-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 29th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 29 , 2026 | 07:30 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 29, 2026 21:32 IST
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్
-
Jul 29, 2026 21:10 IST
విజయనగరం: తాటిపూడి బాలికల గురుకులంలో 50 మందికిపైగా అస్వస్థత
వైరల్ ఫీవర్‌గా గుర్తింపు, విద్యార్థినిలకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
-
Jul 29, 2026 21:03 IST
కర్నూలు: ఆదోని కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్
యువగళం పాదయాత్రలో ఆదోని సమస్యలు గమనించా: లోకేశ్
దేశంలోనే ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీది: లోకేశ్
కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రత్యేక నిధి అమలు: లోకేశ్
పార్టీలో కష్టపడేవారికి గుర్తింపు ఉంటుంది: మంత్రి లోకేశ్
DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి లోకేశ్
టీడీపీ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే టీడీపీ: మంత్రి లోకేశ్
-
Jul 29, 2026 20:48 IST
విజయనగరం: జగన్ సహా వైసీపీ నేతలపై మంత్రి అచ్చెన్న ఫైర్
క్రెడిట్ చోరీ కోసం వైసీపీ నేతల కుట్రలు: మంత్రి అచ్చెన్న
వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యం: మంత్రి అచ్చెన్న
ప్రజలు అసహ్యించుకునే స్థాయిలో జగన్ ఉన్నారు: అచ్చెన్న
జగన్ ధన దాహంతో ఎన్నో ప్రాజెక్టులు పారిపోయాయి: అచ్చెన్న
జగన్ చర్యలతో ప్రజలు అసహ్యించుకుంటున్నారు: అచ్చెన్న
-
Jul 29, 2026 20:47 IST
హైదరాబాద్: మీసేవ పనితీరుపై CS సంజయ్ జాజు సమీక్ష
దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పౌర సేవల వేదికగా మీసేవ: CS
ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి మరిన్ని సేవలు: CS
AI, డేటా ఆధారిత సాంకేతికతతో మీ సేవ బలోపేతం: CS
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందించేలా చర్యలు: CS
-
Jul 29, 2026 20:36 IST
SIR పురోగతిపై కలెక్టర్లతో TG CEO సుదర్శన్‌రెడ్డి సమీక్ష
SIRకు సంక్షేమ పథకాలతో సంబంధం లేదు: CEO
తప్పులు లేని ఓటర్ల జాబితా కోసమే SIR: CEO
ఆగస్టు 3లోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: CEO
ఇప్పటి వరకు 76 శాతం డిజిటలైజేషన్ పూర్తి: CEO
-
Jul 29, 2026 19:43 IST
గొడ్డలి పార్టీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదు: సీఎం చంద్రబాబు
వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ: చంద్రబాబు
పుట్టిన రోజులకు గొడ్డళ్లతో జంతుబలులు చేసి రాక్షసానందం పొందే హింసా ప్రవృత్తి గొడ్డలి పార్టీది: చంద్రబాబు
వైసీపీ పాలనలో సీసీటీవీ కెమెరాల నిర్వహణ గాలికొదిలేశారు: చంద్రబాబు
-
Jul 29, 2026 19:35 IST
పల్నాడు: అమరావతి మం. యండ్రాయిలో విషాదం
ఆవు కోసం చెరువులో దిగి ఇద్దరు విద్యార్థుల మృతి
మృతులు శివ (17), కిరణ్ (17)గా గుర్తింపు
-
Jul 29, 2026 19:34 IST
ఆళ్లగడ్డలో ఏం జరిగినా సోషల్ మీడియాలో ట్రోల్: MLA అఖిలప్రియ
ప్రతి విషయాన్ని వివాదం చేస్తున్నారు: MLA అఖిలప్రియ
అన్ని అంశాలపై పల్లా శ్రీనివాసరావుకు వివరించి స్పష్టత ఇచ్చా: అఖిలప్రియ
-
Jul 29, 2026 19:21 IST
ఐటీ మంత్రి లోకేశ్‌తో తైవాన్ బృందం ప్రత్యేక సమావేశం
ఏపీ యువతకు తైవాన్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలపై చర్చ
నైపుణ్యాభివృద్ధి, టెక్నికల్ ట్రైనింగ్‌పై పరస్పర సహకారం
సెమీకండక్టర్లు, ప్రిసిషన్ ఇంజినీరింగ్‌లో స్కిల్ పార్ట్‌నర్‌షిప్‌కు అంగీకారం
ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్‌కేర్ రంగాల్లోనూ సహకారం
-
Jul 29, 2026 19:01 IST
గతంలో రాహుల్ చెప్పారు కాబట్టే సైలెంట్‌గా ఉన్నా: జగ్గారెడ్డి
రాహుల్‌కు మాట ఇచ్చా కాబట్టే పార్టీ అంశాలు బహిరంగంగా మాట్లాడను: జగ్గారెడ్డి
నేనేదైనా మాట్లాడాలనుకుంటే రాహుల్‌తోనే చెప్తా: జగ్గారెడ్డి
మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాను: జగ్గారెడ్డి
-
Jul 29, 2026 18:43 IST
కర్నూలు: నందికొట్కూరు మం. మల్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్యాయత్నం
వెహికల్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక పాములపాడు మం. ఎర్రగూడూరు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబ సభ్యులు
భార్య మాధవి(34), కూతుళ్లు తేజ(9), అక్షయ(7)తో కలిసి గడ్డి మందు తాగిన రామసుబ్బయ్య(38)
-
Jul 29, 2026 18:24 IST
ఢిల్లీ: కాళేశ్వరం కట్టిన వారం రోజుల్లోనే లీక్ అయింది: ఉత్తమ్
లీక్ అంశం కేసీఆర్‌కు కూడా తెలుసు: మంత్రి ఉత్తమ్
ఇంజినీర్ రమణారెడ్డి సహా అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదు: మంత్రి ఉత్తమ్
-
Jul 29, 2026 18:23 IST
ఢిల్లీ: విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్ షాదే బాధ్యత: రాహుల్
మేకులున్న లాఠీలతో విద్యార్థులను కొట్టారు: రాహుల్
లోక్‌సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు: రాహుల్
నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు: రాహుల్
నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు: రాహుల్
-
Jul 29, 2026 18:03 IST
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం
బాక్సింగ్‌లో సాక్షి చౌదరికి కనీసం కాంస్య పతకం ఖాయం
బాక్సింగ్ 51 కిలోల విభాగంలో సెమీస్ చేరిన సాక్షి చౌదరి
బాక్సింగ్‌లో భారత్‌కు 5 పతకాలు ఖాయం
ఇప్పటికే సెమీస్ చేరిన లవ్లీనా, ప్రీతి, ప్రియ, జాదుమణి సింగ్
సెమీస్‌లో ఓడినా కనీసం కాంస్యం దక్కించుకోనున్న బాక్సర్లు
-
Jul 29, 2026 18:02 IST
చిత్తూరు: వైసీపీ నేతలపై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
నాడు కౌరవ సభలో ద్రౌపది చీర లాగి ధర్మరాజుని అవమానించాలని చూశారు: భువనేశ్వరి
గతంలో అసెంబ్లీలో చంద్రబాబును ఇబ్బందిపెట్టాలని నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు: నారా భువనేశ్వరి
స్త్రీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు?: భువనేశ్వరి
నాడు ద్రౌపదికి కృష్ణుడే దిగివచ్చి సాయం చేశాడు: భువనేశ్వరి
ప్రజలే దేవుళ్లుగా మారి మాకు అండగా నిలిచారు: భువనేశ్వరి
-
Jul 29, 2026 17:58 IST
ఢిల్లీ: పరీక్షార్థులకు అమిత్ షా శుభాకాంక్షలు
లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: అమిత్ షా
విద్యార్థుల ఆకాంక్షల కోసమే కఠిన చట్టం: అమిత్ షా
అక్రమాలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు: అమిత్ షా
-
Jul 29, 2026 17:56 IST
అమరావతి: రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల(RSK) పీపీపీ విధానంపై హైకోర్టులో విచారణ
RSK పీపీపీ విధానాన్ని తీసుకువస్తూ జీఓ జారీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు
పిటిషనర్ తరఫున అడ్వకేట్ శ్రీనివాస్‌రావు దాఖలు చేసిన పిల్‌పై విచారణ
CJ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ
తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం
-
Jul 29, 2026 17:44 IST
కర్నూలు: మంత్రాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
కల్లుదేవకుంట వద్ద టూవీలర్-లారీ ఢీ
ఆస్పరి గ్రామానికి చెందిన ఇద్దరి మృతి
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 29, 2026 17:42 IST
విశాఖపట్నం: క్రెడిట్ చోరీ జగన్‌కి అలవాటైపోయింది: మంత్రి కొలుసు పార్థసారథి
గూగుల్ వైసీపీనే తెచ్చిందని ప్రచారం: కొలుసు పార్థసారథి
మీరెందుకు పనులు మొదలు పెట్టలేదు: కొలుసు పార్థసారథి
ఉత్తరాంధ్ర ఒకటే కాదు.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి: కొలుసు పార్థసారథి
విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోంది: కొలుసు పార్థసారథి
-
Jul 29, 2026 17:03 IST
పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని బాలసదన్ నుంచి ఇద్దరు బాలికల పరారీ
కాంపౌండ్ వాల్ దూకిన 9వ తరగతి, 4వ తరగతికి చెందిన ఇద్దరు బాలికలు
కుర్చీలు వేసుకుని గోడ దూకినట్లు గుర్తింపు
బాలసదన్‌ను పరిశీలించిన డీసీపీ రామ్‌రెడ్డి నాయక్ ఏసీపీ పోలీసులు
-
Jul 29, 2026 16:59 IST
అమరావతి: గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రజల భద్రత, వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యం: పవన్ కల్యాణ్
దశాబ్దాల నుంచి నెలకొన్న మానవ-ఏనుగు సంఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్: పవన్
ఆధునిక సాంకేతికతతో మన్యంలో అటవీ ఏనుగుల సమస్యకు పరిష్కారం: పవన్
-
Jul 29, 2026 16:53 IST
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం
పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్
కేంద్ర పర్యావరణ శాఖ 2021 నాటి ఆఫీస్ మెమోరాండం(OM)ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
తీర్పును 'భవిష్యత్తు వర్తింపు' విధానంలో అమలు చేయాలని ఆదేశం
-
Jul 29, 2026 16:50 IST
వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా
లోతైన దర్యాప్తు కోరుతూ సునీత పిటిషన్‌పై విచారణ ఆగస్టు 6కు వాయిదా
-
Jul 29, 2026 16:49 IST
ఏపీ టీడీపీ చీఫ్ పల్లాతో ఆళ్లగడ్డ MLA అఖిలప్రియ భేటీ
ఆళ్లగడ్డలో ఘటనలు, ఫిర్యాదులపై ఎమ్మెల్యే అఖిలప్రియను పిలిచిన అధిష్ఠానం
అహోబిలం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు: పల్లా శ్రీనివాస్
పార్టీ క్రమశిక్షణ మీరితే ఎవరినైనా ఉపేక్షించం: పల్లా శ్రీనివాస్
-
Jul 29, 2026 16:43 IST
అమరావతి: అందుబాటులో ఉన్న నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ
వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ నేత ఉన్నారు: చంద్రబాబు
గొడ్డలి పార్టీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదు: చంద్రబాబు
-
Jul 29, 2026 16:43 IST
మంచిర్యాలలో భారీ వర్షాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం, ఉప్పొంగిన రాళ్లవాగు
-
Jul 29, 2026 16:29 IST
ఢిల్లీ: నేడు సాయంత్రం 6 గంటలకు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్
పార్లమెంటులో తన మైక్ ఆఫ్ చేశారని ఆరోపించిన కాంగ్రెస్ అగ్రనేత
అందువల్లే తాను చెప్పదలచుకున్నది మీడియా ముందు చెబుతానని వెల్లడి
-
Jul 29, 2026 16:28 IST
హైకోర్టులో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ
4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
ప్రతివాదులకు నోటీసులు, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం
-
Jul 29, 2026 16:25 IST
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు స్వల్పంగా పెరిగిన వరద
ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, ప్రస్తుతం 1065 అడుగులు
నీటి సామర్థ్యం 80 టీఎంసీలు, ప్రస్తుతం 16 టీఎంసీలు
-
Jul 29, 2026 16:08 IST
తైవాన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
తైపే ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్(TEEC) ప్రతినిధులతో భేటీ
APEDB అధికారులతో కలిసి పెట్టుబడులపై చంద్రబాబు చర్చ
ఏపీలో పెట్టుబడులు, తయారీ రంగ అవకాశాలపై చర్చ
-
Jul 29, 2026 15:55 IST
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నాం: జగన్
నిర్మాణ ఘనత మా ప్రభుత్వానిదే: జగన్
-
Jul 29, 2026 15:53 IST
పొగాకు రైతులను ఆదుకుంటున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
ప్రభుత్వ చర్యలు జగన్‌కు కనిపించడం లేదా?: అచ్చెన్న
రైతులను ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం: అచ్చెన్న
రైతులకు మేలుచేసే సలహాలిస్తే స్వీకరిస్తాం: అచ్చెన్నాయుడు
-
Jul 29, 2026 15:49 IST
హైదరాబాద్: ఉప్పరపల్లి కోర్టుకు ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి
మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ అరెస్ట్
-
Jul 29, 2026 15:42 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
889 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
265 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 29, 2026 15:36 IST
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
-
Jul 29, 2026 15:30 IST
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మూజువాణి ఓటు ద్వారా పాసైన బిల్లు
వీగిపోయిన విపక్షాల సవరణలు
పేపర్ లీక్‌లకు పాల్పడితే కఠినచర్యలు విధించేలా బిల్లు
బిల్లు ఆమోదం తర్వాత లోక్‌సభ రేపటికి వాయిదా
-
Jul 29, 2026 15:22 IST
కేంద్రమంత్రి అమిత్ షాను మళ్లీ టార్గెట్ చేసిన రాహుల్‌గాంధీ
కాల్పుల ఘటనకు సంబంధించి 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి: రాహుల్
ఆప్షన్-1లో విద్యార్థులపై కాల్పులు జరపాలంటూ ఆదేశించి ఉండొచ్చు: రాహుల్
ఆప్షన్-2లో కాల్పుల ఘటన అమిత్ షాకు తెలిసి ఉండకపోవచ్చు: రాహుల్
కాల్పులకు అమిత్ షా ఆదేశించి ఉంటే శిక్షార్హుడు: రాహుల్
-
Jul 29, 2026 15:13 IST
వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
వందేమాతరానికి చట్టపరమైన రక్షణ
జనగణమన తరహాలో రక్షణ కల్పించే బిల్లు
చర్చల అనంతరం బిల్లుకు గ్రీన్‌సిగ్నల్
-
Jul 29, 2026 15:06 IST
లోక్‌సభ: రాహుల్ వ్యాఖ్యలపై దుమారం
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై BJP అభ్యంతరం
రాహుల్ అప్రజాస్వామిక భాష వాడారు: జితేంద్ర సింగ్
పార్లమెంటరీ ప్రాథమిక నియమాలు రాహుల్‌కు తెలియవు: జితేంద్ర సింగ్
రాహుల్ క్షమాపణలు చెప్పాలి: జితేంద్ర సింగ్
-
Jul 29, 2026 14:58 IST
రాజ్యసభ: వందేమాతరం సవరణ బిల్లుపై చర్చ
వందేమాతరం సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు
రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
-
Jul 29, 2026 14:50 IST
శ్రీకాకుళం: ముగిసిన తమ్మినేని సీతారాం విచారణ
తమ్మినేనిని 4 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు
నకిలీ డాక్యుమెంట్లతో భూమి రిజిస్ట్రేషన్ కేసులో తమ్మినేనిని విచారించిన పోలీసులు
అవసరమైతే మరోసారి విచారణకు రావాలని ఆదేశం
-
Jul 29, 2026 14:42 IST
రాజ్యసభలో NDA సభ్యులకు విప్ జారీ
సభకు అందరూ హాజరుకావాలని ఆదేశం
వందేమాతరం సవరణ బిల్లును ఆమోదించేందుకు కేంద్రం సన్నద్ధత
-
Jul 29, 2026 14:38 IST
ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి శుభ్‌మన్ గిల్
801 రేటింగ్ పాయింట్లతో వన్డేల్లో అగ్రస్థానానికి ఎగబాకిన భారత కెప్టెన్
టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ
278వ స్థానం నుంచి 48వ స్థానానికి దూసుకొచ్చిన వైభవ్
-
Jul 29, 2026 14:35 IST
లోక్‌సభ మ.3 గంటల వరకు వాయిదా
విపక్షాల ఆందోళనతో మరోసారి సభ వాయిదా
-
Jul 29, 2026 14:13 IST
ఢిల్లీ: లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల ఆందోళన
రాహుల్ మైక్ కట్ చేశారని కాంగ్రెస్ సభ్యుల నిరసన
రాహుల్ వ్యాఖ్యలపై నిరసనకు దిగిన బీజేపీ ఎంపీలు
అమిత్‌షాకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
సభ్యుల ఆందోళనతో లోక్‌సభ మ.2:30కు వాయిదా
-
Jul 29, 2026 13:46 IST
ఢిల్లీ: నేను ఎంపీలను విమర్శించలేదు: రాహుల్ గాంధీ
బీజేపీ ఎంపీలు కావాలనే నా ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు: రాహుల్
సభలో కేవలం బీజేపీ ఎంపీలే మాట్లాడాలనడం సరికాదు: రాహుల్
-
Jul 29, 2026 13:45 IST
ఢిల్లీ: రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకోవద్దని NDA ఎంపీలకు రాజ్‌నాథ్ సూచన
-
Jul 29, 2026 13:45 IST
ఢిల్లీ: రాహుల్ తన భాషను మార్చుకోవాలి: కిరణ్ రిజిజు
విద్యార్థుల పేరుతో అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారు: రిజిజు
రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: కిరణ్ రిజిజు
-
Jul 29, 2026 13:44 IST
ఢిల్లీ: లోక్‌సభలో రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ ఎంపీలు
రాహుల్ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటంపై బీజేపీ అభ్యంతరం
రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం
ప్రసంగాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపని రాహుల్‌గాంధీ
-
Jul 29, 2026 13:43 IST
ఢిల్లీ: రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల నిరసన
అమిత్‌షాకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
-
Jul 29, 2026 13:43 IST
ఢిల్లీ: ఇవాళ లోక్‌సభకు హోంమంత్రి అమిత్‌షా ఎందుకు రాలేదు?: రాహుల్
అమిత్‌షాకు ఇక్కడ కూర్చునే ధైర్యం లేదు: రాహుల్
హోంమంత్రి అమిత్‌షా భయంతో వణికిపోతున్నారు: రాహుల్
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారు?: రాహుల్
విద్యార్థులపై పెల్లెట్స్ దాడికి హోంమంత్రే కారణం: రాహుల్
-
Jul 29, 2026 13:41 IST
ఢిల్లీ: విద్యార్థుల విషయంలో కేంద్రం మూర్ఖంగా వ్యవహరించింది: రాహుల్‌గాంధీ
విద్యారంగం ఖరీదైన వ్యాపారంగా మారింది: రాహుల్
పేదలు విద్యకు దూరమవుతున్నారు: రాహుల్
విద్యార్థులను రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారు: రాహుల్
మూర్ఖులు ఎవరి మాటలు వినరని.. విద్యార్థులు నాతో చెప్పారు: రాహుల్
ప్రభుత్వంలో ఉన్నవారు తమ ఆవేదనను పట్టించుకోరని చెప్పారు: రాహుల్
వారి ఆవేదనను పట్టించుకోలేదనే విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు: రాహుల్
-
Jul 29, 2026 13:14 IST
అమరావతి: జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: డిప్యూటీ సీఎం పవన్
పులుల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ: పవన్ కల్యాణ్
తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవానికి అడుగులు: పవన్
నల్లమలలో పులి గర్జన శాశ్వతం చేయడమే లక్ష్యం: పవన్
-
Jul 29, 2026 13:13 IST
విశాఖ: అమరావతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అక్కసు
డబ్బు అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారు.. ఇది పద్ధతేనా?: ధర్మాన
గతంలో హైదరాబాద్‌లో ఖర్చు పెట్టడంతో మా ప్రాంతంలో అభివృద్ధి మాకే చెందాలన్న స్వార్థంతో మనల్ని తరిమేశారు: ధర్మాన
మళ్లీ మీరు అదే పని చేయాలని చూస్తున్నారు: ధర్మాన
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు: ధర్మాన
-
Jul 29, 2026 13:12 IST
ఢిల్లీ: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ
బిల్లుపై మాట్లాడుతున్న విపక్ష నేత రాహుల్‌గాంధీ
పేపర్ లీక్‌పై ఏం జరిగిందో బీజేపీ నేతలు వారి పిల్లలను అడగాలి: రాహుల్
ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదు.. భావ వ్యక్తీకరణ: రాహుల్
విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారు: రాహుల్
విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు: రాహుల్
యువత సెంటిమెంట్‌ను పార్టీలన్నీ గౌరవించాలి: రాహుల్
విద్యార్థుల నిరసనను కేంద్రం అర్థం చేసుకోలేదు: రాహుల్
-
Jul 29, 2026 13:11 IST
లఖ్‌నవూ: మాజీ యూపీ మంత్రి నానక్ రామ్ భుర్జీ మృతి
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 7వ అంతస్తు నుంచి పడి మృతి
ప్రమాదమా? ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసుల విచారణ
-
Jul 29, 2026 13:04 IST
ఢిల్లీ: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ
బిల్లుపై మాట్లాడుతున్న విపక్ష నేత రాహుల్‌గాంధీ
-
Jul 29, 2026 13:04 IST
భూపాలపల్లి: మహాముత్తారంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఉప్పొంగి ప్రవహిస్తున్న పెద్దవాగు, కొనంపేట వాగులు
కాటారం-మేడారం మార్గంలో నిలిచిపోయిన వాహనాలు
-
Jul 29, 2026 13:02 IST
కోల్ స్కామ్ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్
2015 నాటి ట్రయల్ కోర్టు సమన్లను రద్దు చేసిన సుప్రీంకోర్టు
మన్మోహన్‌పై నమోదైన క్రిమినల్ కేసును ముగిస్తూ CJI ఉత్తర్వులు
-
Jul 29, 2026 13:01 IST
టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం.. 13 కు చేరిన మృతుల సంఖ్య
భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం
కషిమా పట్టణంలో భూకంప ధాటికి కుప్పకూలిన మాల్
మాల్ శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు అనుమానం
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Jul 29, 2026 12:42 IST
ఢిల్లీ: పౌరులుగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
SIR ప్రక్రియను కాంగ్రెస్ BLAలు వేగవంతం చేయాలి: భట్టి
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం: భట్టి
-
Jul 29, 2026 12:40 IST
జార్ఖండ్: మావోయిస్టు అగ్రనేత మిషిర్ బెస్రా అరెస్ట్
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న బెస్రా
పలు దాడుల్లో కీలకంగా వ్యవహరించిన బెస్రా
-
Jul 29, 2026 12:30 IST
ఢిల్లీ: ముగిసిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం
SIRపై సమీక్ష నిర్వహించాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
తెలంగాణలో SIR 50-60శాతం పూర్తయింది: మహేశ్ గౌడ్
రెండు మూడు రోజుల్లో 100శాతం పూర్తవుతుంది: మహేశ్ గౌడ్
సామాన్యుల ఓట్లను తొలగిస్తున్నారు: మహేశ్ గౌడ్
-
Jul 29, 2026 12:29 IST
ఢిల్లీ: ప్రియాంకా గాంధీపై స్పీకర్‌కు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ఫిర్యాదు
ప్రహ్లాద్‌జోషిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ప్రియాంక
నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు: ప్రియాంక
-
Jul 29, 2026 12:28 IST
ఢిల్లీ: లోక్‌సభలో జనన మరణాల నమోదు సవరణ బిల్లు
బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిత్యానందరాయ్
-
Jul 29, 2026 12:22 IST
హైదరాబాద్: హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్
బంగాళాఖాతంలో మునిగిపోయినవారే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామనడంలో అర్థం లేదు: తుమ్మల
ఏ పార్టీ నిర్వహించని ముఖాముఖిని కాంగ్రెస్ నిర్వహిస్తోంది: తుమ్మల
వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ 30శాతం లోటు వర్షపాతం: తుమ్మల
వచ్చే 3 నెలలు కూడా ఎల్‌నినో ప్రభావం ఉంటుంది: తుమ్మల
అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం: తుమ్మల
-
Jul 29, 2026 12:21 IST
ఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయంలో ముగిసిన తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం
-
Jul 29, 2026 12:15 IST
విశాఖ: గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న సింహగిరి
భక్తుల రద్దీతో ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనాల నిలిపివేత
రోడ్డు, మెట్ల మార్గాల్లో భారీగా తరలివస్తున్న భక్తులు
భక్తుల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన దేవస్థానం
సింహగిరిపై స్వామివారి మండపం చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం
-
Jul 29, 2026 12:03 IST
కడప: బద్వేల్ పట్టణంలో విషాదం
ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వివాహిత
భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని సమాచారం
-
Jul 29, 2026 11:59 IST
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులు
పూర్తి నీటినిల్వ 80 టీఎంసీలు, ప్రస్తుత నీటినిల్వ 16 టీఎంసీలు
-
Jul 29, 2026 11:57 IST
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు
నహన్‌లో ఆరెంజ్ అలర్ట్, విద్యాసంస్థల మూసివేత
-
Jul 29, 2026 11:34 IST
ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు మ.12గంటలకు వాయిదా
-
Jul 29, 2026 11:33 IST
ఢిల్లీ: రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వర్సెస్ జేపీ నడ్డా
విద్యార్థులపై దాడి చేసినవారు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు: ఖర్గే
బీజేపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు: ఖర్గే
దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు: మల్లికార్జున ఖర్గే
శాంతిభద్రతలను కాపాడేందుకే పోలీసుల చర్యలు: కేంద్రమంత్రి జేపీ నడ్డా
ఎమర్జెన్సీ సమయంలో అరెస్టులను గుర్తు చేసిన జేపీ నడ్డా
క్లాస్‌లో ఉండగానే నన్ను అరెస్ట్ చేశారు: జేపీ నడ్డా
-
Jul 29, 2026 11:19 IST
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రికి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తరలింపు
వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
-
Jul 29, 2026 11:19 IST
ఢిల్లీ: రాజ్యసభలో విపక్షాల ఆందోళన
పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు
అన్ని అంశాలపై చర్చ చేపడదామన్న రాజ్యసభ చైర్మన్
సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలి: చైర్మన్
-
Jul 29, 2026 11:13 IST
కర్నూలు: ఆదోని చిన్నారుల వీడియోకు స్పందించిన మంత్రి లోకేశ్
మాకు మీతో ఫొటో కావాలని చిన్నారులు సహస్ర, జయ వీడియో
చిన్నారుల వీడియోను ఇన్‌స్టాలో రీపోస్ట్ చేసిన మంత్రి లోకేశ్
నేను కూడా మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నానంటూ మెసేజ్
మంత్రి లోకేశ్ స్పందనకు స్థానికులు, నెటిజన్ల నుంచి ప్రశంసలు
-
Jul 29, 2026 11:11 IST
ఢిల్లీ: లోక్‌సభ 12 గంటలకు వాయిదా
విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా
-
Jul 29, 2026 10:46 IST
హైదరాబాద్: హైటెక్ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ
తమ్మిడికుంట చెరువు దగ్గర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతు తెలిపిన పలు కాలనీల వాసులు
హైడ్రా చీఫ్‌గా రంగనాథ్‌ను కొనసాగించాలని నినాదాలు
-
Jul 29, 2026 10:43 IST
అమరావతి: విజయవాడ మహిళా కోర్టుని ఆశ్రయించిన జోగి ఫ్యామిలీ
అరెస్ట్ చేయొద్దంటూ మహిళా కోర్టులో పిటిషన్లు
వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముందస్తు చర్యలు
మహిళా స్పెషల్ కోర్టులో జోగి కుటుంబ సభ్యుల పిటిషన్
కౌంటర్ దాఖలు చేయమని ఇబ్రహీంపట్నం పోలీసులకి న్యాయస్థానం ఆదేశం
విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసిన కోర్టు
-
Jul 29, 2026 10:30 IST
హైదరాబాద్: భారీ వర్షాలపై జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సమావేశం
హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం
క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి: జలమండలి ఎండీ
తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: జలమండలి ఎండీ
ముంపు ప్రాంతాల్లో నీటి తొలగింపు, సీవర్ జెట్టింగ్ యంత్రాల పనితీరును డీజీఎంలు తనిఖీ చేయాలి: జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
-
Jul 29, 2026 10:17 IST
గద్వాల: రాఘవేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాల ముందు క్షుద్ర పూజల కలకలం
పాఠశాల గేట్ ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
-
Jul 29, 2026 10:16 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్
ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనపై సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడని డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు
వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణ
విచారణ జరిపి చర్యలు తీసుకున్న సీపీ సజ్జనార్
-
Jul 29, 2026 10:11 IST
ఢిల్లీ: మరికాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ ఉభయసభలు
నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్(సవరణ) బిల్లుపై కొనసాగనున్న చర్చ
మధ్యాహ్నం 12.30 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్న రాహుల్ గాంధీ
-
Jul 29, 2026 10:05 IST
WI vs PAK: పాకిస్థాన్‌కు బిగ్ షాక్
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ ఓటమి
90 పరుగుల తేడాతో ఓడిన పాక్
రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 120 పరుగులే చేసిన పాక్
-
Jul 29, 2026 10:04 IST
భారీ లాభాల్లో దేశీయ సూచీలు..
730 పాయింట్ల లాభంలో సెన్సెక్స్..
205 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ..
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.76..
-
Jul 29, 2026 09:14 IST
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు
చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో ఉప్పొంగిన వాగులు
ప్రమాదకరంగా ఉన్న వాగులు దాటొద్దని అధికారుల హెచ్చరిక
-
Jul 29, 2026 09:14 IST
భద్రాద్రి: మణుగూరు, ఇల్లందులో కురుస్తున్న వర్షం
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
నిలిచిన 50వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
-
Jul 29, 2026 09:14 IST
గద్వాల: జూరాల ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద
ఇన్‌ఫ్లో 27 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 28వేల క్యూసెక్కులు
10 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
-
Jul 29, 2026 09:13 IST
మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కలకలం
వారోత్సవాలకు సంబంధించిన బ్యానర్లు గుర్తింపు
ఆరుగురు అనుమానితుల అరెస్ట్, కొనసాగుతున్న కూంబింగ్
-
Jul 29, 2026 09:13 IST
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల కాల్పులు
ఆందోళనకారులపై పాక్ రేంజర్స్ కాల్పులు
34 మంది మృతి, 200 మందికిపైగా గాయాలు
పీవోకేలో నిలిచిన రవాణా, సమాచార వ్యవస్థ
పాక్ బలగాల కాల్పులపై హక్కుల సంఘాలు ఆగ్రహం
-
Jul 29, 2026 09:11 IST
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసకారులపై ఉక్కుపాదం
పూంచ్ డివిజన్‌లో 13 పాఠశాలల గుర్తింపు రద్దు
JAAC నేతల ఆస్తుల స్వాధీనం.. వ్యాపార సంస్థలు సీజ్
JAAC నేతలు, నిరసనకారుల పాస్‌పోర్ట్‌ల సస్పెన్షన్
జర్నలిస్టుల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్
ఉగ్రవాదుల జాబితాలో 500 మందిని చేర్చిన పాక్ సర్కార్
-
Jul 29, 2026 09:11 IST
అమెరికా బలగాలపై బాలిస్టిక్ క్షిపణులతో టెహ్రాన్ దాడులు
ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామన్న యూఎస్
సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి: అమెరికా
ఒమన్‌లోని దక్షిణ మార్గంలో నౌకలపైనా ఇరాన్ దాడులు
టెహ్రాన్ దాడుల దృష్ట్యా ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ
-
Jul 29, 2026 09:10 IST
పౌర విమానయానశాఖ కీలక ప్రకటన
ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచే విమాన సర్వీసులు
17న అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
ఆగస్టు 17 తర్వాత విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలు బంద్: పౌరవిమానయాన శాఖ
-
Jul 29, 2026 09:08 IST
చిత్తూరు: కుప్పంలో మూడోరోజు నారా భువనేశ్వరి పర్యటన
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న భువనేశ్వరి
-
Jul 29, 2026 09:08 IST
అమారవతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్
ఉ.11:30కు తైవాన్ డెలిగేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
మ.2:30కు ప్రధాని మోదీ పర్యటనపై సీఎం సమీక్ష
-
Jul 29, 2026 07:41 IST
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
-
Jul 29, 2026 07:40 IST
ఏపీ హైకోర్టులో సీఐ నాగరాజు క్వాష్ పిటిషన్
నేడు పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం
తనపై నమోదైన కేసు కొట్టేయాలని పిటిషన్
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అరెస్టయిన నాగరాజు
-
Jul 29, 2026 07:40 IST
తెలంగాణ కేబినెట్ విస్తరణపై నేడు ఢిల్లీలో కీలక భేటీ
ఈ రోజు ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం
మంత్రుల శాఖల మార్పుపై కీలక చర్చ జరిగే అవకాశం
కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్
-
Jul 29, 2026 07:40 IST
తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు
యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో వర్షాలు
ఖమ్మం, భద్రాద్రి, ములుగులో తేలికపాటి వర్షాలు
-
Jul 29, 2026 07:38 IST
హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
-
Jul 29, 2026 07:36 IST
నేటి నుంచి కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
ఆదోనిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి లోకేశ్ సమావేశం
రాత్రికి ఆదోనిలోనే మంత్రి లోకేశ్ బస
రేపు పత్తికొండ మండలం హోసూర్‌లో సోలార్ పవర్ ప్లాంట్‌కు భూమి పూజ
-
Jul 29, 2026 07:34 IST
హైదరాబాద్: మియాపూర్‌లో దారుణం
తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు
మియాపూర్ వైశాలినగర్ అండర్ పాస్ వద్ద ఘటన
హఫీజ్‌పేట్ వాసి బాలయ్య(70)గా గుర్తింపు
గాలిస్తున్న హైడ్రా, NDRF బృందం
-
Jul 29, 2026 07:33 IST
VIP బ్రేక్ దర్శనాలంటూ ఓ వ్యాపార సంస్థ ప్రచారంపై టీటీడీ చర్యలు
బ్రేక్ దర్శనాలు అంటూ SCP డెవలపర్స్ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు
ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం VIP దర్శనాలు అంటూ ప్రచారం
సేవలు, దర్శనాల టికెట్లు నిబంధనల మేరకే ఉంటాయన్న టీటీడీ