రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - May 20 , 2026 | 03:22 PM
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సరదాగా గడపడానికి ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లిన వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. 'సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ టెక్సస్' అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో భారీ రోలర్ కోస్టర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సరదాగా గడపడానికి ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లిన వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. 'సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ టెక్సస్' అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో భారీ రోలర్ కోస్టర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు. విద్యుత్ అంతరాయం కారణంగా 245 అడుగుల ఎత్తులో టైటాన్ రోలర్ కోస్టర్ నిలిచిపోయింది (Texas roller coaster evacuation).
విద్యుత్ అంతరాయం కారణంగా రోలర్ కోస్టర్ 245 అడుగుల ఎత్తులో దాదాపు గంట పాటు నిలిచిపోయింది. సందర్శకులు గంట పాటు అంత ఎత్తులోనే ఉండిపోయారు. ఆ తర్వాత రోలర్ కోస్టర్ ట్రాక్ పక్కనున్న ఎమర్జెన్సీ మెట్లపై నుంచి ఒక్కొక్కరిగా కిందికి దిగారు. బలమైన గాలి వీస్తున్న సమయంలో చిన్న పిల్లలతో సహా చాలామంది భయంతో మెల్లగా అంత ఎత్తు నుంచి కిందకు దిగుతున్నట్టు వీడియోల్లో కనిపించింది (Six Flags power outage).
శనివారం జరిగిన ఈ ఘటనకు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణమని పార్క్ యాజమాన్యం ప్రకటించింది (Titan roller coaster Texas). పార్క్ బయట నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బంది భూగర్భ విద్యుత్ లైన్‌కు అంతరాయం కలిగించడంతో పవర్ కట్ అయిందని తెలిపింది. అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టి అందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సిక్స్ ఫ్లాగ్స్ ప్రకటించింది. అలాగే ఆ రోజు పార్క్‌లో ఉన్న వారికి ఉచిత రిటర్న్ టికెట్లు కూడా ఇచ్చినట్లు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం
టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే