ఉదయం నష్టాలు.. మధ్యాహ్నం లాభాలు..
ABN , Publish Date - May 20 , 2026 | 03:54 PM
ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసొచ్చింది.
ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 110 డాలర్ల దిగువకు వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్టు వస్తున్న సంకేతాలు కూడా పాజిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (75,200)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు లాభాల బాటపట్టాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ 800 పాయింట్లు పైకి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 75,318 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 41 పాయింట్ల లాభంతో 23,659 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో హిటాచీ ఎనర్జీ, ఏబీబీ ఇండియా, సీజీ పవర్, సీమన్స్, మ్యాన్‌కైండ్ ఫార్మా మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). పీఐ ఇండస్ట్రీస్, కేన్స్ టెక్, ఎల్‌టీఎమ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, భారత్ ఎలక్ట్రిక్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 301 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.82గా ఉంది.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..