-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 13th June 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 13 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 13, 2026 21:42 IST
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు
ఉపాధి హామీ నిధులను వినియోగించుకునేలా పనులు చేపట్టాలి: సీఎం
వర్షపు నీటిని వడిసిపట్టేలా నీటి వనరులను సిద్ధం చేయాలి: సీఎం
కాల్వల కరకట్టలు పటిష్ఠపర్చాలి: సీఎం
-
Jun 13, 2026 21:38 IST
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట
మంత్రి సీతక్క చొరవతో పునర్నియామకానికి అవకాశం
గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన వారికి తిరిగి విధుల్లో చేరే అవకాశం
అర్హులైన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల అప్పీల్స్‌ను పరిశీలించనున్న ప్రభుత్వం
వారి స్థానంలో కొత్త నియామకం లేకపోతే పునర్నియామకానికి గ్రీన్ సిగ్నల్
-
Jun 13, 2026 20:40 IST
తిరుపతి గ్రాండ్ వరల్డ్ రోడ్డులో చిరుత పులి సంచారం
నివాస ప్రాంతానికి సమీపంలో చిరుత కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన
ఇంటి పైభాగం నుంచి చిరుత పులిని వీడియోలో చిత్రీకరించిన స్థానికులు
చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
-
Jun 13, 2026 20:32 IST
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో విషాదం
కొడుకు, కూతురికి ఉరి వేసి.. తానూ ఉరివేసుకున్న నవనీత (30)
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు
కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం
ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు
-
Jun 13, 2026 19:59 IST
భారత్‌తో తొలి వన్డే: అఫ్గానిస్థాన్ ఆలౌట్
24.5 ఓవర్లలో అఫ్గాన్ స్కోర్ 194/10
48 బంతుల్లోనే సెంచరీ బాదిన అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్(102)
మిగతా బ్యాటర్లంతా విఫలం
అరంగేట్రంలోనే తలో 3 వికెట్లతో చెలరేగిన హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్
అర్ష్‌దీప్ సింగ్ 2, నితీశ్ కుమార్ 2 వికెట్లు
భారత్ టార్గెట్ 195
-
Jun 13, 2026 19:24 IST
రోహిత్ శర్మ అరుదైన రికార్డు
భారత్ తరఫున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు
రోహిత్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాల 44 రోజులు
మాజీ ప్లేయర్ మోహిందర్ అమర్‌నాథ్ రికార్డు బ్రేక్
-
Jun 13, 2026 19:18 IST
హోర్ముజ్ జలసంధిలో తాజా పరిణామాలపై జైశంకర్‌తో మాట్లాడిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
భారత వాణిజ్య నౌకలు అమెరికా బలగాల ఆదేశాలను పాటించాలన్న రూబియో
హోర్ముజ్ జలసంధిలో శాంతి, భద్రత పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందన్న రూబియో
అమెరికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించడం సహించబోమన్న రూబియో
ఇరాన్ చమురు అక్రమ రవాణాపై కఠినంగా ఉంటామన్న అమెరికా
-
Jun 13, 2026 19:15 IST
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
2024, 2025 సంవత్సరాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది కళాకారుల ఎంపిక
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు అవార్డు రావడం సంతోషకరం: పవన్
-
Jun 13, 2026 19:12 IST
మంచిర్యాల : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్
సింగరేణి సంస్థను, కార్మికులను కాపాడు కుంటాం: భట్టి
ఇచ్చిన హామీలన్నింటినీ నెర వేరుస్తున్నాం: భట్టి
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకూ బోనస్ ఇచ్చాము: భట్టి
బీఆర్ఎస్ సింగరేణి దోపిడీ అని ప్రచారం చేస్తోంది: భట్టి
పదేళ్ల పాలనలో అనేక అక్రమాలకు పాల్పడ్డందుకే కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారు: భట్టి
అధికారం పోయిందన్న కోపంతో రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు: భట్టి
హరీష్ రావు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు: భట్టి
-
Jun 13, 2026 18:37 IST
కోనసీమ: అల్లవరం మండలం బొడసకుర్రులో దారుణం
టిడ్కో గృహ సముదాయంలో మహిళ రామలక్ష్మి హత్య
రామలక్ష్మిని భర్త శ్రీను హత్య చేసినట్లు బంధువుల ఆరోపణ
-
Jun 13, 2026 18:36 IST
హైదరాబాద్: అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా అరెస్టు
రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం, ఐదుగురి అరెస్టు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గంజాయి సేకరిస్తున్న ముఠా
డ్రై గంజాయిని మహారాష్ట్ర వైపు రవాణా చేస్తున్న ముఠా
-
Jun 13, 2026 18:35 IST
హైదరాబాద్: నా ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించి సిట్ పిలిచింది: ఎంపీ అనిల్ కుమార్
ఏ రోజు ఏ సమయానికి ట్యాప్ చేశారో కొన్ని వివరాలను నా ముందుంచి ప్రశ్నించారు: అనిల్ కుమార్
ఫోన్ ట్యాపింగ్‌తో BRS నీచ రాజకీయాలు చేసింది: అనిల్ కుమార్
నా తండ్రి అంజన్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు: అనిల్ కుమార్
-
Jun 13, 2026 18:34 IST
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
ముగిసిన ఎంపీ అనిల్ కుమార్ సిట్ విచారణ
అనిల్ కుమార్‌ను అరగంటపాటు ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్
అనిల్ తండ్రి అంజన్ కుమార్ స్టేట్‌మెంట్‌ను ఆయన నివాసంలోనే రికార్డు చేయనున్న సిట్
-
Jun 13, 2026 18:00 IST
తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్ పరిధిలో హైఅలర్ట్‌గా ఉండాలని అధికారులకు ఆదేశాలు
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్
-
Jun 13, 2026 17:38 IST
పంజాబ్‌కు ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన కేజ్రీవాల్
నవంబర్ 2026లో అసెంబ్లీ ఎన్నికలు
ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్
ఎన్నికల ప్రచారానికి సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపు
-
Jun 13, 2026 17:28 IST
హైదరాబాద్: ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ఏఐతో వ్యాధులను ముందుగానే అంచనా వేసే దిశగా వైద్యరంగం: మంత్రి శ్రీధర్ బాబు
ఏఐ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాదు.. సహాయక సాధనం మాత్రమే: మంత్రి శ్రీధర్ బాబు
ప్రతి రోగికి వ్యక్తిగత వైద్య సేవలు అందించడంలో ఏఐ కీలకం: మంత్రి శ్రీధర్ బాబు
హెల్త్ టెక్ రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లాంచ్‌ప్యాడ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు
-
Jun 13, 2026 17:23 IST
మంచిర్యాల: సింగరేణి వారసులకు నియామక పత్రాలు
335 మందికి ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్
-
Jun 13, 2026 17:18 IST
భారత్-అఫ్గాన్ తొలి వన్డే: టాస్ నెగ్గిన టీమిండియా
ధర్మశాల వేదికగా భారత్-అఫ్గాన్ మ్యాచ్
వర్షం కారణంగా ఆలస్యమైన టాస్
టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
తొలుత బ్యాటింగ్ చేయనున్న అఫ్గానిస్థాన్
-
Jun 13, 2026 17:14 IST
వర్షాల నేపథ్యంలో ప్రజలకు అలర్ట్ జారీ చేసిన తెలంగాణ విద్యుత్ శాఖ
భారీ వర్షాలు, గాలివానల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెగిపోయిన విద్యుత్ వైర్లు, కూలిన విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దు
విద్యుత్ వైర్లు, పరికరాలను స్వయంగా తాకరాదు
మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరిక
ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే 1912కు సమాచారం ఇవ్వాలి
సమీప TGSCPDCL అధికారులకు వెంటనే తెలియజేయాలి
-
Jun 13, 2026 17:09 IST
భారత్-అఫ్గాన్ తొలి వన్డే: తగ్గిన వర్షం..
ధర్మశాల వేదికగా జరగాల్సిన భారత్-అఫ్గాన్ తొలి వన్డే వర్షం కారణంగా ఆలస్యం
తగ్గిన వర్షం.. 5.15 గంటలకు పడనున్న టాస్
5.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం
మ్యాచ్ 25 ఓవర్లకు కుదింపు
-
Jun 13, 2026 16:48 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌లో వర్షం
శంషాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం
హైదరాబాద్-బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జామ్
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం
సదాశివపేట దగ్గర రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు
సంగారెడ్డి-సదాశివపేట మార్గంలో ట్రాఫిక్ జామ్
-
Jun 13, 2026 16:14 IST
యూపీ: అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంపై వివాదం
విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు
విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డిమాండ్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వినతి చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరిన ట్రస్ట్
-
Jun 13, 2026 16:07 IST
హైదరాబాద్: సిటీలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
షేక్‌పేట్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లిలో భారీగా ఈదురుగాలులు.
-
Jun 13, 2026 16:06 IST
తెలంగాణకు భారీ వర్ష సూచన
సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం
ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సిద్దిపేట్, వరంగల్ రూరల్, జనగాం, భద్రాద్రి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్
దక్షిణ తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
రేపు, ఎల్లుండి కూడా ఉరుములతో కూడిన వర్షాల అవకాశం
రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
-
Jun 13, 2026 16:02 IST
పాకిస్థాన్‌పై మాత్రం ఓడొద్దు.. జెమీమాతో వాచ్‌మెన్
మహిళల టీ20 ప్రపంచ కప్: ఆదివారం భారత్-పాక్ మ్యాచ్
ఎవరి చేతిలో ఓడినా సరే.. పాక్‌పై మాత్రం గెలవాలని మా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ అన్నారు: జెమీమా
-
Jun 13, 2026 15:59 IST
హైదరాబాద్: మరికాసేపట్లో నగర వ్యాప్తంగా భారీ వర్షం!
పశ్చిమ హైదరాబాద్‌కు తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష హెచ్చరిక
వచ్చే గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
తెల్లాపూర్, నల్లగండ్ల, పటాన్‌చెరు, BHEL ప్రాంతాలకు అలర్ట్
మియాపూర్, గచ్చిబౌలి, హైదరాబాద్ యూనివర్సిటీ పరిసరాల్లో భారీ వర్ష సూచన
బలమైన ఈదురుగాలులు, తీవ్ర మెరుపులు సంభవించే అవకాశం
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని వాతావరణ శాఖ సూచన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ హెచ్చరిక
-
Jun 13, 2026 15:47 IST
ఖమ్మం: వైరా మండలం సోమవరం దగ్గర పోలీసుల తనిఖీలు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న కంటెయినర్ లారీ స్వాధీనం
ఇసుక లారీ వెనుక ఎస్కార్ట్‌గా వస్తున్న కారు స్వాధీనం
ఎస్కార్ట్‌లో ఉన్న ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jun 13, 2026 15:31 IST
నల్లగొండ: మిర్యాలగూడ పట్టణంలో రోడ్డు ప్రమాదం
రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్
కోదాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా వెనుక భాగంలో ఢీకొట్టిన కంటైనర్
బస్సులో 35 మంది ప్రయాణికులు.. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
-
Jun 13, 2026 15:29 IST
ఢిల్లీ: తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియామకం
ధీరజ్ సేథ్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
-
Jun 13, 2026 15:29 IST
అమరావతి: జగన్ అరాచక పాలనకు ప్రజలే ముగింపు పలికారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది: కొల్లు రవీంద్ర
ప్రజల నమ్మకాన్ని జగన్ ప్రభుత్వం దెబ్బతీసింది: కొల్లు రవీంద్ర
24 నెలల్లో భారీ పెట్టుబడులు సాధించాం: మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ పాలనను ప్రజలు తిరస్కరించారు: మంత్రి కొల్లు రవీంద్ర
-
Jun 13, 2026 15:14 IST
పోలీసులపై బంగ్లా క్రికెటర్ సంచలన ఆరోపణలు
చట్టోగ్రామ్ పోలీసులు నాపై దాడి చేశారు: నయీం హసన్
జాతీయ క్రికెట్ జట్టు ప్లేయర్‌నని చెప్పినా వినలేదు: హసన్
నా గొంతు పట్టుకుని పోలీసు వాహనంలోకి ఎక్కించారు: హసన్
-
Jun 13, 2026 15:09 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
సింగరేణిలో అవకతవకల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి: కిషన్‌రెడ్డి
ఆరోపణల్లో నిజనిజాలపై సమగ్ర విచారణ జరపాలి: కిషన్‌రెడ్డి
చర్యలు తీసుకోకపోతే సింగరేణి ప్రయోజనాలకు విఘాతం: కిషన్‌రెడ్డి
కార్మికుల సంక్షేమం విషయంలో ప్రత్యేక చొరవ చూపాలి: కిషన్‌రెడ్డి
-
Jun 13, 2026 15:06 IST
అమరావతి: ఏపీ డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
రాష్ట్ర దర్యాప్తు సంస్థతో నిజాలు బయటకు రావు: జగన్
సీబీఐ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: జగన్
-
Jun 13, 2026 15:05 IST
కాకినాడ: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు
ఈ కేసులో ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన కుక్క
కుక్క ద్వారా చిన్నారి కేసులో సమాచారం లభిస్తుందని భావించిన పోలీసులు
చిన్నారిని ఎవరైనా అపహరించారా అనే కోణంలో పోలీసుల అన్వేషణ
-
Jun 13, 2026 15:01 IST
అస్సాం: జోర్హాట్‌లో కూలిన ఐఏఎఫ్ విమానం, ఐదుగురి మృతి
జవాన్లకు నివాళులర్పించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజ్‌నాథ్ సింగ్
-
Jun 13, 2026 14:58 IST
చెన్నై: డీఎంకే కూటమిలో కొనసాగడంపై త్వరలో నిర్ణయం ప్రకటించనున్న ఎండీఎంకే
జనరల్ కౌన్సిల్ సమావేశం తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి దురై వైకో
గుర్తు (సింబల్) అంశంపై DMKతో విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య
ఇతర పార్టీ గుర్తుపై పోటీ చేయబోమని స్పష్టం చేసిన MDMK
-
Jun 13, 2026 14:52 IST
నల్లగొండ: మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఆర్థిక సాయం
మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన కట్ట ఝాన్సీ, చందు రెడ్డిలకు అండ
బాధిత చిన్నారులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసిన మంత్రి
-
Jun 13, 2026 14:42 IST
అస్సాం: జోర్హాట్‌లో కూలిన ఐఏఎఫ్ విమానం, ఐదుగురి మృతి
భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానానికి ప్రమాదం
జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన తర్వాత చెలరేగిన మంటలు
ప్రమాద సమయంలో విమానంలో 13 మంది
ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయకచర్యలు
-
Jun 13, 2026 14:38 IST
హైదరాబాద్: VB-G RAM G పథకంపై నిరసన తెలపాలని టీజీ సర్కార్ నిర్ణయం
జులై 1 నుంచి అమలుకానున్న VB-G RAM G పథకం
నిరసన తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం
VB-G RAM G పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం
-
Jun 13, 2026 14:35 IST
అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసుల తనిఖీలు
భూ కుంభకోణం కేసులో దర్యాప్తులో భాగంగా సోదాలు
అభిషేక్ నివాసానికి చేరుకున్న మమతా బెనర్జీ
టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా నివాసాలపై ఈడీ దాడులు
-
Jun 13, 2026 14:28 IST
ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి
జపాన్ స్టార్ యమగుచి చేతిలో పీవీ సింధు పరాజయం
సింధుపై 22-20, 21-12 తేడాతో యమగుచి సునాయస విజయం
దీంతో ఫైనల్‌కు దూసుకెళ్లిన యమగుచి
-
Jun 13, 2026 14:00 IST
భారత్, అఫ్గాన్ తొలి వన్డే మ్యాచ్.. టాస్ ఆలస్యం
ధర్మశాల వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ తొలి వన్డే
వర్షం కారణంగా టాస్ ఆలస్యం
-
Jun 13, 2026 13:57 IST
హైదరాబాద్: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లా దేశీయుల అరెస్ట్
దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్టు పోలీసుల నిర్ధారణ
గాజులరామారం HAL కాలనీలో అద్దె ఇంట్లో నివాసం
పాస్‌పోర్టు, వీసాలు సరిగా లేవని గుర్తించిన పోలీసులు
జోగిపేట డిపోర్టేషన్ సెంటర్‌కు బంగ్లాదేశీయుల తరలింపు
-
Jun 13, 2026 13:54 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరి మృతి
చికిత్స పొందుతూ కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు మృతి
స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య
-
Jun 13, 2026 13:53 IST
సిరిసిల్ల: రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది: కేటీఆర్
బీజేపీ, కాంగ్రెస్‌లా మేం దొంగ ఓట్లతో గెలవాలనుకోం: మాజీ మంత్రి కేటీఆర్
దొంగ ఓట్ల పేరుతో అసలైన ఓట్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోం
రైతు భరోసాతో రైతులను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారు: కేటీఆర్
420 హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించారు: మాజీ మంత్రి కేటీఆర్
-
Jun 13, 2026 13:41 IST
పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు
దేశంలోనే ఉత్తమ పోలీస్ ధృవీకరణ సేవలకు.. 'ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్' అవార్డు
2025-26 ఏడాదిలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో అత్యుత్తమ పనితీరు
తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేసిన విదేశాంగ మంత్రిత్వశాఖ
ఈనెల 19న ఢిల్లీలో అవార్డు అందుకోనున్న డీజీపీ సీవీ ఆనంద్
-
Jun 13, 2026 13:04 IST
ఢిల్లీ: 19 మంది TMC ఎంపీల తిరుగుబాటు
లోక్‌సభలో తమదే అసలైన TMC వర్గమంటూ స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమైన ఎంపీలు
న్యాయ నిపుణులతో TMC రెబల్ ఎంపీల చర్చలు
విలీనం కాకుండా గ్రూప్‌గా ఏర్పడటం రాజ్యాంగ విరుద్ధమంటున్న న్యాయ నిపుణులు
-
Jun 13, 2026 13:01 IST
వైభవ్ సూర్యవంశీ సోదరుడి మెరుపు సెంచరీ
కేవలం 87 బంతుల్లో 103 పరుగులు బాదిన యువ బ్యాటర్
అతడి ఇన్నింగ్స్‌పై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
సోదరుడి ప్రదర్శనపై ప్రశంసలు కురిపించిన వైభవ్
యువ ఆటగాడి ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్
-
Jun 13, 2026 12:59 IST
యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్‌స్ర్కైబర్లను దాటిన తొలి క్రియేటర్‌గా చరిత్ర
ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్ర్కైబర్లు కలిగిన వ్యక్తిగత యూట్యూబర్‌గా నిలిచిన మిస్టర్ బీస్ట్
వినూత్న కంటెంట్‌తో కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ
డిజిటల్ ప్రపంచంలో మరో మైలురాయి చేరుకున్న స్టార్ క్రియేటర్
-
Jun 13, 2026 12:52 IST
సంగారెడ్డి: పటాన్‌చెరులో సైబర్ మోసం
రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.58.94లక్షలు కాజేసిన కేటుగాళ్లు
మనీలాండరింగ్ కేసులో ఆధార్ దుర్వినియోగం చేశారని మోహన్‌రెడ్డికి ఫోన్ చేసి బెదిరించిన ప్రవీణ్, రాజేష్ మిశ్రా
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మోహన్‌రెడ్డి
-
Jun 13, 2026 12:50 IST
హైదరాబాద్: చలో లోక్‌భవన్‌కు NSUI పిలుపు
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా NSUI ఆందోళన
ఇందిరాగాంధీ విగ్రహం నుంచి విద్యార్థుల ర్యాలీ
ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్
-
Jun 13, 2026 12:49 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం
ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితులు
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణంతో 9 విమానాల మళ్లింపు
పలు విమానాలకు తాత్కాలికంగా అనుమతుల నిరాకరణ
-
Jun 13, 2026 12:49 IST
హైదరాబాద్: షబ్బీర్‌అలీపై AICC సీరియస్
మహిళలు, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌పై షబ్బీర్‌అలీ ఆరోపణల ఆడియో వైరల్
షబ్బీర్‌అలీకి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు
-
Jun 13, 2026 12:47 IST
తిరుపతి: DSCపై బహిరంగ చర్చకు సిద్ధమైన కూటమి నేతలు
DSC నియామకాల్లో అవినీతి జరిగిందన్న వైసీపీ ఆరోపణలపై చర్చకు సవాల్ విసిరిన కూటమి నేతలు
తిరుపతి ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న MLC శ్రీకాంత్ సహా కూటమి నేతలు
-
Jun 13, 2026 12:46 IST
ఎన్టీఆర్: మాగల్లులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో పురుగులమందు తాగిన దంపతులు
భర్త మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య
-
Jun 13, 2026 11:24 IST
అసోం: జోర్హాట్‌లో కూలిన IAF విమానం
భారత నౌకాదళానికి చెందిన ఏఎన్-32 విమానంగా గుర్తింపు
జోర్హాట్‌లోని రౌరియా విమాన స్థావరం సమీపంలో ఘటన
పైలట్ మృతిచెందినట్టు అనుమానిస్తున్న అధికారులు
-
Jun 13, 2026 11:19 IST
ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
వారం రోజుల పాటు విదేశీ పర్యటనలో పాల్గొననున్న ప్రధాని
జూన్ 14-15 తేదీల్లో స్లోవేకియాలో పర్యటించనున్న మోదీ
జూన్ 16-17 తేదీల్లో ఇవియాన్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరు
స్లోవేకియా స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి
ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం
-
Jun 13, 2026 11:03 IST
భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు బ్రేక్
స్టార్‌లింక్‌కు తుది భద్రతా అనుమతులు నిలిపివేసిన హోంశాఖ
ఇరాన్ యుద్ధంలో స్టార్‌లింక్ టెర్మినల్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్ భద్రతా సంస్థలు
భద్రతా నిబంధనలకు స్టార్‌లింక్ కట్టుబడి ఉంటుందా అని కేంద్రం పరిశీలన
ఇరాన్ వివాదం వార్తలు పూర్తిగా అవాస్తవమన్న స్టార్‌లింక్ ప్రతినిధి
-
Jun 13, 2026 11:03 IST
బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
నిన్న ఢిల్లీ నుంచి వస్తున్న సీఎం విమానాన్ని బెంగళూరుకు మళ్లింపు
ప్రతికూల వాతావరణంతో నిన్న బెంగళూరులోనే ఉండిపోయిన రేవంత్
-
Jun 13, 2026 11:02 IST
సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో 'మనబడి-మన బాధ్యత' కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్
కార్యక్రమం దగ్గర కనిపించని ఎస్పీ మహేష్
ఎస్పీ ఎందుకు రాలేదని డీఎస్పీపై బండి సంజయ్ ఆగ్రహం
నేను కార్యకర్తను అనుకుంటున్నారా మీ ఎస్పీ.. అని ప్రశ్నించిన సంజయ్
BRS అంటే ఎస్పీకి ఎందుకంత ప్రేమ అని అడిగిన బండి సంజయ్
-
Jun 13, 2026 10:28 IST
ఫిఫా ప్రపంచ కప్ 2026: పరాగ్వేపై అమెరికా విజయం
4-1 తేడాతో యూఎస్ఏ ఘన విజయం
అరుదైన ఘనత సాధించిన అమెరికా
అమెరికా ఒక మ్యాచ్‌లో 4 గోల్స్ చేయడం ఇదే ప్రథమం
-
Jun 13, 2026 10:18 IST
నల్లగొండ: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ సమీపంలో ప్రమాదం
రెండు కార్లు ఢీ, మహిళ మృతి, మరొకరికి తీవ్రగాయాలు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 13, 2026 10:04 IST
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారీ వర్షం
నందిగామలో పొంగిపొర్లుతున్న వాగు
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
సత్తెనపల్లి-అమరావతి మధ్య రాకపోకలకు అంతరాయం
నాగన్నగుంట, సుందరయ్యకాలనీ, కుమ్మరిపాలెం జలమయం
ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు.. ఇబ్బందులు పడుతున్న స్థానికులు
-
Jun 13, 2026 10:01 IST
అమరావతిలో 69 వంతెనలు నిర్మిస్తున్నాం: మంత్రి నారాయణ
కొండవీటివాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయి: మంత్రి నారాయణ
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది
భవనాల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అని వైసీపీ ఆరోపిస్తోంది: నారాయణ
అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాలు మానుకోవాలి: మంత్రి నారాయణ
-
Jun 13, 2026 10:00 IST
దేశవ్యాప్తంగా భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్
ఈనెల 17 నుంచి రాహుల్‌గాంధీ దేశవ్యాప్త పర్యటనలు
17న కోటా, జులై 10న అలహాబాద్, 11న పాట్నా, 14న ఢిల్లీలో సదస్సులు
పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలు, నిరుద్యోగ అంశాలపై పోరాటం
విద్యార్థులతో ముఖాముఖి సదస్సులు నిర్వహించనున్న రాహుల్
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
-
Jun 13, 2026 09:39 IST
హైదరాబాద్: LB నగర్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు
వనస్థలిపురం హయగ్రీవ ఆస్పత్రిలో పోలీసుల డికాయ్ ఆపరేషన్
హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు సహా ముగ్గురి అరెస్ట్
మహిళా పోలీసును డికాయ్‌గా పంపి ఆధారాలు సేకరించిన పోలీసులు
-
Jun 13, 2026 09:37 IST
రేపు సింగపూర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
16 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
సీఎంతో పాటు మంత్రి నారాయణ, అధికారుల బృందం
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు
-
Jun 13, 2026 09:14 IST
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్
ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్
-
Jun 13, 2026 09:13 IST
శంషాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
ఫ్రాంక్‌ఫర్డ్ నుంచి శంషాబాద్ వస్తున్న లుఫ్తాన్సా విమానం
విమానం ల్యాండ్ అయ్యేలోపు పేలుతుందని మెయిల్
విమానంలో తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది
-
Jun 13, 2026 08:53 IST
విజయవాడ: మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 13, 2026 08:51 IST
హైదరాబాద్: సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌కు లైంగిక వేధింపులు
కల్ట్ జిమ్ ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్‌గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు
జిమ్ ట్రైనింగ్ పేరుతో మహిళను లోబర్చుకునేందుకు సంతోష్ యత్నం
సంతోష్‌గౌడ్‌కు సహకరించిన అతడి గర్ల్‌ఫ్రెండ్ రాగిణి
మహిళా పైలట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోష్‌గౌడ్ అసభ్యకర మెసేజ్‌లు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సనత్‌నగర్ పోలీసులు
-
Jun 13, 2026 08:28 IST
జనగామ: రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా దగ్గర కారు బోల్తా
హనుమకొండకు చెందిన హబీబా హఫ్సా(27), అసదుద్దీన్(26) మృతి
కారు ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
గుల్బర్గా నుంచి వరంగల్‌కు వస్తుండగా ఘటన
-
Jun 13, 2026 07:48 IST
భోపాల్‌లో మధ్యప్రదేశ్ ATS ఆపరేషన్
పాకిస్థాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్
మహమ్మద్ ఫరాజ్ అలియాస్ ఖాలీద్ సైఫుల్లాగా గుర్తింపు
సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కంటెంట్ ప్రచారం
పలు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాల స్వాధీనం
-
Jun 13, 2026 07:41 IST
హైదరాబాద్‌లో రెండో రోజు రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
నేడు ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు హాజరు
-
Jun 13, 2026 07:40 IST
తెలంగాణలో పలు ప్రాంతాలకు భారీ వర్షసూచన
హైదరాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అలర్ట్
మేడ్చల్, వరంగల్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
-
Jun 13, 2026 07:39 IST
నేడు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన
సిరిసిల్ల, వేములవాడలో BRS సమావేశానికి హాజరు
-
Jun 13, 2026 06:25 IST
అమెరికా: టెక్సాస్‌లోని మిడ్‌లాండ్‌లో దుండగుడి కాల్పులు
కాల్పుల్లో ఒకరి మృతి, మరో 9 మందికి గాయాలు
భద్రతా బలగాల కాల్పుల్లో దుండగుడి మృతి
-
Jun 13, 2026 06:24 IST
నేడు మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
రూ.58కోట్లతో గూడెంలో సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
రూ.74కోట్లతో నిర్మించే 4 మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు శంకుస్థాపన
-
Jun 13, 2026 06:22 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై RINL చర్యలు
22 మంది కార్మికులు, అధికారులకు నోటీసుల జారీ
స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై వివరణ కోరుతూ నోటీసులు
-
Jun 13, 2026 06:22 IST
నేటి నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన
రక్షణ ఒప్పందాలే లక్ష్యంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన
ఫ్రాన్స్‌తో పాటూ స్లొవేకియాలోనూ పర్యటించనున్న ప్రధాని మోదీ
జీ7కు సంబంధించిన సదస్సుల్లోనూ పాల్గొననున్న ప్రధాని మోదీ
-
Jun 13, 2026 06:21 IST
నేడు అఫ్ఘానిస్థాన్-భారత్ మధ్య తొలి వన్డే
ధర్మశాలలో మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్
-
Jun 13, 2026 06:00 IST
హైదరాబాద్ పాతబస్తీలో భారీ వర్షం
అర్ధరాత్రి సుమారు గంటసేపు కురిసిన భారీ వర్షం
బహదూర్‌పుర జూ పార్క్ రోడ్డుపై కూలిపోయిన చెట్టు
రోడ్డుపై భారీగా నిలిచిన వరద నీరు
-
Jun 13, 2026 06:00 IST
ఏలూరు: నూజివీడులో జెండా కర్రలతో కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు
వెన్నుపోటుకు రెండేళ్లు.. అంటూ నూజివీడు వైసీపీ నేతల బైక్ ర్యాలీ
అంబేద్కర్ సెంటర్‌కు చేరుకోగానే కేకలు వేస్తూ రెచ్చిపోయిన యువకులు
నడి రోడ్డుపై వీధి రౌడీల్లా జెండా కర్రలతో చితకబాదుకున్న వైనం
మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు సమక్షంలోనే జరిగిన ఘటన
నలుగురికి తీవ్రగాయాలు, ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు