-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 3rd July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 03 , 2026 | 06:48 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 03, 2026 21:55 IST
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ఏరియాల్లో వర్షం
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌లో వర్షం
ఉప్పల్, ఎల్బీనగర్, చార్మినార్ ఏరియాల్లో వర్షం
రాజేంద్రనగర్, శంషాబాద్ ఏరియాల్లో కురుస్తున్న జల్లులు
-
Jul 03, 2026 21:54 IST
రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటకు రేవంత్
ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్న సీఎం రేవంత్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 03, 2026 21:53 IST
నిజామాబాద్: బోధన్ మెయిన్ రోడ్డులోని నర్సాపూర్ కల్లు దుకాణంలో విషాదం
కల్లులో మద్యం కలుపుకొని తాగిన విఠల్, లక్ష్మయ్య అనే వ్యక్తులు
విఠల్ అక్కడికక్కడే మృతి.. లక్ష్మయ్య పరిస్థితి విషమం
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 03, 2026 21:29 IST
ఏపీలో ఔషధాల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ
పరికరాలు, మిషన్ల కొనుగోలు, సరఫరాకు నిర్దిష్ట క్యాలెండర్: మంత్రి సత్యకుమార్
ఆస్పత్రుల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: మంత్రి సత్యకుమార్
-
Jul 03, 2026 21:28 IST
అయోధ్య రామ మందిరం ట్రస్ట్ రికార్డుల వెల్లడికి CIC నిరాకరణ
'రహస్య ఫైల్'లోనే రామ్ మందిర్ ట్రస్ట్ ఏర్పాటు వివరాలు: CIC
ట్రస్ట్ వివరాలు వెల్లడిస్తే ప్రాణహాని జరిగే ప్రమాదం: కేంద్ర హోంశాఖ
ఆర్టీఐ చట్టం సెక్షన్ 8 (1) (g) కింద సమాచారం నిరాకరణ
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 'పబ్లిక్ అథారిటీ' కాదు: CIC
-
Jul 03, 2026 20:53 IST
ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు
తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదన
సరిహద్దులు తదితర అంశాలపై ప్రతిపాదనలను పంపించాలని డీజీపీ ఆదేశాలు
-
Jul 03, 2026 20:14 IST
హైదరాబాద్: అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా అరెస్ట్
నాంపల్లిలో మైనర్ సహా నలుగురి అరెస్టు, 23 కిలోల గంజాయి స్వాధీనం
-
Jul 03, 2026 20:14 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవిని కలిసిన మంత్రి సీతక్క
తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై సీతక్క చర్చ
-
Jul 03, 2026 20:13 IST
కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి జోసెఫ్ రావణ్ తరలింపు
వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు జోసెఫ్ రావణ్
డిప్యూటీ సీఎం పవన్‌ను దూషించిన కేసులో జోసెఫ్ రావణ్ అరెస్ట్
-
Jul 03, 2026 20:12 IST
రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ సర్కార్ రికార్డు
కేవలం 4 రోజుల్లో రూ.6,590.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
నేడు 4–5 ఎకరాల రైతులకు రూ.1,188 కోట్ల విడుదల
నాలుగో విడతలో 4.41 లక్షల మంది రైతులకు లబ్ధి
ఇప్పటివరకూ 65.76 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం
-
Jul 03, 2026 19:53 IST
ఈనెల 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
పలు ఇతర ఆర్డినెన్స్‌ల స్థానంలో కొత్త బిల్లులను చట్టంగా మార్చేందుకు కేంద్రం కసరత్తు
-
Jul 03, 2026 19:31 IST
అమరావతి: గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన పవన్
ఐజీ రవికృష్ణ అందించిన రిపోర్ట్‌ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jul 03, 2026 19:10 IST
పాకిస్థాన్‌కు భారత్ మరోసారి స్పష్టమైన హెచ్చరికల జారీ
పాక్ బెదిరింపులను తోసిపుచ్చిన భారత్
సింధూ జలాల ఒప్పందంపై వైఖరిలో మార్పులేదని స్పష్టీకరణ
బెదిరింపులు, అంతర్జాతీయ వేదికలపై ప్రచారాలు తమ నిర్ణయంపై ప్రభావం చూపవని వెల్లడి
-
Jul 03, 2026 19:09 IST
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు!
గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిర్వాకం
చెత్తాచెదారం తొలగించినట్టు ఏఐతో ఫేక్ ఫొటోల సృష్టి
జీపీఎఫ్ స్ఫూఫింగ్‌ను వాడి విధులకు డుమ్మా కొట్టిన సిబ్బంది
బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను తొలగించిన ఉన్నతాధికారులు
-
Jul 03, 2026 18:36 IST
హైదరాబాద్: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ
కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
వాదనలకు సమయం కోరిన బాధితురాలి తరఫు న్యాయవాది
బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా
-
Jul 03, 2026 18:35 IST
ఈ నెల 6, 7 తేదీల్లో ఇండోనేషియాలో ప్రధాని మోదీ పర్యటన
ఇండోనేషియాతో రక్షణరంగ ఒప్పందాలపై కీలక చర్చలు జరిగే అవకాశం
ఈ నెల 8, 9 తేదీల్లో ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో భేటీ కానున్న మోదీ
ఈనెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్ పర్యటనకు ప్రధాని మోదీ
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో భేటీకానున్న మోదీ
1986 తర్వాత న్యూజిలాండ్ వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీ
-
Jul 03, 2026 18:15 IST
సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌కు ఐటీ విభాగం నోటీసులు
మైనర్లపై వేధింపులు, ప్రమోషన్ యాడ్స్‌పై వివరణ ఇవ్వాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఆదేశం
చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ఎలా అనుమతించారు?
అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన కేంద్రం
-
Jul 03, 2026 17:44 IST
ముంబై: వెస్ట్ అంధేరి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
భవనంలో ఎగసిపడుతున్న మంటలు, ఆర్పుతున్న సిబ్బంది
పలువురిని కాపాడిన సహాయ సిబ్బంది
భయాందోళనతో భవనం పైనుంచి దూకిన పలువురు వ్యక్తులు
-
Jul 03, 2026 17:27 IST
అమరావతి: భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతులకు లైసెన్స్ కాదు: మంత్రి దుర్గేష్
వ్యూస్, బ్లాక్ మెయిలింగ్ కోసం పవన్ జపమా?: దుర్గేష్
సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం: మంత్రి కందుల దుర్గేష్
-
Jul 03, 2026 17:26 IST
అమరావతి: జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
కూటమి ప్రభుత్వ విజయాలు చూసి జగన్‌కు మతిపోయింది: మంత్రి అచ్చెన్నాయుడు
ఈ-పంట నమోదుపై జగన్ అసత్య ప్రచారం: మంత్రి అచ్చెన్న
అబద్ధాలకు జగన్ అంబాసిడర్: మంత్రి అచ్చెన్నాయుడు
కూటమి ప్రభుత్వంలో ఈ-పంట నమోదు గణనీయంగా పెరిగింది: మంత్రి అచ్చెన్న
రబీ 2025-26లో 99.7 శాతం ఈ-పంట నమోదు: మంత్రి అచ్చెన్నాయుడు
-
Jul 03, 2026 17:20 IST
హైదరాబాద్: హరీశ్ రావు సొల్లు పురాణం చెబుతున్నారు: మంత్రి జూపల్లి
నా ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు: మంత్రి జూపల్లి కృష్ణారావు
నేను అడిగింది ఏంటి? హరీశ్ చెప్పిందేంటి?: మంత్రి జూపల్లి
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కోసం 3 కుర్చీలు వేశాం: జూపల్లి
చర్చకు రమ్మంటే ఎందుకు పారిపోతున్నారు: మంత్రి జూపల్లి
హరీష్‌రావు రాసిన లేఖలో ఏమీ లేదు: మంత్రి జూపల్లి
ఇప్పటికైనా విలువలతో బతకండి: మంత్రి జూపల్లి కృష్ణారావు
-
Jul 03, 2026 17:18 IST
హైదరాబాద్: మంత్రి జూపల్లి సవాల్‌కు స్పందించని BRS నేతలు
చర్చకు రావాలని పిలిచి పోలీసులతో అడ్డుకుంటున్నారని BRS ఆరోపణ
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని BRS డిమాండ్
-
Jul 03, 2026 17:16 IST
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి
తెలంగాణ అప్పులపై చర్చ కోసం వచ్చిన జూపల్లి
ఉదయం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు జూపల్లి సవాల్
అప్పులపై సమాధానం చెప్పాలన్న మంత్రి జూపల్లి
సవాల్‌పై కట్టుబడి ఉన్నందునే ప్రెస్‌క్లబ్‌కు వచ్చా: జూపల్లి
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు కోసం ఎదురుచూస్తున్నా: జూపల్లి
వెనుకడుగు వేసి పారిపోయే వ్యక్తిని కాను: మంత్రి జూపల్లి
-
Jul 03, 2026 17:15 IST
హైదరాబాద్: ఆపరేషన్ ముస్కాన్‌కు సైబరాబాద్ పోలీసుల శ్రీకారం
ఈ నెలాఖరు వరకూ సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు, రక్షణపై ప్రత్యేక దృష్టి
దర్పణ్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌తో చిన్నారుల గుర్తింపు
ఆపరేషన్ ముస్కాన్-12 కోసం 7 ప్రత్యేక పోలీసు బృందాలు
గత కేసుల ఆధారంగా ఇప్పటికే హాట్‌స్పాట్ల గుర్తింపు
-
Jul 03, 2026 17:13 IST
హైదరాబాద్: మంత్రి తుమ్మలతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధుల భేటీ
సీడ్ గార్డెన్, నర్సరీ, పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై సమీక్ష
ఆయిల్ పామ్ రైతులకు మెరుగైన మౌలిక వసతులు: మంత్రి తుమ్మల
రైతులకు నష్టం కలిగించే చర్యలను అంగీకరించం: మంత్రి తుమ్మల
రైతుల శ్రేయస్సే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి తుమ్మల
-
Jul 03, 2026 16:24 IST
అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై RSS స్పందన
రామభక్తుల మనోభావాలను దెబ్బతీశారు: RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే
దోషులను కఠినంగా శిక్షించాలి: RSS ప్రధాన కార్యదర్శి
ఆలయ నిర్వహణలో లోపాలను సరిదిద్దాలి: RSS
దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టాలి: RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే
-
Jul 03, 2026 16:22 IST
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర
జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్ బట్టబయలు
గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మంది అరెస్ట్
జైష్-ఎ-మహ్మద్ కోసం పని చేస్తున్నట్లు ATS విచారణలో వెల్లడి
8 మందిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు
-
Jul 03, 2026 16:15 IST
అమరావతి: సాయంత్రం లోక్‌భవన్‌కు డిప్యూటీ సీఎం పవన్
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న పవన్
-
Jul 03, 2026 16:15 IST
హైదరాబాద్: మంత్రి జూపల్లికి హరీశ్ రావు లేఖ
BRS హయాంలో చేసిన అప్పులు, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులపై లేఖ
లేఖతో పాటూ వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సాప్ చేసిన హరీశ్ రావు
BRS హయాంలో చేసిన అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారు: హరీశ్ రావు
-
Jul 03, 2026 16:01 IST
హైదరాబాద్: ఉస్మానియా వైద్య బృందానికి మంత్రి రాజనర్సింహ సన్మానం
ఉస్మానియాలో 5 అవయవాల మార్పిడి విజయవంతం..
దేశ వైద్య చరిత్రలోనే అరుదైన ఘనత: మంత్రి రాజనర్సింహ
కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ ఆస్పత్రులు: రాజనర్సింహ
రెండున్నరేళ్లలో 15 వేల పోస్టులు భర్తీ చేశాం: రాజనర్సింహ
మరో 6,238 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం: మంత్రి రాజనర్సింహ
-
Jul 03, 2026 15:39 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
261 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
95 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 03, 2026 15:28 IST
నల్లగొండ: రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ బీజేపీ: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
గురుకులాల పేరుతో కాంగ్రెస్, BRS నాటకాలు: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించకోవట్లేదు: రాంచందర్‌రావు
VB-G RAM G పథకంతో పేదల బతుకులు మారుతాయి: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
-
Jul 03, 2026 14:55 IST
తమిళనాడు: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో కోర్టుకు పోలీసుల నివేదిక
రూ.180 కోట్లతో MLAలను ప్రలోభపెట్టేందుకు కుట్ర: పోలీసులు
కొందరు వ్యక్తులు, ఓ కార్పొరేట్ సంస్థ కలిసి విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర: పోలీసులు
-
Jul 03, 2026 14:54 IST
తమిళనాడు: DMK మాజీమంత్రి, MLA అనితా రాధాకృష్ణన్ అరెస్టు
సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు
రాజకీయ కక్షతోనే అనితా రాధాకృష్ణన్ అరెస్టు: DMK
అనితా రాధాకృష్ణన్ ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో అరెస్టు చేసిన పోలీసులు
-
Jul 03, 2026 14:33 IST
ఏపీని స్టీల్ స్టేట్‌గా మారుస్తున్నాం: సీఎం చంద్రబాబు
దేశంలో ఫస్ట్ టైమ్ ఫస్ట్ గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఇది: సీఎం చంద్రబాబు
విశాఖ మాత్రమే కాదు.. రాయలసీమ కూడా ఉక్కుసీమగా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఎవరి వల్ల సీమకు నష్టం జరిగిందో గుర్తు చేసుకోండి: సీఎం చంద్రబాబు
ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగిందో చరిత్ర తెలుసుకోవాలి: సీఎం చంద్రబాబు
కియా పరిశ్రమతో అనంతపురం రూపురేఖలు మారిపోయాయి: సీఎం చంద్రబాబు
-
Jul 03, 2026 14:14 IST
బాపట్ల: చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కిడ్నాప్ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
తల్లి దగ్గర నిద్రిస్తున్న శిశువును అపహరించిన దుండగులు
శిశువును కిడ్నాప్ చేసిన నిందితులు సంజీవరావు, శ్రీను
టంగుటూరు దగ్గర ఆదినారాయణ, తిరుమల దంపతుల అరెస్ట్
సంతానం లేక కిడ్నాప్ చేయించిన ఆదినారాయణ దంపతులు
శిశువును తెచ్చిస్తే రూ.1 లక్ష ఇస్తామని నిందితులకు ఆఫర్
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు
-
Jul 03, 2026 13:51 IST
కడప: రాయలసీమలో స్వర్ణయుగం ప్రారంభమైంది: సీఎం చంద్రబాబు
రాబోయే రోజుల్లో రాయలసీమకు అన్నీ మంచి రోజులే: సీఎం
-
Jul 03, 2026 13:45 IST
ఢిల్లీ: ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడి నియామకం
రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
-
Jul 03, 2026 13:44 IST
కృష్ణా: ఇనగుదురు పీఎస్‌లో జోసఫ్ రావణ్‌ను విచారిస్తున్న పోలీసులు
పీఎస్ వైపు వచ్చిన జనసేన కార్యకర్తలను వెనక్కిపంపిన పోలీసులు
పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోసఫ్ రావణ్‌ను శిక్షించాలని డిమాండ్
ఇనగుదురు పీఎస్ దగ్గర భారీ బందోబస్తు
-
Jul 03, 2026 13:43 IST
కడప: జమ్ములమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన
JSW ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేసిన చంద్రబాబు
రూ.16,350 కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
4 వేల మందికిపైగా ఉపాధి కల్పించే దిశగా ప్రాజెక్టు
3,850 మెగావాట్ల ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన
-
Jul 03, 2026 13:39 IST
విజయనగరం: శృంగవరపుకోట ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణాలకు భూమిపూజ
వర్చువల్‌గా భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి: హోం మంత్రి అనిత
ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది: అనిత
-
Jul 03, 2026 13:34 IST
డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్
సీఎం విజయ్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్టు
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు
టీవీకే నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
హైకోర్టు ఆదేశాల అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jul 03, 2026 13:32 IST
కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్
బీఆర్ఎస్ పాలనలో అప్పులపై కేసీఆర్ స్పందించాలి
బీఆర్ఎస్ హయాంలో మొత్తం అప్పు రూ.8.21 లక్షల కోట్లు: భట్టి విక్రమార్క
మొత్తం అప్పుల్లో గత ప్రభుత్వ బకాయిలు ఉన్నాయి: భట్టి విక్రమార్క
అప్పులు అన్నీ వాస్తవాలు కాదా.. వీటిని ఎవరు చెల్లిస్తారు?: భట్టి విక్రమార్క
అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలి: భట్టి విక్రమార్క
-
Jul 03, 2026 13:27 IST
పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం
ఖైబర్ పఖ్తూన్‌క్వాలో లోయలో పడిన బస్సు
ప్రమాదంలో 40 మంది మృతి
బలోచిస్థాన్ సరిహద్దు సమీపంలోని డాన్ సార్ వద్ద ఘటన
మరో వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో అదనపు ప్రయాణికులను ఎక్కించుకున్న బస్సు
-
Jul 03, 2026 13:18 IST
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నంత మాత్రాన హిందూ గుర్తింపును నిరాకరించలేం: హైకోర్టు
హిందూ మతాన్ని స్వీకరించడానికి ఎలాంటి సర్టిఫికెట్లు, ప్రత్యేక వేడుకలు అవసరం లేదు: హైకోర్టు
అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సెస్ అయ్యంగార్‌ను హిందూ భక్తురాలిగానే పరిగణించాలని కోర్టు ఆదేశం
లారా ఫ్రాన్సెస్‌ను 'అమెరికన్ క్రైస్తవ మహిళ'గా పేర్కొంటూ జారీ చేసిన తమిళనాడు దేవాదాయ శాఖ ఉత్తర్వుల కొట్టివేత
-
Jul 03, 2026 13:17 IST
హైదరాబాద్: R&B శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష
ఈ వారం నుంచే ఆకస్మిక పర్యటనలు: మంత్రి కోమటిరెడ్డి
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఈ నెలలోనే 10 హ్యామ్ రోడ్ల ప్యాకేజీలు ప్రారంభం: కోమటిరెడ్డి
కొత్త హైకోర్టు భవనం 2027 డిసెంబర్ నాటికి సిద్ధం: కోమటిరెడ్డి
సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభానికి సిద్ధం: మంత్రి కోమటిరెడ్డి
అల్వాల్, LB నగర్ టిమ్స్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
నిమ్స్ విస్తరణ, వరంగల్ సూపర్‌స్పెషాలిటీ పనులు త్వరగా పూర్తిచేయాలి
-
Jul 03, 2026 13:15 IST
రుషికొండ భవనాలపై ఏపీ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం
భవనాల నిర్వహణకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) ఆహ్వానం
APTDC ఆధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం
5 భవనాల సముదాయాన్ని నిర్వహించనున్న ప్రైవేట్ సంస్థ
-
Jul 03, 2026 12:54 IST
అన్నమయ్య జిల్లాలో అరుదైన పునుగు పిల్లి పిల్లల ప్రత్యక్షం
తంబళ్లపల్లి మండలంలో రైతు పొలంలో రెండు పునుగు పిల్లి పిల్లల గుర్తింపు
తిరుమల శేషాచలం అడవుల్లో కనిపించే జాతిగా అటవీ శాఖ నిర్ధారణ
రైతుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు
పిల్లలతో పాటు తల్లి కూడా సమీపంలో ఉండే అవకాశం ఉందని అధికారుల వెల్లడి
-
Jul 03, 2026 12:51 IST
హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్‌వి డ్రామాలు: కేంద్రమంత్రి బండి సంజయ్
బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ వెలుగులోకి తెచ్చిందా?: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏమైంది?: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్‌షీట్ వేస్తారా? లేదా?: బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది: బండి సంజయ్
బీజేపీ బలపడుతోందనే భయంతోనే ఇలా చేస్తున్నారు: బండి సంజయ్
-
Jul 03, 2026 12:48 IST
మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌పై హరీష్‌రావు స్పందన
మంత్రులు గోల్ కొడతామని సెల్ఫ్ గోల్ అయ్యారు: హరీష్‌రావు
జూపల్లి తీరు పూటకో సవాల్.. రోజుకో అడ్రస్‌లా ఉంది
తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పింది జూపల్లే: హరీష్‌రావు
గన్‌పార్క్‌కు ఆహ్వానించారు.. మేం వెళ్లేందుకు సిద్ధమయ్యాం: హరీష్‌రావు
గన్‌పార్క్‌కు రాకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు: హరీష్‌రావు
-
Jul 03, 2026 12:47 IST
ఈ-రిక్షాల బ్యాటరీని నిలిపివేసే యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు
ఈ-రిక్షాల బ్యాటరీని ఆపేస్తున్న యాప్‌ల నిలిపివేత
ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంబంధిత యాప్‌లపై నిఘా
-
Jul 03, 2026 12:41 IST
పాకిస్థాన్ నేతలపై సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ విమర్శలు
పాక్‌కు అసలు సమస్య భారత్, అఫ్గాన్ కాదు.. ఆ దేశ నేతలే: కౌసికన్
అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యంలో ఆదేశ ప్రజలకు ప్రయోజనం లేదు: కౌసికన్
వైఫల్యం అంచున పాకిస్థాన్ ఉంది: బిలహరి కౌసికన్
-
Jul 03, 2026 12:35 IST
ఖమేనీ భౌతికకాయానికి నివాళులర్పించిన భారత ప్రతినిధులు
టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో నివాళులర్పించిన భారత ప్రతినిధులు
-
Jul 03, 2026 12:31 IST
హనీమూన్ హత్యకేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
సోనమ్ బెయిల్ రద్దుకు నిరాకరణ
ఇప్పటికే విడుదలైన విషయాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు
ట్రయల్ పురోగతిని పరిశీలిస్తామన్న ధర్మాసనం
-
Jul 03, 2026 11:53 IST
నేను రాజీనామాకు సిద్ధం.. పారిపోలేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు లేఖలు పంపుతున్నా: జూపల్లి
నా ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి: జూపల్లి
-
Jul 03, 2026 11:52 IST
విజయవాడ: సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
సీఐ నాగరాజును కస్టడీ కోరుతూ కోర్టుకు కీలక వివరాలు తెలిపిన సిట్
కీలక సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమైనట్లు ఫోరెన్సిక్ నివేదిక
పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మరకలు గుర్తించిన సిట్
లాఠీ, ఎముకలు, బూడిద, కాలిన హ్యాండ్‌కఫ్ స్వాధీనం
కస్టడీలో తీవ్ర గాయాలతో సాయికృష్ణ మృతి చెందినట్లు సాక్షుల వాంగ్మూలాలు
మృతదేహం ఆచూకీ కోసం సీఐ నాగరాజు కస్టడీ అవసరమని సిట్ వాదన
-
Jul 03, 2026 11:02 IST
ముంబై: మీడియా వైపు అసభ్య సంజ్ఞలు చేసిన సియా అగర్వాల్
దర్యాప్తు నిమిత్తం సియాను పోలీసులు తరలిస్తుండగా ఘటన
సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Jul 03, 2026 11:02 IST
చాక్లెట్ దొంగతనం ఆరోపణతో ఫోర్డ్ ఉద్యోగి తొలగింపు
రూ.1.9 కోట్ల వార్షిక వేతనం పొందుతున్న ఉద్యోగిపై వేటు
చాక్లెట్‌కు డబ్బులు చెల్లించినట్లు ఉద్యోగి వాదన
ఉద్యోగి తొలగింపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్
ఫోర్డ్ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
Jul 03, 2026 10:55 IST
అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
అమర్‌నాథ్ యాత్ర క్షేమంగా సాగాలి: మోదీ
-
Jul 03, 2026 10:51 IST
ఏలూరు జిల్లా కొవ్వలి కాలువలో మృతదేహం కలకలం
కాలువలో బైక్‌తో పాటు మృతదేహం గుర్తింపు
స్థానికుల సాయంతో మృతదేహం, బైక్‌ను బయటకు తీసిన అధికారులు
మృతుడు ఆర్‌ఎంపీ వైద్యుడు కాకిలేటి శివయ్య (55)గా గుర్తింపు
ప్రమాదమా? హత్యా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్న పోలీసులు
-
Jul 03, 2026 10:48 IST
మేడ్చల్: ఘట్‌కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
వరంగల్ జిల్లా పాపయ్యపేటకు చెందిన రవికుమార్, శిరీషగా గుర్తింపు
గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించిన జీఆర్‌పీ పోలీసులు
ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగింపు
దంపతుల మృతితో పాపయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు
-
Jul 03, 2026 10:47 IST
హైదరాబాద్: కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ
రాష్ట్ర అప్పులపై పూర్తి వివరాలతో లేఖ రాసిన జూపల్లి
వాస్తవాలపై స్పందించకుండా తోకముడిచారని అనడం సబబు కాదు: జూపల్లి
ఇప్పటికైనా తన లేఖకి సమాధానం చెప్పాలన్న జూపల్లి
-
Jul 03, 2026 10:46 IST
ఢిల్లీలో ఫుడ్ మాఫియా గుట్టురట్టు
కాలం చెల్లిన బ్రాండెడ్ డ్రింక్స్, ఆహార ఉత్పత్తులను రీప్యాక్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠా
ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సీజ్ చేసిన ఆహార ఉత్పత్తుల విలువ రూ.20 లక్షలు
-
Jul 03, 2026 10:45 IST
రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచ కప్?
రొనాల్డో సోదరి కాటియా అవీరో సంచలన వ్యాఖ్యలు
పోర్చుగల్ జెర్సీలో రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచ కప్ అని నా అభిప్రాయం: కాటియా
ఈ క్షణాలను ఆస్వాదించండి: కాటియా
-
Jul 03, 2026 10:44 IST
ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూకంపం
హల్మహేరా ప్రాంతంలో ఉదయం 10:31 గంటలకు ప్రకంపనలు
టెర్నాటేకు 116 కిలోమీటర్ల ఉత్తరాన భూకంప కేంద్రం
భూకంపాన్ని ధ్రువీకరించిన జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్
-
Jul 03, 2026 09:42 IST
సూర్యాపేట: కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిపై వేటు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను మార్గం మళ్లించిన ఎస్‌ఐ
షెడ్యూల్ చేసిన మార్గంలో కాకుండా మరో మార్గంలో మధిరకు తీసుకెళ్లిన ఎస్‌ఐ
ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసిన డిప్యూటీ సీఎం
ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
-
Jul 03, 2026 09:32 IST
థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాధువులపైకి దూసుకెళ్లిన పికప్ ట్రక్కు
ప్రమాదంలో 9 మంది సాధువుల మృతి
మరో 13 మంది సాధువులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
11 ఏళ్ల బాలుడు ట్రక్కు నడిపినట్లు పోలీసుల వెల్లడి
బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jul 03, 2026 09:29 IST
పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదు
-
Jul 03, 2026 09:28 IST
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ నియామకం
ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీవాసరావు
-
Jul 03, 2026 09:13 IST
పౌరసత్వ కేసులో గౌహతి హైకోర్టు కీలక తీర్పు
16 డాక్యుమెంట్స్ సమర్పించినా భారత పౌరసత్వం నిరూపించలేకపోయిన వ్యక్తి
అస్సాం వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించిన ట్రైబ్యునల్ తీర్పును సమర్థించిన హైకోర్టు
పౌరసత్వాన్ని నిరూపించే బాధ్యత దరఖాస్తుదారుదేనన్న హైకోర్టు
పత్రాల సంఖ్య కాదు.. వాటి చట్టబద్ధత కీలకమని కోర్టు వ్యాఖ్య
-
Jul 03, 2026 09:10 IST
హైదరాాబాద్: లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
తల్లి పక్కన ఉన్న నెల రోజుల శిశువును అపహరించిన దుండగుడు
గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు
మధ్యాహ్నం 12 గంటలకు వివరాలు వెల్లడించనున్న సైబరాబాద్ సీపీ
-
Jul 03, 2026 09:07 IST
ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా-ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
మా దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: ఇరాన్
-
Jul 03, 2026 09:06 IST
వరంగల్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ సవాళ్ల పంచాయితీ
కుడా ప్లాట్ల టెండర్లలో అవినీతి నిరూపించేందుకు భద్రకాళీ గుడికి వస్తామని బీఆర్ఎస్ నేతల సవాల్
సవాల్‌కు స్పందించిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి
భద్రకాళీ దేవాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
-
Jul 03, 2026 09:03 IST
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్‌రావు జాధవ్
-
Jul 03, 2026 08:00 IST
తిరుపతి: నేడు అక్షర గోవిందం-అన్నప్రాశనకు సర్వం సిద్ధం
టీటీడీ ఆధ్వర్యంలో వకుళ మాత ఆలయంలో సన్నాహాలు
ప్రతిరోజు రెండు బ్యాచ్‌లలో 50 మందికి అక్షరాభ్యాసం - అన్నప్రాశనకు ఏర్పాట్లు
-
Jul 03, 2026 07:59 IST
టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కేంద్రం నోటీసులు
యూజర్ నేమ్ ఫీచర్‌పై వివరణ ఇవ్వాలని నోటీసులు
-
Jul 03, 2026 07:56 IST
అమరావతి: నేడు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన
వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
-
Jul 03, 2026 07:51 IST
మార్కాపురం: కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం
పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఇంట విషాదం
ఆలయం దగ్గర ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ
నలుగురి మృతి, మరో 8 మందికి తీవ్రగాయాలు
-
Jul 03, 2026 07:17 IST
ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
నేటి నుంచి కాలినడక యాత్ర ప్రారంభం
హిమలింగ దర్శనానికి 4 లక్షల మంది రిజిస్ట్రేషన్
57 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర
-
Jul 03, 2026 07:13 IST
WT20 WC సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం
సౌతాఫ్రికాపై 40 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
స్కోర్లు: ఇంగ్లండ్ 169/5, సౌతాఫ్రికా 129/8
జులై 5న జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనున్న ఇంగ్లండ్
WT20 WCలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన రెండో జట్టుగా ఇంగ్లండ్
-
Jul 03, 2026 07:04 IST
తెలంగాణ అప్పులపై కొనసాగుతున్న రాజకీయ రచ్చ
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు రేవంత్ సర్కారు యత్నం
-
Jul 03, 2026 06:56 IST
సాయికృష్ణ కేసులో 8 రోజుల సిట్ కస్టడీకి సీఐ నాగరాజు
నేటి నుంచి సిట్ కస్టడీకి అనుమతి
వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశం
ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు విచారణ
-
Jul 03, 2026 06:54 IST
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వర్షాలు
హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఈదురుగాలులతో రాత్రి నుంచి పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా
ఏపీలోనూ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు
శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, ప.గో., ఏలూరు జిల్లాల్లో వర్షాలు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన
-
Jul 03, 2026 06:52 IST
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
రెండురోజుల్లో మరింత బలపడనున్న అల్పపీడనం
ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షసూచన
పలుచోట్ల పిడుగులు పడే అవకాశం
-
Jul 03, 2026 06:51 IST
FIFA WC: రౌండ్ ఆఫ్ 32లో ఆస్ట్రియాపై స్పెయిన్ విజయం
3-0తో గెలిచి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లిన ఇంగ్లండ్ జట్టు
పోర్చుగల్ Vs క్రోయేషియా మధ్య జరిగే మ్యాచ్‌లో విన్నర్‌తో నెక్స్ట్ రౌండ్‌లో తలపడనున్న ఇంగ్లండ్
ఇప్పటివరకు 11 జట్లు రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై