భారీగా ఎండలు.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ కీలక సూచనలు..
ABN , Publish Date - May 20 , 2026 | 03:37 PM
తెలంగాణలో ఎండల తీవ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎండల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఆయన అలర్ట్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎండల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఆయన అలర్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో అధికారులు, రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆజ్ఞాపించారు. అలాగే ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బాధితులకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరోవైపు పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం. మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించాలని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్