Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 20 , 2026 | 06:06 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 20, 2026 21:32 IST

    తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ ఇన్‌ఛార్జ్‌ల నియామకం

    • 33 జిల్లాలకు రాష్ట్ర, జిల్లాల ఇన్‌చార్జ్‌లను నియమించిన కవిత

    • 119 అసెంబ్లీ నియోజకవర్గాలకూ TRS ఇన్‌ఛార్జ్‌ల నియామకం

  • May 20, 2026 21:04 IST

    బెంగళూరు: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు

    • ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమం సత్సంగ్‌లో పాల్గొన్న చంద్రబాబు

    • ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 45 ఏళ్లు సందర్భంగా కార్యక్రమం

    • గురూజీ బోధనల్ని అనుసరిస్తున్న వ్యక్తిగా వచ్చా: చంద్రబాబు

  • May 20, 2026 20:30 IST

    శ్రీకాకుళం: గణగాళ్లవానిపేట తీరం దగ్గర విషాదం

    • సముద్రంలో ఈతకు వెళ్లి విద్యార్థులు తిలక్‌, లీలాకృష్ణ గల్లంతు

    • విద్యార్థుల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

  • May 20, 2026 20:00 IST

    కర్నూలు: VRO సురేష్‌ కిడ్నాప్‌ కేసు నిందితుడు కుబేర్నాథ్‌ అదృశ్యం

    • అదృశ్యమైనట్లు పోలీసులకు కుబేర్నాథ్‌ భార్య లోకేశ్వరి ఫిర్యాదు

    • కుబేర్నాథ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు

  • May 20, 2026 19:35 IST

    విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు

    • జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు

  • May 20, 2026 19:34 IST

    నంద్యాల: వెలుగోడులో పుల్లయ్య ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

    • మంటలార్పిన ఫైర్ సిబ్బంది.

    • ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

    • రూ. 8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన ఇంటి యజమాని పుల్లయ్య

  • May 20, 2026 18:40 IST

    మార్కాపురం: యర్రగొండపాలెంలో దారుణహత్య

    • యువకుడిని హత్య చేసి ముక్కలుగా నరికిన దంపతులు

    • తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడని హత్య

  • May 20, 2026 18:22 IST

    జగిత్యాల జిల్లాలో విషాదం

    • చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

    • మేడిపల్లి మండలం కొండాపూర్‌ దగ్గర ఘటన

    • మృతులు: మన్విత్‌(11), మనస్వి(9), షార్వింద్‌(7)

    • మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు

  • May 20, 2026 18:19 IST

    ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగిస్తాం: ప్రధాని మోదీ

    • ఉగ్రవాద ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి కలిసి పోరాటం: మోదీ

    • ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలపడ్డాయి: మోదీ

    • నైపుణ్యం, ఆవిష్కరణల కేంద్రంగా భారత్: మోదీ

  • May 20, 2026 18:18 IST

    భారత్-ఇటలీ మరింత బలోపేతమవుతున్నాయి: ఇటలీ ప్రధాని మెలోని

    • ప్రధాని మోదీ ఇటలీ సందర్శన కొత్త అధ్యాయానికి నాంది: మెలోని

    • ఇరుదేశాల మధ్య నిజాయితీ, నమ్మకంతో కూడిన స్నేహం: మెలోని

    • 'పరిశ్రమ్' మంత్ర అనేది కీలక నినాదం: మెలోని

    • గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరుదేశాలు బలోపేతం: మెలోని

  • May 20, 2026 18:17 IST

    భారత్-ఇటలీ మధ్య పలు ఒప్పందాలు

    • భారత్‌లో ఇటలీ 20 బిలియన్ యూరోల పెట్టుబడులు

    • AI, క్వాంటం రంగాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం

  • May 20, 2026 18:16 IST

    రాజస్థాన్: అల్వార్‌లో తీవ్ర విషాదం

    • కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారుల మృతి

    • ఆడుకుంటూ కారులోకి వెళ్లిన అక్కాచెల్లెళ్లు

    • డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి

  • May 20, 2026 18:16 IST

    ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

    • 2018 తీర్పును అమలు చేయని ఆస్పత్రులపై ఆగ్రహం

    • 51 ఆస్పత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు

    • ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరిక

    • రాయితీ భూముల్లో ఆస్పత్రులు కట్టి నిబంధనలు పాటించరా?: సుప్రీంకోర్టు

    • పేదలకు 10% IP, 25% OP రాయితీ సేవలు అందించాలి: సుప్రీంకోర్టు

    • సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండాలి: సుప్రీంకోర్టు

  • May 20, 2026 18:12 IST

    టెట్రా ప్యాక్‌లో వోడ్కా.. సుప్రీంకోర్టులో పిటిషన్

    • టెట్రా ప్యాక్‌లో మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

    • కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

  • May 20, 2026 17:53 IST

    క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుపై 'ఎక్స్‌'లో సీఎం చంద్రబాబు పోస్ట్‌

    • ఏపీలో అందుబాటులోకి వచ్చిన తొలి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్

  • May 20, 2026 17:42 IST

    నిజామాబాద్‌: బోధన్‌ మండలం ఖండ్‌గాంలో విషాదం

    • తల్లి పద్మిని(60) మృతిని తట్టుకోలేక కుమారుడు సునీల్‌(35) ఆత్మహత్య

  • May 20, 2026 17:41 IST

    రామ్‌చరణ్‌ 'పెద్ది' సినిమాకు సెన్సార్‌ పూర్తి

    • 'పెద్ది' సినిమాకు CBFC U/A సర్టిఫికెట్‌ జారీ

    • ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 4న 'పెద్ది' విడుదల

  • May 20, 2026 16:41 IST

    రాజమండ్రి: స్పెషల్ పీపీ ముప్పాళ్ల సుబ్బారావుకు అస్వస్థత

    • కోర్టు నుంచి బార్‌ అసోసియేషన్‌కు వచ్చిన కాసేపటికే అస్వస్థత

    • ముప్పాళ్ల సుబ్బారావును స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలింపు

  • May 20, 2026 16:29 IST

    అమరావతి: వైద్య విద్యార్థుల మాస్‌ కాపీయింగ్‌పై విచారణ

    • 21 మంది వైద్య విద్యార్థులపై చర్యలకు కమిటీ సిఫార్సు

    • కాపీ చేస్తూ పట్టుబడిన MBBS, BDS, ఆయుష్‌ విద్యార్థులు

    • విద్యార్థులపై చర్యలు తీసుకోనున్న NTR ఆరోగ్య వర్సిటీ వీసీ

  • May 20, 2026 16:22 IST

    కాకినాడ: పంపా రిజర్వాయర్‌లో అక్రమంగా మట్టి తవ్వకాలు

    • 5 టిప్పర్లు, 2 జేసీబీలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌

    • సాగరమాల హైవే కోసం PSK సంస్థ మట్టి తరలిస్తున్నట్లు గుర్తింపు

  • May 20, 2026 16:18 IST

    మంచిర్యాల: చెన్నూరు SBI-2 వద్ద ఖాతాదారుల ఆందోళన

    • తాకట్టు బంగారం తిరిగివ్వాలని ఖాతాదారుల డిమాండ్‌

  • May 20, 2026 16:10 IST

    తెలంగాణలో ఎండల తీవ్రతపై ప్రభుత్వం అలర్ట్‌

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ సూచన

    • కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్‌కు ఆదేశాలు

    • ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్‌ సూచన

    • తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం

    పూర్తికథనం

  • May 20, 2026 16:07 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 117 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 41 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

    పూర్తికథనం

  • May 20, 2026 15:55 IST

    హైదరాబాద్: MCHRDలో పరిశ్రమలశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

    • ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై చర్చ

    • నెట్ జీరో సిటీ తరహాలోనే ఫ్యూచర్ సిటీ డిజైన్స్ ఉండాలి: సీఎం

    • మౌలిక వసతుల కల్పనలో రాజీ పడొద్దు: సీఎం

  • May 20, 2026 15:37 IST

    హైదరాబాద్: అత్తాపూర్ కిడ్నాప్ కేసు సుఖాంతం

    • యువతి లొకేషన్‌ని ట్రేస్ చేసిన పోలీసులు

    • మలక్‌పేటలోని తన ఇంట్లో సేఫ్‌గా ఉన్న యువతి

    • ఫోన్‌ నెంబర్ ఆధారంగా యువతిని గుర్తించిన పోలీసులు

  • May 20, 2026 15:13 IST

    అమరావతి: DEO, APCలతో మంత్రి లోకేశ్ భేటీ

    • దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీర్చిదిద్దుతాం: లోకేశ్

    • వందశాతం ఎన్‌రోల్‌మెంట్‌పై అధికారులు దృష్టి సారించాలి: లోకేశ్

    • ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలి: లోకేశ్

    • ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్: లోకేశ్

  • May 20, 2026 15:06 IST

    కేబినెట్‌లో అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల చేరికపై స్పష్టతనిచ్చిన టీవీకే

    • అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలను కేబినెట్‌లో చేర్చుకోం: టీవీకే

    పూర్తికథనం

  • May 20, 2026 15:04 IST

    అమరావతి: ముగిసిన టీడీపీ మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం

    • హాజరైన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తీర్మానాల కమిటీ సభ్యులు

    • మహానాడులో మొత్తం 19 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయం

  • May 20, 2026 14:16 IST

    మార్కాపురం: యర్రగొండపాలెంలో యువకుడి దారుణహత్య

    • యువకుడిని ముక్కలుగా నరికి బోరు బావిలో పడేసిన నిందితుడు వెంకటనారాయణ

    • తన కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడని హత్య

    • మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

  • May 20, 2026 14:06 IST

    ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు

    • మోదీ, అమిత్‌ షా దేశ ద్రోహులు: రాహుల్‌ గాంధీ

    • దేశాన్ని అమ్మేయడానికి బీజేపీ, RSS కుట్ర: రాహుల్‌ గాంధీ

    • ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి మోదీ, అమిత్‌ షా కారణం: రాహుల్‌ గాంధీ

    • త్వరలో ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయి: రాహుల్‌ గాంధీ

    • ప్రజల జీవితాలను ఆర్థిక తుఫాన్‌ విధ్వంసం చేస్తోంది: రాహుల్‌ గాంధీ

  • May 20, 2026 14:04 IST

    హైదరాబాద్ మెట్రో ఫేస్-2కు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం

    • కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో చర్చించిన కిషన్‌రెడ్డి

    • మెట్రో ఫేస్-2 DPR పరిశీలించి త్వరలో నిర్ణయం: కిషన్‌రెడ్డి

    • ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం అనుమతి

  • May 20, 2026 13:30 IST

    బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టివేత

    • రూ.35 కోట్ల విలువైన 17.50 కిలోల MDMA సీజ్

    • ఇద్దరు విదేశీయులు సహా 8 మంది అరెస్ట్

  • May 20, 2026 13:30 IST

    అత్తాపూర్ యువతి కిడ్నాప్ కేస్‌లో పురోగతి

    • యువతి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు

    • జోయి హాస్పిటలకు పక్కనే ఉన్న రత్నదీప్‌లో కొన్ని ఐటమ్స్ కొన్నట్టు గుర్తించిన పోలీసులు

    • రాత్రి 10:30 కు క్లోజింగ్ టైమ్‌‌లో వెళ్లి వాటర్ బాటిల్, చాక్లెట్స్ , కొన్ని స్నాక్స్‌ను కొన్న యువతి

    • ఆ టైంలో జరిపిన ట్రాన్సాక్షన్ ఆధారంగా యువతి నెంబర్‌ను గుర్తించిన పోలీసులు

    • రత్నదీప్ నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న హాస్పిటల్ లోపలికి వెళ్లిన యువతి

  • May 20, 2026 12:55 IST

    కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం

    • రాష్ట్రాభివృద్ధి, మూలధన వ్యయాలతో పాటు పలు అంశాలపై చర్చ

    • SASCI కింద రూ.5వేల కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి

    • సంక్షేమ కార్యక్రమాలను నిర్మలకు వివరించిన భట్టి విక్రమార్క

  • May 20, 2026 12:54 IST

    సూర్యాస్త్రను పరీక్షించిన రక్షణ శాఖ

    • 150-300 కి.మీ. రేంజి రాకెట్‌‌ను ప్రయోగించిన పుణెకు చెందిన రక్షణ సంస్థ నిబె లిమిటెడ్‌

    • ఒడిశాలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజిలో పరీక్ష

  • May 20, 2026 12:52 IST

    హైదరాబాద్: మీర్‌పేట్ పీఎస్‌ పరిధిలోని ఓ జ్యువెలరీ షాపులో అర్ధరాత్రి చోరీ

    • రూ.4లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల అపహరణ

    • కేవలం 5 నిమిషాల్లోనే చోరీ చేసి పరారైన దుండగులు

    • సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీ దృశ్యాలు, కేసు నమోదు

  • May 20, 2026 12:50 IST

    కులగణనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

    • సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అవసరం

    • వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

  • May 20, 2026 12:32 IST

    ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ప్రధాని మోదీ బహుమతి

    • పార్లే మెలోడీ టాఫీలను గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోదీ

    • మెలోనీ, మోదీ పేర్లు (Meloni+Modi) కలిపితే "MELODI"

    • ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి థ్యాంక్స్ చెబుతూ జార్జియా మెలోనీ పోస్ట్

  • May 20, 2026 11:44 IST

    చిత్తూరు: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

    • ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరైన సీఎం

    • అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

  • May 20, 2026 11:40 IST

    పల్నాడు జిల్లా: నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం

    • ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు

    • మృతి చెందిన వ్యక్తి నాదెండ్ల మండలం జంగాలపల్లి వాసిగా గుర్తింపు

    • ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు..

  • May 20, 2026 11:27 IST

    కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్‌ సిగ్నల్‌

    • కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

    • సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి: సుప్రీంకోర్టు

    • కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం

    • ఈ అంశంపై కోర్టుల జోక్యం ఉండదు: CJI జస్టిస్ సూర్యకాంత్‌

  • May 20, 2026 11:17 IST

    హోర్ముజ్‌లో మైన్ క్లియరింగ్‌లో అమెరికా ముందడుగు

    • 10 మైన్లను గుర్తించిన అమెరికా ఇంటెలిజెన్స్‌

    • నౌకలు హోర్ముజ్‌లో ప్రయాణించేందుకు అమెరికా నేవీ చర్యలు

  • May 20, 2026 11:17 IST

    వ్యవ‌సాయేత‌ర ప‌నుల‌కు ఎరువుల వాడ‌కంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్

    • రైతులకు అందాల్సిన ఎరువులను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహం

    • ఎరువుల కొరత సృష్టించే వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

  • May 20, 2026 11:06 IST

    ఢిల్లీ పర్యటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

    • కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలతో భట్టి సమావేశం

    • పెండింగ్ నిధులు, పలు ఆర్థిక అంశాలపై చర్చ

  • May 20, 2026 11:04 IST

    గూగుల్‌ డీప్‌మైండ్‌ CEO డెమిస్‌ హిస్పాబెస్‌ వ్యాఖ్యలు

    • ఉత్పత్తి పెంచడానికి AIని వాడుకోవాలి కానీ.. ఉద్యోగుల తొలగింపునకు కాదు..

    • ముందుచూపు లేకనే ఇటువంటి నిర్ణయాలు: CEO డెమిస్‌

  • May 20, 2026 10:56 IST

    ఢిల్లీ: కేంద్ర మంత్రి ఖట్టర్‌తో కిషన్‌రెడ్డి భేటీ

    • హైదరాబాద్‌లో వివిధ ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష

    • హైదరాబాద్ మెట్రో రెండో దశపై చర్చ

    • రెండో దశ DPR పరిశీలించి త్వరలో నిర్ణయం: కేంద్ర కిషన్‌రెడ్డి

  • May 20, 2026 09:48 IST

    తెలుగువారి ధైర్యసాహసాలు, ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి: Xలో ఏపీ సీఎం చంద్రబాబు

    • దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడు ఆయన..

    • ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా.. ఆయన సేవలను స్మరించుకుందాం: సీఎం చంద్రబాబు

  • May 20, 2026 09:46 IST

    హైదరాబాద్: జలమండలి జీఎం కుమార్‌కు 14 రోజుల రిమాండ్

    • అనంత లక్ష్మీకుమార్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన ACB కోర్టు

    • కుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలింపు

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్ అరెస్ట్‌

  • May 20, 2026 08:57 IST

    బాపట్ల జిల్లా: బాపట్ల రైలు పేటలో తండ్రిని చంపిన కుమారుడు

    • తాగి వచ్చి తల్లితో అనుచితంగా ప్రవర్తించడంతో తండ్రిపై దాడి

    • రోకలి బండతో తండ్రిని కొట్టి చంపిన కొడుకు

    • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • May 20, 2026 08:55 IST

    ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం

    • సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4గంటలకు సమావేశం

    • ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాల కారణంగా 23కు వాయిదా

    • కేబినెట్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాల ఖరారు

    • ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల స్కీం ప్రారంభంపై నిర్ణయం

  • May 20, 2026 08:54 IST

    ఆవుల మందపై పులి దాడి

    • నంద్యాల: వెలుగోడు మండలం గట్టుతాండా నల్లమల అటవీ ప్రాంతంలో ఘటన

    • ఆవుల మందపై పులి దాడి.. ఒక ఆవు మృతి

  • May 20, 2026 08:53 IST

    విజయవాడ: లిక్కర్ కేసులో నిందితులకు నేటితో ముగియనున్న రిమాండ్‌

    • ప్రణయ్‌ప్రకాష్‌ను CBI కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు

    • లిక్కర్ కేసులో ఇప్పటికే బెయిల్‌పై ఉన్న మరికొందరు నిందితులు

    • విచారణకు హాజరుకానున్న రాజ్‌ కసిరెడ్డి సహా ఇతర నిందితులు

  • May 20, 2026 08:51 IST

    కడప: పెద్ద దస్తగిరి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

    • నేటితో ముగియనున్న వైసీపీ నేత నిత్యానందరెడ్డి కస్టడీ

  • May 20, 2026 08:51 IST

    గుంటూరు జిల్లా: కంచర్లపాలెం గ్రామ శివారులో యువకుడి దారుణ హత్య

    • గ్రామ శివారులలోని వాలీబాల్ కోర్టు వద్ద హత్యకు గురైన కోపల్లె కార్తీక్ (18)

    • వాలీబాల్ నెట్ వైరు గొంతుకు బిగించి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు

  • May 20, 2026 07:48 IST

    హైదరాబాద్: అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కలకలం

    • కారులో వచ్చి యువతిని కిడ్నాప్‌ చేసిన నలుగురు వ్యక్తులు

    • సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు

    • కిడ్నాప్ జరిగిందా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు

  • May 20, 2026 07:40 IST

    నెల్లూరు: దుత్తలూరు మండలం తెడ్డుపాడు దగ్గర తప్పినముప్పు

    • అదుపుతప్పి బోల్తాపడిన పెట్రోల్ ట్యాంకర్‌

    • కడప నుంచి గుంటూరు వెళ్తుండగా ఘటన

    • ట్యాంకర్‌లో 10వేల లీటర్ల పెట్రోల్‌, 4వేల లీటర్ల డీజిల్‌

    • డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని అనుమానం

  • May 20, 2026 07:39 IST

    నెల్లూరు: దుత్తలూరు మండలం నర్రవాడ దగ్గర ప్రమాదం

    • టిప్పర్ లారీ కింద పడి రెండు దుప్పిలు మృతి

  • May 20, 2026 07:39 IST

    అన్నమయ్య జిల్లా : చిన్నమండెం మండలం కురవపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

    • అదుపుతప్పి బోల్తాపడ్డ బొలేరో వాహనం

    • వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు తీవ్రగాయాలు

    • క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • May 20, 2026 07:24 IST

    మహబూబాబాద్‌: తొర్రూరు మండలం వెలికట్ట దగ్గర రోడ్డు ప్రమాదం

    • ట్రాక్టర్‌-బైకు ఢీ, బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకుల మృతి

    • మృతులు దంతాలపల్లి మండలం బోర్లాడ వాసులు

  • May 20, 2026 07:22 IST

    ఈ నెల 23 నుంచి భారత్‌లో అమెరికా మంత్రి రూబియో టూర్‌

    • వాణిజ్యం, ఇంధన రంగాల్లో ఇరుదేశాల సహకారం పెంపొందించే లక్ష్యంగా పర్యటన

    • కోల్‌కతా, ఆగ్రా, జైపూర్‌, ఢిల్లీ నగరాల్లో మార్క్ రూబియో పర్యటన

    • విదేశాంగ మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో రూబియో చర్చలు

  • May 20, 2026 07:21 IST

    కర్నూలు BSNL ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

    • BSNL ఆఫీస్‌ మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు

    • మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది

  • May 20, 2026 07:21 IST

    కర్నూలు: వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు

    • ఈనెల 14న మంత్రి భరత్‌పై సిద్ధార్థరెడ్డి అనుచిత వ్యాఖ్యలు

    • బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై మంత్రి భరత్ ఫిర్యాదు

  • May 20, 2026 07:18 IST

    IPL: నేడు కోల్‌కతా Vs ముంబై

    • కోల్‌కతాలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

  • May 20, 2026 06:37 IST

    ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రమ్‌ హోమ్‌

    • ప్రభుత్వ, మున్సిపల్ ఉద్యోగులకు ఆదేశాలు

    • వారంలో 2 రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌

    • బుధ, శని వారాల్లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అమలు

  • May 20, 2026 06:37 IST

    తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు 5 రోజులు రెడ్ అలర్ట్‌

    • 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

    • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 3 రోజుల పాటు వడగాలులు

  • May 20, 2026 06:09 IST

    ఇవాళ సాయంత్రం బెంగళూరుకు సీఎం చంద్రబాబు

    • ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ కేంద్రానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

  • May 20, 2026 06:07 IST

    చిత్తూరు: కుప్పంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

    • ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

    • స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

  • May 20, 2026 06:07 IST

    అమరావతి: నేడు టీడీపీ మహానాడు తీర్మానాల కమిటీ భేటీ

    • పొలిట్‌ బ్యూరోకు తీర్మానాల నివేదిక సమర్పణ

    • రేపు టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం

    • మహానాడు అజెండా, ఆమోదించాల్సిన తీర్మానాలపై చర్చ

  • May 20, 2026 06:06 IST

    నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

    • ఆన్‌లైన్‌లో ఔషధాల డెలివరీని వ్యతిరేకిస్తూ బంద్

    • ఒకరోజు మెడికల్ షాపుల బంద్‌కు AIOCD పిలుపు

    • మూతపడనున్న 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు

    • తెరిచే ఉండనున్న ఆస్పత్రి కేంద్రంగా నడిచే మెడికల్ స్టోర్స్

  • May 19, 2026 09:29 IST

    చైనాకు చేరుకొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    • బీజింగ్‌లో పుతిన్‌కు స్వాగతం పలికిన చైనా అధినేత

    • ట్రంప్‌ చైనా పర్యటన ముగిసిన రోజుల్లోనే పుతిన్‌ బీజింగ్‌కు రావడం గమనార్హం