Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 31 , 2026 | 06:51 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 31, 2026 21:25 IST

    గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం

    • జూడోలో స్వర్ణం సాధించిన అస్మిత దే

    • 48 కిలోల మహిళల జూడో విభాగంలో అస్మితకు స్వర్ణం

  • Jul 31, 2026 21:21 IST

    మెట్రో ప్రయాణికుల సౌకర్యాలపై సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

    • మెట్రో–ఆర్టీసీకి ఒకే టికెట్ విధానం తీసుకురావాలని సీఎస్‌ సూచన

    • మెట్రో, TGSRTC కోసం ఉమ్మడి యాప్ అభివృద్ధికి ఆదేశం

    • రోజువారీ, నెలవారీ మెట్రో పాస్‌లపై ప్రణాళిక రూపొందించాలి: సంజయ్‌ జాజు

  • Jul 31, 2026 21:08 IST

    భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం

    • 50.60 అడుగుల వద్ద 12,91,256 క్యూసెక్కుల వరద ప్రవాహం

    • కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక

  • Jul 31, 2026 20:54 IST

    శ్రీకాకుళం: వైసీపీ నేతలపై పోలీసుల చర్యలు

    • జగన్ పర్యటనలో మహిళా ఎస్‌ఐపై వైసీపీ నేతల దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌

    • వైసీపీ నేత చింతాడ రవికుమార్‌తో పాటు 21 మందిపై కేసులు నమోదు

    • సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల చర్యలు

  • Jul 31, 2026 20:26 IST

    ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష

    • ఏపీఎస్‌డీఎంఏ కార్యాలయాన్ని సందర్శించిన ఎన్డీఎంఏ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం

    • విపత్తుల ముందస్తు సన్నద్ధత బలోపేతంపై కేంద్ర బృందం సమీక్ష

    • వడగాలులు, పిడుగుపాట్ల నివారణ కార్యాచరణపై అధికారులతో చర్చ

  • Jul 31, 2026 20:05 IST

    ఎల్‌ఆర్‌ఎస్ (LRS) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

    • ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, ఛార్జీలపై 25 శాతం రాయితీ కొనసాగింపు

    • ఆగస్టు 1 నుంచి నవంబర్ 30, 2026 వరకు రాయితీ వర్తింపు

  • Jul 31, 2026 19:53 IST

    భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి

    • కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

    • 49.5 అడుగులకు చేరిన నీటిమట్టం

    • 12,24,690 క్యూసెక్కుల నీటి ప్రవాహం

  • Jul 31, 2026 19:27 IST

    భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు

    • 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యం

    • థింసా నృత్యంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

    • గిన్నిస్‌ అవార్డు అందుకున్న మంత్రి సంధ్యారాణి

  • Jul 31, 2026 19:23 IST

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవంపై సీఎం చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్‌

    • ఎయిర్‌పోర్ట్ ప్రాంగణాన్ని తెలుగు సంస్కృతి, వారసత్వ వైభవంతో తీర్చిదిద్దాలన్న సీఎం

    • థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించేలా నిర్వహించాలని చంద్రబాబు సూచన

  • Jul 31, 2026 19:18 IST

    మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు

    • కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోషల్ మీడియోలో ఏఐ వీడియో పెట్టిన అంబటి

  • Jul 31, 2026 19:01 IST

    తెలంగాణలో SIR గడువు మరోసారి పొడిగింపు

    • ఆగస్టు 10 వరకు పొడిగించిన ఎన్నికల సంఘం

  • Jul 31, 2026 18:38 IST

    AU మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు

    • ప్రసాద్‌రెడ్డితో పాటు నలుగురిని సస్పెండ్ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ

    • వైసీపీ హయాంలో ఇష్టానుసారం అక్రమాలు

    • రూ.కోట్లలో AUలో నిధుల దుర్వినియోగం

  • Jul 31, 2026 18:31 IST

    రాజమండ్రి: ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతి

    • బ్యారేజ్ నుంచి 5.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల

    • ధవళేశ్వరం దగ్గర 7.28 అడుగులకు నీటి మట్టం

    • ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

    • కోనసీమ జిల్లాలో జలదిగ్బంధంలో లంక గ్రామాలు

  • Jul 31, 2026 18:25 IST

    విజయనగరం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

    • ఆగస్టు 1న విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

    • సాంప్రదాయ థింసా నృత్యంతో రేపు 13,500 మంది గిరిజన మహిళలతో ప్రధాని మోదీకి స్వాగతం

    • ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు, కళలు ఉట్టి పడేలా విమానాశ్రయం అలంకరణ

  • Jul 31, 2026 18:06 IST

    నటి రష్మిక మందన్నకు తీవ్ర గాయం

    • డ్యాన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా గాయపడ్డ రష్మిక

    • 6 వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన

    పూర్తి కథనం

  • Jul 31, 2026 17:56 IST

    తెలంగాణ ఉద్యోగుల హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌పై CS సంజయ్ జాజు సమీక్ష

    • ఉద్యోగుల ఆరోగ్య పథకం మరింత బలోపేతం చేయాలి: CS సంజయ్‌ జాజు

    • చికిత్స ప్యాకేజీ రేట్లపై సమగ్ర సమీక్ష కోసం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, సబ్‌ కమిటీలు ఏర్పాటు

    • ఆస్పత్రుల సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ

  • Jul 31, 2026 17:45 IST

    అందుబాటులోకి ఫ్యామిలీ సర్టిఫికెట్‌: డిప్యూటీ సీఎం భట్టి

    • తహసీల్దార్‌, మీ సేవా కేంద్రాల్లో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ: భట్టి విక్రమార్క

  • Jul 31, 2026 17:22 IST

    రోడ్లపై తిరిగే జంతువుల వల్ల ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • వీధి జంతువులు.. పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి: సుప్రీంకోర్టు

    • జంతువుల వల్ల ప్రమాదాలు జరిగితే పరిహారం చెల్లించేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలి

    • పశువులను రోడ్లపై వదిలేస్తే యజమానులదే పూర్తి బాధ్యత: సుప్రీంకోర్టు

  • Jul 31, 2026 17:04 IST

    అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా

    • శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంచలన నిర్ణయం

    • విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్‌ చేయాలని ఆదేశం

  • Jul 31, 2026 16:48 IST

    ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు

    • జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చిన కర్కర్డుమా సెషన్స్ కోర్టు

    • ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో శిక్ష ఖరారు

    • ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారిని పాశవికంగా హత్య చేసిన అల్లరి మూకలు

  • Jul 31, 2026 16:29 IST

    కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    • వివిధ పథకాలకు రూ.4,50,988 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం

    • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధికి రూ.3,15,614 కోట్లు కేటాయింపు

    • సముద్ర మంథన్ పథకానికి రూ.84,084 కోట్లు కేటాయింపు

    • ఖేలో ఇండియా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పథకానికి రూ.36,441 కోట్లు

    • యూని డైరెక్షనల్ ట్విన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణానికి రూ.9,779 కోట్లు

    • సూర్య సరోవర్‌ యోజన పథకానికి రూ.5,070 కోట్లు కేటాయింపు

  • Jul 31, 2026 16:18 IST

    తెలంగాణ కొత్త డీఎంఈగా డా.N.వాణికి పదోన్నతి

    • అదనపు DME నుంచి DMEగా డా.N.వాణికి ప్రమోషన్‌

  • Jul 31, 2026 16:11 IST

    భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి

    • రెండో ప్రమాద హెచ్చరిక జారీ

    • 48 అడుగులకు చేరిన నీటిమట్టం

    • 11,44,645 క్యూసెక్కుల నీటి ప్రవాహం

  • Jul 31, 2026 16:09 IST

    కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి జల వివాదం

    • తమిళనాడు ప్రభుత్వంతో చర్చల్లేవ్‌: CM డీకే శివకుమార్‌

    • విపక్షాలతో చర్చించాకే నీటి విడుదలపై క్లారిటీ: డీకే శివకుమార్‌

    • కర్ణాటక బంద్‌ నిర్ణయాన్ని విపక్షాలు విరమించుకోవాలి: డీకే

  • Jul 31, 2026 15:54 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 166 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 66 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Jul 31, 2026 15:49 IST

    శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా సిద్ధం!

    • గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ బుమ్రా

    • ఫిట్‌నెస్ టెస్టులో పాసైనట్లు వెల్లడించిన బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

  • Jul 31, 2026 15:42 IST

    బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా

    • వ్యక్తిగత కారణాలతో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి

    • 2017లో బీజేపీలో చేరిన షెహజాద్ పూనావాలా

    పూర్తి కథనం

  • Jul 31, 2026 15:37 IST

    జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులకు లైన్ క్లియర్

    • భార్య పాయల్‌తో వివాదాలను పరిష్కరించుకున్నట్టు కోర్టుకు తెలిపిన సీఎం

    • ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తామన్న సుప్రీంకోర్టు

    పూర్తి కథనం

  • Jul 31, 2026 15:31 IST

    ఆదిలాబాద్‌: ఉధృతంగా ప్రవహిస్తోన్న పెన్‌గంగా నది

    • ఆనంద్‌పూర్‌ దగ్గర వంతెనపైకి చేరిన వరదనీరు

    • మహారాష్ట్ర-తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు

    • సాంగిడి గ్రామ సమీపంలోకి పెన్‌గంగా బ్యాక్‌ వాటర్‌

  • Jul 31, 2026 15:20 IST

    కర్ణాటకలో జన నాయగన్ స్క్రీనింగ్‌ నిలిపివేత

    • మాండ్యలో జన నాయగన్ స్క్రీనింగ్‌ను అడ్డుకున్న ప్రో కన్నడ గ్రూపులు

    • స్వచ్ఛందంగా స్క్రీనింగ్ నిలిపివేసిన పలు థియేటర్ల యజమానులు

  • Jul 31, 2026 14:39 IST

    జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వం సీరియస్

    • కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశం

    • శ్రీకాకుళం పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు

    • మహిళా SIపై దాడి ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్

    • పోలీసులపైకి దూసుకెళ్లిన వారిని కూడా వదిలిపెట్టొద్దని ఆదేశం

    • నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల నమోదుకు ఆదేశం

    • చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశం

  • Jul 31, 2026 14:37 IST

    తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ అలర్ట్

    • నకిలీ DAP ఎరువులు కొనుగోలు చేయొద్దని సూచన

    • 5 జిల్లాల్లో నకిలీ ఎరువుల ఘటనలతో అలర్ట్

    • నకిలీ ఎరువుల విక్రేతలపై కేసులు నమోదు

  • Jul 31, 2026 14:36 IST

    ఏపీ SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదల

    • 3.71కోట్ల మంది ఓటర్లు ఎన్యుమరేషన్ సమర్పించారని వెల్లడి

    • 4.16కోట్ల ఓటర్లలో 89.22శాతం ఫారాలు ఇచ్చినట్టు CEO ప్రకటన

    • 7.37 లక్షల మంది పేర్లు పలుచోట్ల నమోదైనట్టు గుర్తింపు

    • ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ

    • అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితా విడుదల

  • Jul 31, 2026 14:14 IST

    కడప: పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం జగన్ రెడ్డి

    • తన పెదనాన్న వైఎస్ ఆనంద రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన జగన్

    • నిన్న అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ ఆనంద రెడ్డి

  • Jul 31, 2026 13:49 IST

    హైదరాబాద్: సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన మెట్రో రైల్ బోర్డు మీటింగ్

    • మెట్రో ఫేజ్-1 టేకోవర్ రుణంపై చర్చ

    • తెలంగాణకు IRFC రుణంపై కొనసాగుతున్న సస్పెన్స్

    • మెట్రో రుణం తదుపరి కార్యాచరణపై కీలక చర్చ

  • Jul 31, 2026 13:46 IST

    ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ

    • పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం

  • Jul 31, 2026 13:45 IST

    అమరావతి: ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2,36,870 క్యూసెక్కులు

    • ధవళేశ్వరం దగ్గర ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

    • శనివారం ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

    • గోదావరి పరీవాహక జిల్లాల్లో పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ

  • Jul 31, 2026 13:41 IST

    ఏలూరు: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ఉధృతి

    • పొంగిన గుండేటి వాగు, ఎద్దువాగు

    • 30 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

  • Jul 31, 2026 13:34 IST

    యూనివర్సిటీల పాలనలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు

    • 19 యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

    • యూనివర్సిటీల పాలకమండళ్ల పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం

    • గత ప్రభుత్వంలో నియమించిన నామినేటెడ్ సభ్యుల తొలగింపు

  • Jul 31, 2026 12:59 IST

    నెల్లూరు: కోట గ్రామంలో దారుణం

    • ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

    • ఇంట్లో నుంచి బయటకి పరుగులు తీసిన మహిళ

    • మంటలార్పి ఆస్పత్రికి తరలించిన స్థానికులు

    • మహిళ పరిస్థితి విషమం

  • Jul 31, 2026 12:58 IST

    వన్డే ప్రపంచ కప్‌కు భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

    • 2027 వన్డే ప్రపంచ కప్ జట్టు అంచనాలను వెల్లడించిన మాజీ క్రికెటర్ ఆర్.అశ్విన్

    • భువనేశ్వర్ కుమార్‌ను ఈ టోర్నీలో ఆడించాలి: అశ్విన్

    • ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలి: అశ్విన్

  • Jul 31, 2026 12:40 IST

    పార్లమెంట్‌ ఉభయసభలు సోమవారానికి వాయిదా

    • విపక్షాల నినాదాల మధ్య ఉభయసభలు వాయిదా

  • Jul 31, 2026 12:38 IST

    ములుగు: వెంకటాపురం మండలంలో ఎడతెరిపిలేని వర్షం

    • ఆలుబాక దగ్గర బోదాపురం వంతెన పైనుంచి వరద ప్రవాహం

    • వెంకటాపురం-భద్రాచలం మధ్య నిలిచిన రాకపోకలు

  • Jul 31, 2026 12:33 IST

    ఢిల్లీ జంతర్‌ మంతర్‌ ఘటనపై పోలీసు కుటుంబాల ఆవేదన

    • గాయపడిన పోలీస్ సిబ్బందికి న్యాయం చేయాలని కుటుంబాల డిమాండ్

    • రాళ్లు, చెప్పులతో దాడి చేశారని ఆరోపణ.. న్యాయం చేయాలని విజ్ఞప్తి

    పూర్తికథనం

  • Jul 31, 2026 12:25 IST

    కరాచీ: గ్యాంగ్‌స్టర్‌ ఉజైర్‌ బలోచ్‌ సోదరుడు జుబైర్‌ బలోచ్‌పై కాల్పులు

    • ఛాతి, పొట్టలోకి తూటాలు.. పరిస్థితి విషమం

    • ఆసుపత్రికి తరలించిన పోలీసులు

    • కాల్పుల్లో మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు

    • బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పరార్‌

    • గ్యాంగ్‌ వార్‌, వ్యక్తిగత కక్షల కోణంలో దర్యాప్తు

  • Jul 31, 2026 12:22 IST

    విజయనగరం: భోగాపురం ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువు: గోవా గవర్నర్ అశోక్‌ గజపతిరాజు

    • క్రెడిట్ తమదే అని చెప్పుకుంటున్న జగన్ వ్యాఖ్యలపై స్పందించకపోవడమే ఉత్తమం: అశోక్‌ గజపతిరాజు

    • జగన్ చరిత్ర ప్రజలకు తెలుసు: అశోక్‌ గజపతిరాజు

  • Jul 31, 2026 12:20 IST

    ఢిల్లీ: 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ గడువు పొడిగింపునకు లోక్‌సభ ఆమోదం

    • 30రోజులకు మించి జైల్లో ఉంటే పీఎం, సీఎం, మంత్రులు పదవి కోల్పోయేలా రాజ్యాంగ సవరణ బిల్లు

  • Jul 31, 2026 12:11 IST

    కామారెడ్డిలో రిటైర్డ్ ఉద్యోగికి రూ.33 లక్షల టోకరా

    • ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టించిన కేటుగాళ్లు

    • IPO పెట్టుబడి పేరుతో మరింత డబ్బు డిమాండ్

    • విత్‌డ్రా చేసినా డబ్బు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు

  • Jul 31, 2026 12:11 IST

    అస్సాంలో భారీ వరదలు..

    • 80కి చేరిన మృతుల సంఖ్య

    • రాష్ట్రంలో అన్ని రకాల రుణాల చెల్లింపులపై 6 నెలల మారిటోరియం

  • Jul 31, 2026 12:10 IST

    ఢిల్లీ: విద్యార్థులపై పెల్లెట్ గన్స్‌తో దాడి చేశారు: ఖర్గే

    • ఇప్పుడు FIRలు నమోదు చేస్తున్నారు: ఖర్గే

    • సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తున్నారు

    • యువతుల వివరాలు బహిర్గతమవుతున్నాయి

    • అమిత్‌షా పార్లమెంట్‌కు రావడం లేదు: ఖర్గే

    • అమిత్‌షా రాజీనామా చేయాలి: ఖర్గే

  • Jul 31, 2026 12:09 IST

    జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత

    • భారీ వర్షాలతో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు

    • ఉధంపూర్-బనిహాల్ మధ్య అమర్‌నాథ్ యాత్రికులకు ప్రమాదకరంగా మారడంతో నిర్ణయం

  • Jul 31, 2026 12:03 IST

    ప్రభుత్వం విద్యార్థులను వేధిస్తే.. మళ్లీ రోడ్డెక్కాల్సి వస్తుంది: అభిజిత్‌ దీప్కే

    • విద్యార్థుల విషయంలో ప్రభుత్వం జోక్యాన్ని వ్యతిరేకించిన దీప్కే

  • Jul 31, 2026 12:00 IST

    ఢిల్లీ: రాజ్యసభ సోమవారానికి వాయిదా

  • Jul 31, 2026 11:46 IST

    పోలవరం: శబరి గోదావరి నదులలో పెరుగుతున్న నీటిమట్టం

    • ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పెరుగుతున్న వరద ఉధృతి

    • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

    • విలీన మండలాల్లోని ప్రజలకు వరద భయం

  • Jul 31, 2026 11:32 IST

    కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం

    • 388 కిలోలు ఎత్తి రజతం సాధించిన భారత అథ్లెట్ లవ్‌ప్రీత్ సింగ్

    • స్వర్ణ పతకం కైవసం చేసుకున్న న్యూజిలాండ్ అథ్లెట్ డేవిడ్ ఆండ్రూ(389)

    • ఒక్క కిలో తేడాతో లవ్‌ప్రీత్ సింగ్‌కు చేజారిన స్వర్ణం

  • Jul 31, 2026 11:12 IST

    హైదరాబాద్: ఫార్ములా-ఈ రేస్ కేసుపై నాంపల్లి ఏసీబీ కోర్టు విచారణ

    • విచారణకు హాజరైన కేటీఆర్, ఐఏఎస్ అరవింద్‌, బీఎల్ఎన్ రెడ్డి

    • రూ.లక్ష పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశం

    • తదుపరి విచారణ వచ్చే నెల 25కు వాయిదా

  • Jul 31, 2026 11:09 IST

    ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన

  • Jul 31, 2026 11:08 IST

    గుజరాత్‌లో భారీ వర్షాలు..

    • 13 జిల్లాలకు రెడ్ అలర్ట్

    • గుజరాత్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

  • Jul 31, 2026 11:08 IST

    ఢిల్లీ: విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మ.12గంటలకు వాయిదా

  • Jul 31, 2026 10:26 IST

    రహానె రిటైర్మెంట్.. రోహిత్‌ శర్మ స్పందన..

    • రహానె ఎంతగా శ్రమిస్తాడో నాకు తెలుసు: రోహిత్

    • అతనిది చాలా కష్టపడే తత్వం: రోహిత్

  • Jul 31, 2026 10:22 IST

    మహారాష్ట్ర: థానే జిల్లా భీవాండిలో ప్రమాదం

    • 4 అంతస్తుల భవనం కుప్పకూలి తొమ్మిది మంది మృతి

    • శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు

    • ఘటనాస్థలిలో పోలీసులు, NDRF సహాయక చర్యలు

  • Jul 31, 2026 10:18 IST

    హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్

    • ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణకు హాజరు

    • విచారణకు హాజరైన ఐఏఎస్ అరవింద్‌, బీఎల్ఎన్ రెడ్డి

    • కోర్టు సమన్లతో తొలిసారి విచారణకు హాజరైన నిందితులు

  • Jul 31, 2026 10:16 IST

    ఢిల్లీ: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

    • జెన్‌జీ నోరు మూయించలేరు: రాహుల్‌గాంధీ

    • మొదట విద్యార్థుల ఎముకలు విరిచారు: రాహుల్

    • ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు: రాహుల్

    • సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు: రాహుల్

    • దేశ భవిష్యత్ విషయంలో జాగ్రత్తగా ఉండండి: రాహుల్

  • Jul 31, 2026 10:15 IST

    మెటా ఇండియా హెడ్‌ అరుణ్‌ శ్రీనివాస్‌పై హైదరాబాద్‌ సైబర్‌ పోలీసుల కేసు

    • ప్రధాని మోదీపై డిజిటల్‌గా మార్ఫింగ్‌ చేసిన కంటెంట్‌ ప్రచారం చేశారంటూ ఫిర్యాదులు

    • అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలతో పోస్టులు వైరల్‌ చేసినట్లు ఆరోపణ

  • Jul 31, 2026 10:13 IST

    వాషింగ్టన్‌: జేడీ వాన్స్‌ను నిలదీసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

    • వాషింగ్టన్‌లోని బ్లెయిర్‌ హౌస్‌లో జేడీ వాన్స్, నేతన్యాహు భేటీ

    • ఇజ్రాయెల్ ప్రభుత్వంపై వాన్స్‌ విమర్శలపై చర్చ

    • వాన్స్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నెతన్యాహు

  • Jul 31, 2026 10:13 IST

    వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ ఎలా చేశారు?: హర్షా భోగ్లే

    • మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించిన క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే

    • వైభవ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు: భోగ్లే

  • Jul 31, 2026 09:55 IST

    హైదరాబాద్: నాంపల్లి ఏసీబీ కోర్టు దగ్గర భారీ బందోబస్తు

    • కేటీఆర్ విచారణ దృష్ట్యా మోహరించిన పోలీసులు

    • నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు

  • Jul 31, 2026 09:55 IST

    విశాఖ: లంకెలపాలెం సమీపంలో రోడ్డుప్రమాదం

    • అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్

    • ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

  • Jul 31, 2026 09:54 IST

    హైదరాబాద్: ఆయిల్ పామ్ కంపెనీలతో మంత్రి తుమ్మల సమీక్ష

    • రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణలో కంపెనీల లక్ష్య సాధనపై చర్చ

    • నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ మిల్లుల పనుల పురోగతిపై చర్చ

  • Jul 31, 2026 09:17 IST

    ములుగు: బొగత జలపాతానికి మళ్ళీ పెరిగిన వరద ఉధృతి

    • పర్యాటకుల సందర్శన నిలిపివేత

  • Jul 31, 2026 09:05 IST

    అమరావతి: మహిళా ఎస్ఐపై వైసీపీ నేతల తీరు తీవ్ర ఆక్షేపణీయం: మంత్రి లోకేశ్

    • మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తప్పవు: లోకేశ్

    • మహిళలను అవమనించడం, రాక్షస ఆనందం పొందడం వైసీపీ DNAలోనే ఉంది: లోకేశ్

  • Jul 31, 2026 09:02 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉ.11గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం

    • మ.3:45కు విశాఖకు బయల్దేరనున్న సీఎం చంద్రబాబు

    • సా.5:25కు పోర్ట్ గెస్ట్ హౌస్‌కు సీఎం చంద్రబాబు

    • రేపు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం

  • Jul 31, 2026 09:01 IST

    కడప: నగరంలోని సెంట్రల్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ

    • జీవిత ఖైదు శిక్షలో ఉన్న ఓ ఖైదీకి గాయాలు

    • మాంసం కోసం రెండు వర్గాల మధ్య గొడవ

    • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

  • Jul 31, 2026 08:45 IST

    పాకిస్థాన్‌లోని బొగ్గుగనిలో పేలుడు

    • 32 మంది మైనర్ల మృతి

    • గనిలో చిక్కుకుపోయిన మరో 10 మంది

  • Jul 31, 2026 07:58 IST

    విశాఖ: AU మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ రిపోర్ట్

    • ప్రసాద్‌రెడ్డితో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

    • ఇవాళ పదవీవిరమణ చేయనున్న ప్రసాద్‌రెడ్డి

    • అవకతవకలపై ప్రసాద్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం

  • Jul 31, 2026 07:58 IST

    పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

    • తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్‌రెడ్డి పాత్ర చిరస్మరణీయం: రేవంత్

    • సుదర్శన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: రేవంత్

  • Jul 31, 2026 07:58 IST

    వర్షాలతో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

  • Jul 31, 2026 07:57 IST

    ములుగు: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

    • రామన్నగూడెం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

    • దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

  • Jul 31, 2026 07:57 IST

    ములుగు: వాజేడులోని పేరూరు దగ్గర పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

    • చీకుపల్లి-పెద్ద గొల్లగూడెం మధ్య కొట్టుకుపోయిన తాత్కాలిక అప్రోచ్ రోడ్డు

    • 26 గ్రామాల ప్రజలు నాటు పడవల సహాయంతో ప్రయాణం

  • Jul 31, 2026 07:56 IST

    పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్ దిగ్భ్రాంతి

    • పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం సమాజానికి తీరని లోటు: మహేష్‌గౌడ్

    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా: మహేష్‌గౌడ్

  • Jul 31, 2026 07:56 IST

    భద్రాచలం దగ్గర 34.90 అడుగులకు చేరిన గోదావరి

    • ఎగువ కురుస్తున్న వర్షాలతో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • Jul 31, 2026 07:55 IST

    నిర్మల్: కడెం ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తివేత

    • ఇన్‌ఫ్లో 35,473 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 46,747 క్యూసెక్కులు

  • Jul 31, 2026 07:55 IST

    మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్ల ఎత్తివేత

    • ఇన్‌ఫ్లో 1,32,785 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,16,750 క్యూసెక్కులు

  • Jul 31, 2026 07:55 IST

    మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌ 17 గేట్ల ఎత్తివేత

    • ఇన్‌ఫ్లో 1.15లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.11లక్షల క్యూసెక్కులు

    • 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి

  • Jul 31, 2026 06:55 IST

    ఐటీఆర్‌ దాఖలకు నేటితో ముగియనున్న గడువు

    • నిన్న ఒక్కరోజు 30 లక్షల మంది రిటర్న్‌లు దాఖలు

  • Jul 31, 2026 06:55 IST

    నిర్మల్: కడెం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

    • 46,747 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

    • ప్రాజెక్టు ఇన్ ఫ్లో 35,473 క్యూ సెక్కులు

  • Jul 31, 2026 06:55 IST

    మంచిర్యాల : ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్ల ఎత్తివేత

    • 1,16,750 క్యూ సెక్కుల నీరు దిగువకు విడుదల

    • ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,32,785 క్యూ సెక్కులు

  • Jul 31, 2026 06:54 IST

    పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి

    • కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్‌

    • పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది: కేసీఆర్‌

    • కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి: కేసీఆర్‌

  • Jul 31, 2026 06:54 IST

    2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి

    • పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి

    • టీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి

    • పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతికి రాజకీయ, సామాజిక ప్రముఖుల సంతాపం

  • Jul 31, 2026 06:53 IST

    హైదరాబాద్‌ నుంచి నర్సంపేటకు పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికకాయం

    • హనుమకొండలో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు

    • నర్సంపేట నుంచి స్వగ్రామం నల్లబెల్లికి తరలింపు

    • మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు

  • Jul 31, 2026 06:53 IST

    హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత

    • సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

    • అర్థరాత్రి 12:51 నిమిషాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి తుదిశ్వాస

    • ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

    • పెద్ది సుదుర్శన్‌రెడ్డి స్వస్థలం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి

  • Jul 31, 2026 06:51 IST

    హైదరాబాద్‌: ఉ.10 గంటలకు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

    • ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్

  • Jul 31, 2026 06:51 IST

    ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

    • మ.ఒంటిగంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

    • పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం