించిన మహేశ్ గౌడ్
బండి భగీరథ్ వ్యవహారంలో పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: మహేశ్
పార్టీకి, ప్రభుత్వానికి పొన్నం వ్యాఖ్యలతో సంబంధం లేదు: మహేశ్ గౌడ్
వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదు: మహేశ్ గౌడ్
-
May 12, 2026 18:39 IST
ఏపీ: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు రేపటి వరకు పొడిగింపు
IPASE మే-2026 ఎగ్జామ్‌కు రూ.5 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు అవకాశం
-
May 12, 2026 18:22 IST
పల్నాడు: ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సైదాబి, చంద్ర
సైదాబి (26) మృతి, చంద్ర పరిస్థితి విషమం
-
May 12, 2026 18:13 IST
కడప: పెద్ద దస్తగిరి కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి
నిత్యానందరెడ్డికి 14 రోజుల రిమాండ్, కడప జైలుకు తరలింపు
-
May 12, 2026 18:06 IST
ఏపీ ఎన్నికల కమిషన్ కీలక సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై అధికారులతో సమీక్ష
SEC అనిల్‌చంద్ర అధ్యక్షతన సమావేశం
హాజరైన పంచాయతీరాజ్, మున్సిపల్, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు
గ్రామ పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలపై చర్చ
-
May 12, 2026 17:43 IST
ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మరోసారి జాతీయ అవార్డులు
క్లైమెట్ యాక్షన్ విభాగంలో కందులవారిపల్లెకు(చిత్తూరు), ఆత్మనిర్భర్ విభాగంలో కాణిపాకంకు(చిత్తూరు) అవార్డు
సంస్థల విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్‌కు పురస్కారం
కూటమి ప్రభుత్వ హయాంలో 23 నెలల్లో 19 జాతీయ అవార్డులు సాధించిన ఏపీ
ఒకేరోజు అత్యధిక గ్రామసభల నిర్వహణతో జాతీయస్థాయిలో రికార్డు సాధించిన ఏపీ
-
May 12, 2026 17:22 IST
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం
పర్సంటేజ్ విధానం, సినిమాల రన్ టైమ్, చిన్న, పెద్ద సినిమాలకు ఒకే విధానంపై చర్చ
సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యంపై చర్చ
-
May 12, 2026 17:07 IST
సంగారెడ్డి: పటాన్‌చెరు శ్రీరామ్ ఆటో ఫైనాన్స్‌లో అగ్ని ప్రమాదం
వాహనాల గోడౌన్‌లో చెలరేగిన మంటలు, భారీగా కార్లు దగ్ధం
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
-
May 12, 2026 16:54 IST
తమిళనాడు సీఎం విజయ్ ఆదేశాలతో CMDA అధికారులపై కఠిన చర్యలు
పారదర్శక పాలన కోసం సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన రోజే కీలక ప్రకటన
ప్రాజెక్ట్ అనుమతులు, వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ల వంటి సేవల్లో ఆలస్యం జరగకూడదని సీఎం స్పష్టం
-
May 12, 2026 16:48 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
48 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం
రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక వరకు ద్రోణి
ఐదు రోజులపాటు కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం
-
May 12, 2026 16:47 IST
ఢిల్లీ: కేంద్రానికి నీతి ఆయోగ్ కీలక సిఫార్సు
రెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా భారీ నిర్మాణ పనులను నిషేధించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు
పశ్చిమాసియా సంక్షోభంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ
భారీగా పెరిగిన నిర్మాణ ఖర్చులు, దిగుమతి ధరలు
సెంట్రల్ సెక్రటేరియట్ పునర్నిర్మాణ పనులను వాయిదా వేసిన కేంద్రం
-
May 12, 2026 16:32 IST
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
AIADMK రెబల్ MLAలతో సీఎం విజయ్ భేటీ
షణ్ముగం, వేలుమణితో విజయ్ సమావేశం
సీఎం విజయ్‌కి 30 మంది రెబల్ ఎమ్మెల్యేల మద్దతు
-
May 12, 2026 16:24 IST
రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సమన్లు
రేపు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
బీసీల రిజర్వేషన్ల కోసం కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కవిత
కవితతో పాటు మరో 12 మంది TRS నేతలపైనా కేసులు
-
May 12, 2026 16:16 IST
అన్నమయ్య: పుంగనూరు మండలం పట్రపల్లిలో విషాదం
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
మృతులు వరుణ్ (13), నీలేశ్ (8)
-
May 12, 2026 16:14 IST
పాకిస్థాన్: ఖైబర్ పఖ్తుంక్వా రాష్ట్రం లక్కీ మార్వాత్‌లో బాంబు పేలుడు
ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఓ మహిళ ఉన్నట్లు అధికారుల వెల్లడి
-
May 12, 2026 16:13 IST
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యుల నియామకం
ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కలెక్టర్లను నామినేట్ చేసిన ప్రభుత్వం
విశాఖపట్నం కలెక్టర్‌కు ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం
తిరుపతి కలెక్టర్‌కు రాయలసీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం
-
May 12, 2026 16:01 IST
విజయవాడ: APEAPCET పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.మధుమూర్తి
ఈ ఏడాది ఎంట్రెన్స్ రాస్తున్న 3.55 లక్షల మంది విద్యార్థులు
-
May 12, 2026 15:50 IST
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 1,450, నిఫ్టీ 430 పాయింట్ల నష్టం
-
May 12, 2026 15:38 IST
హైదరాబాద్: జలసౌధలో KRMB త్రిసభ్య కమిటీ భేటీ
పాల్గొన్న KRMB కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ENCలు, ఇంజినీర్లు
తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చ
ఈ నెలాఖరుకు సాగర్ కుడి కాలువ నుంచి 10 TMCలు కోరిన ఏపీ
ఏపీ ఇప్పటికే వాటాకు మించి నీటిని వినియోగించిందన్న తెలంగాణ
-
May 12, 2026 15:26 IST
చెన్నై: AMMK వ్యవస్థాపకుడు దినకరన్ సంచలన ప్రకటన
ఏకైక MLA కామరాజన్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్
TVKకు మద్దతు ఇవ్వడంతో కామరాజ్‌ను బహిష్కరించిన దినకరన్
-
May 12, 2026 15:11 IST
కర్నూలు: ట్రాఫిక్ పీఎస్ ఎస్సై హరి ప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగింపు
నంద్యాలకు చెందిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఉన్నతాధికారుల నిర్ణయం
-
May 12, 2026 15:07 IST
అమరావతి: TDP జోనల్ కోఆర్డినేటర్లకు జిల్లాల కేటాయింపు
10 మంది జోనల్ కోఆర్డినేటర్లకు జిల్లాల కేటాయింపు
-
May 12, 2026 15:06 IST
విజయవాడ: పటమటలంకలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్‌తో ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌లో చెలరేగిన మంటలు
పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించిన మంటలు
భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో ధ్వంసమైన బాల్కనీ గోడ
పక్క అపార్ట్‌మెంట్ వారికి గోడ రాళ్లు తగలడంతో ఒకరి మృతి
మంటలార్పిన ఫైర్ సిబ్బంది, కేసు నమోదు
-
May 12, 2026 15:04 IST
ఛత్తీస్‌గఢ్: అబూజ్‌మడ్ అడవుల్లో భారీ డంప్ స్వాధీనం
మావోయిస్టు డంప్‌లో రూ.1.64 కోట్ల నగదు, రాకెట్ లాంఛర్లు, SLRలు, రైఫిల్స్, AK47లను గుర్తించిన పోలీసులు
బాంబుల తయారీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
-
May 12, 2026 14:58 IST
ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం
పాల్గొన్న కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, MLAలు, MLCలు, ముఖ్యనేతలు
పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలతో పాటు ఇన్‌ఛార్జ్‌ల నియామకంపై చర్చ
-
May 12, 2026 14:54 IST
నీట్ 2026 పరీక్ష రద్దుపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ
విద్యార్థుల కష్టాలను, కలలను అవినీతి BJP ప్రభుత్వం అణచివేసింది: రాహుల్
ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో అవినీతి వల్లే పేపర్ లీక్: రాహుల్
ఇది కేవలం వైఫల్యం కాదు.. యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరం: రాహుల్
ప్రధాని అమృత్ కాలం, దేశానికి విష యుగంగా మారింది: రాహుల్
-
May 12, 2026 14:43 IST
తమిళనాడు: సీఎం విజయ్ OSDగా పండిట్ వెట్రివేల్
వ్యక్తిగత జ్యోతిష్యుడిని OSDగా నియమించిన విజయ్
-
May 12, 2026 14:39 IST
నీట్ పరీక్ష రద్దుకు కేంద్రం బాధ్యత వహించాలి: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు అకడమిక్ ఇయర్‌ను కోల్పోయే అవకాశం ఉంది: ఎంపీ
నీట్ పరీక్ష రద్దుపై బీజేపీ ప్రభుత్వం చర్చ చేపట్టాలి: ఎంపీ
విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుడి అవసరం బీజేపీకి వద్దా: ఎంపీ కిరణ్ రెడ్డి
-
May 12, 2026 14:31 IST
దేశంలో ఇంధన కొరత లేదు: కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి
69 రోజులకు సరిపడా క్రూడాయిల్, ఎల్ఎన్‌జీ నిల్వలు ఉన్నాయి: మంత్రి
45 రోజులకు సరిపడా ఎల్‌పీజీ స్టాక్ ఉంది: మంత్రి హర్దీప్ సింగ్ పురి
ఎల్‌జీపీ ఉత్పత్తి రోజుకు 35,000 నుంచి 54,000 టన్నులకు పెంపు: మంత్రి
-
May 12, 2026 14:24 IST
మరోసారి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి: ఉదయనిధి స్టాలిన్
అన్ని చోట్లా తమిళ భాషకు ప్రాధాన్యం ఉండాలి: ఉదయనిధి
సీఎం ప్రమాణ స్వీకారంలో వందేమాతరం, జనగణమన తర్వాత తమిళ గీతం పాడటం అభ్యంతరకరం: ఉదయనిధి
రాష్ట్ర గీతం ప్రథమ స్థానంలో ఉండాల్సింది: ఉదయనిధి
-
May 12, 2026 14:20 IST
హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన
నేపాలీ పని మనుషులను ఇంట్లో పెట్టుకునేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
నేపాలీలు పనిచేస్తున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
నేపాలీల వ్యక్తిగత వివరాలు అందజేసి వెరిఫికేషన్ చేయించుకోవాలని విజ్ఞప్తి
-
May 12, 2026 14:14 IST
పాకిస్థాన్‌లోని లక్కీ మర్వాత్‌లో కారు బాంబు పేలుడు
8 మంది మృతి, 35 మందికి గాయాలు
మృతుల్లో పోలీసులు, మహిళలు
-
May 12, 2026 14:11 IST
హైదరాబాద్: జలవిహార్‌లో తెలంగాణ జనసమితి ప్లీనరీ
నా తర్వాతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు: కోదండరాం
కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం నడిచింది: కోదండరాం
BRS ప్రభుత్వంలో ఉద్యమకారులకు గుర్తింపు లేదు: కోదండరాం
-
May 12, 2026 13:06 IST
హైదరాబాద్: హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు
పేట్ బషీరాబాద్ పీఎస్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు
మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్
హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో పిటిషన్
పిటిషన్‌పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ
-
May 12, 2026 12:50 IST
కర్ణాటక: బీదర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడిన కర్ణాటక ఆర్టీసీ బస్సు
ఐదుగురి మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం
మృతుల్లో ఇద్దరు సంగారెడ్డి జిల్లా వాసులు
క్షతగాత్రులను బీదర్‌లోని ఆస్పత్రికి తరలింపు
బస్సు బీదర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా జరిగిన ప్రమాదం
-
May 12, 2026 12:29 IST
అమరావతికి భూములిచ్చిన రైతులకు 98 శాతం ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ
రాజధానిలో నిబంధనల ప్రకారమే ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ
రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ రాద్ధాంతం: మంత్రి నారాయణ
-
May 12, 2026 12:28 IST
కడప: వైసీపీ నేత నిత్యానందరెడ్డికి రిమ్స్‌లో వైద్య పరీక్షలు
నిత్యానంద రెడ్డిని కడప చిన్నచౌక్ పీఎస్‌లో 11 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి ప్రధాన నిందితుడు
-
May 12, 2026 12:21 IST
పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్ష రద్దు
మే 3న నిర్వహించిన NEET-UG 2026 పరీక్ష రద్దు
రాజస్థాన్‌లో పేపర్ లీక్.. సీబీఐ దర్యాప్తు
త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తాం: NTA
-
May 12, 2026 12:20 IST
అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం
హాజరైన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, NDA పాలిత రాష్ట్రాల సీఎంలు
అస్సాంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం
సీఎంగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ ప్రమాణం
-
May 12, 2026 11:32 IST
చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం
హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో మ్యూజియం ప్రారంభం
జైల్లో మ్యూజియం, ఫీల్ ది జైల్ పేరుతో బ్లాక్ ఓపెన్
ఇప్పటికే గోవా, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో జైలు మ్యూజియంలు
-
May 12, 2026 11:29 IST
హైదరాబాద్: కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
ధాన్యం కొనుగోలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష
-
May 12, 2026 11:27 IST
తమిళనాడు స్పీకర్‌గా TVK ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ ఎన్నిక
తమిళనాడు డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ (TVK) ఎన్నిక
సభానాయకుడిగా సెంగోటియన్ (TVK), విపక్ష నేతగా ఉదయనిధి (DMK)
TVK ప్రభుత్వ బలపరీక్షకు రేపటితో ముగియనున్న గడువు
-
May 12, 2026 11:26 IST
TVK ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతికి షాక్
బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశం
శ్రీనివాస్ గెలుపును సవాల్ చేసిన DMK అభ్యర్థి పెరియకురుప్పన్
తిరుపత్తూరు నుంచి ఒక్క ఓటుతో గెలిచిన శ్రీనివాస్
-
May 12, 2026 11:24 IST
కాసేపట్లో సోనియా గాంధీతో కేరళం ముఖ్యనేతల భేటీ
సీఎం ఎంపిక, కేబినెట్ కూర్పుపై కసరత్తు
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, సతీషన్, చెన్నితల
-
May 12, 2026 10:44 IST
మధ్యప్రదేశ్: రాజ్‌ఘడ్‌లోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం
బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు
12 మందికి గాయాలు, పలు బైక్‌ల దగ్ధం
-
May 12, 2026 10:43 IST
ములుగు: మంగపేట మండలం కమలాపురంలో దొంగల బీభత్సం
ఓ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి అపహరణ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 12, 2026 10:29 IST
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు జైలు శిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో నేరం నిరూపణ కావడంతో జైలు శిక్ష
-
May 12, 2026 10:23 IST
తమిళనాడు సీఎంవో ఎక్స్ ఖాతాకు భారీగా ఫాలోవర్లు
గతంలో కేవలం 4.4 లక్షల ఫాలోవర్లు
విజయ్ పదవి చేపట్టిన తర్వాత 20 లక్షలు దాటిన ఫాలోవర్లు
-
May 12, 2026 10:23 IST
ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ
డాలర్‌తో పోలిస్తే రూ.95.63కు చేరిన రూపాయి
-
May 12, 2026 10:15 IST
యాదాద్రి: చౌటుప్పల్‌లో అక్రమంగా తరలిస్తున్న 25 గోవుల పట్టివేత
రాజమండ్రి నుంచి హైదరాబాద్ బహదూర్‌పురకు డీసీఎంలో తరలిస్తున్న వైనం
అనుమానం రాకుండా పైన సిమెంట్ ఇటుకలు పెట్టి మరీ తరలింపు
వాహనాన్ని ఆపి.. పోలీసులకు అప్పగించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు
-
May 12, 2026 10:02 IST
కాసేపట్లో అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం
హాజరుకానున్న ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు
పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
-
May 12, 2026 09:49 IST
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు
భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయిన పసునూరి నరహరి
జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో నరహరి కీలక బాధ్యతలు
-
May 12, 2026 09:28 IST
చెన్నై: AIADMKలోని సీవీ షణ్ముగం వర్గం కీలక నిర్ణయం
TVK చీఫ్, సీఎం విజయ్‌కి మద్దతు ప్రకటన
సీవీ షణ్ముగం వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు
-
May 12, 2026 09:18 IST
అమరావతి: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన
చివరి దశకు చేరిన MLA, MLC టవర్స్ నిర్మాణ పనుల పరిశీలన
మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నారాయణ ఆదేశం
-
May 12, 2026 09:16 IST
తమిళనాడు: మద్యం దుకాణాలపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
ప్రార్థన మందిరాలు, విద్యాసంస్థలు, బస్టాండ్ల సమీపంలో మద్యం షాపులు లేకుండా చర్యలు
2 వారాల్లో మూసివేయాలని ఆదేశం
-
May 12, 2026 08:27 IST
ఉదయం 11గంటలకు కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
ధాన్యం కొనుగోలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష
-
May 12, 2026 07:28 IST
చిత్తూరులో ఘనంగా ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
తొలిపూజలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు
పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులు
-
May 12, 2026 07:22 IST
నేడు తాడేపల్లిలో వైసీపీ ముఖ్యనేతలతో జగన్ భేటీ
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్
-
May 12, 2026 07:21 IST
గుంటూరు: పొన్నూరు సమీపంలో కాల్పుల కలకలం
ఆలూరు-కొండముడి మధ్య రైల్వే ట్రాక్‌పై కాల్పులు
గస్తీలో ఉన్న రైల్వే పోలీసులపై రాళ్లు రువ్విన దొంగలు
కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు.. పరారైన దొంగలు
గతంలో ఇదే మార్గంలో అప్పికట్ల దగ్గర రైల్లో చోరీ
-
May 12, 2026 07:21 IST
నేడు అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం
హాజరుకానున్న ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు
పాల్గొననున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్
-
May 12, 2026 07:19 IST
నేడు కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర
పాల్గొననున్న హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి
సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభం.. పోలీసుల భారీ బందోబస్త్
-
May 12, 2026 07:18 IST
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు
జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతుల ప్రారంభం
-
May 12, 2026 07:17 IST
అమరావతి: నేడు ఏపీలో రెండో రోజు వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన
రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్న బృందం
-
May 12, 2026 07:03 IST
నేడు హనుమాన్ జయంతి వేడుకలు
కొండగట్టుకు భారీగా తరలిరానున్న భక్తులు
-
May 12, 2026 06:34 IST
నేడు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎన్నికలో సందిగ్ధత
47 మందిలో 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పళనిస్వామికి మద్దతు
షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేల సమావేశం
స్పీకర్ ఎన్నికలో షణ్ముగం TVKకు మద్దతు ఇచ్చే అవకాశం
-
May 12, 2026 06:34 IST
IPL: నేడు గుజరాత్ Vs హైదరాబాద్ మ్యాచ్
అహ్మదాబాద్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
-
May 12, 2026 05:49 IST
రేపు చైనా పర్యటనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్
బుధవారం నుంచి శుక్రవారం వరకు ట్రంప్ చైనా పర్యటన
-
May 12, 2026 05:48 IST
హైదరాబాద్: నేడు KRMB కీలక సమావేశం
మధ్యాహ్నం 3:30 గంటలకు జలసౌధలో త్రిసభ్య కమిటీ భేటీ
తాగునీటి అవసరాలపై చర్చించనున్న త్రిసభ్య కమిటీ
-
May 12, 2026 05:47 IST
నేడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసర సమావేశం
సింగిల్ స్రీన్ థియేటర్ల భవితవ్యంపై భేటీలో చర్చ
ఎగ్జిబిటర్స్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
May 12, 2026 05:47 IST
నేడు అస్సాం గౌహతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
అస్సాం సీఎంగా నేడు హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం
హిమంత ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న చంద్రబాబు
-
May 12, 2026 05:46 IST
అమరావతి: నేటి నుంచి EAPCET-2026 పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి నో ఎంట్రీ
18 నుంచి ఇంజినీరింగ్, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్