Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 03 , 2026 | 05:51 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 03, 2026 20:51 IST

    హైదరాబాద్: కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

    • లోక్ భవన్ నుండి వెళ్లిపోయిన సీఎం, మంత్రులు

    • గవర్నర్‌తో 20 నిమిషాలు భేటీ

    • కొండా సురేఖ ఎపిసోడ్‌తో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం చర్చ

    • ప్రభుత్వం మీద బాధ్యత యుతంగా మాట్లాడని వారిపై చర్యలు తప్పవన్నట్లు గవర్నర్ నోటీసులో పెట్టిన సీఎం

    • తమ ప్రభుత్వానికి విధానం ఉందన్న అంశంపై గవర్నర్‌కు సీఎం వివరణ

    Konda-Surekha.jpg

  • Sep 03, 2026 20:46 IST

    సైదాబాద్‌ సభలో సీఎం రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

    • నన్నెవరూ ధమ్కీ ఇచ్చి భయపెట్టలేరు: రేవంత్‌

    • నన్ను ఎవరైనా సరే ప్రేమతోనే గెలవగలరు: రేవంత్‌

    • నేను ఎవరికీ గులాంను కాదు.. స్నేహానికే గులాం: రేవంత్

  • Sep 03, 2026 20:26 IST

    హైదరాబాద్: లోక్‌ భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    • సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లు హాజరు

  • Sep 03, 2026 20:08 IST

    హైదరాబాద్: సీఎంను కలవలేదు.. కలిసే ప్రయత్నం చేయలేదు: చిన్నారెడ్డి

    • నాకు ఎస్కార్ట్ లేదు.. ఎప్పుడో వదిలేసుకున్నా: చిన్నారెడ్డి

    • పదవి పోయినా ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు: చిన్నారెడ్డి

    • నాకు పదవి ఇచ్చిన ఆర్డర్‌లోనే కాలపరిమితి పెట్టలేదు: చిన్నారెడ్డి

    • తదుపరి ఉత్తర్వులు అని పెట్టారు: చిన్నారెడ్డి

    • నాకు పదవి లేకున్నా గౌరవం ఉంటుంది: చిన్నారెడ్డి

  • Sep 03, 2026 19:54 IST

    ఢిల్లీ: రాజ్యసభ కమిటీల పునర్వ్యవస్థీకరణ

    • పలు స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నామినేట్ చేసిన రాజ్యసభ చైర్మన్

    • రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నామినేట్ అయిన టీడీపీ ఎంపీ సనా సతీష్ బాబు

    • హౌస్ కమిటీ సభ్యులుగా మస్తాన్ రావు యాదవ్ బీద నియామకం

    • జనరల్ పర్పసెస్ కమిటీ పునర్వ్యవస్థీకరణ

    • ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు సీనియర్ ఎంపీలకు చోటు

  • Sep 03, 2026 19:38 IST

    హైదరాబాద్: పాత బస్తీ అంతా ఒరిజినల్‌ సిటీ: సీఎం రేవంత్‌రెడ్డి

    • ఒకప్పుడు హైదరాబాద్‌ నగర ప్రజలు ఈసా, మూసీ నది నీళ్లు తాగేవారు: రేవంత్‌రెడ్డి

    • పాతబస్తీలోని ప్రతి గల్లీ, అణువణువు నాకు తెలుసు: రేవంత్‌

    • గత సర్కార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు: రేవంత్‌

    • కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి పూర్తి చేసింది: రేవంత్‌

  • Sep 03, 2026 18:46 IST

    హైదరాబాద్‌: పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు ఆఫీస్‌ మార్పు

    • గ్రీన్‌ల్యాండ్స్‌ గెస్ట్‌హౌస్ నుంచి దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు తరలింపు

  • Sep 03, 2026 18:44 IST

    కొండా సురేఖ బర్తరఫ్ సిఫార్సుకు గవర్నర్ ఆమోదం

    • కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు

    • గెజిట్ విడుదల చేయనున్న లోక్ భవన్

  • Sep 03, 2026 18:26 IST

    హైదరాబాద్: సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    • స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం

    • ఫ్లైఓవర్ వివరాలను సీఎంకి వివరించిన జీహెచ్ఎంసీ అధికారులు

  • Sep 03, 2026 17:29 IST

    హైదరాబాద్: సురేఖతో పాటు చిన్నారెడ్డిపైనా అధిష్ఠానం చర్యలు: మల్లు రవి

    • క్రమశిక్షణ కమిటీ నివేదిక, రాష్ట్ర నాయకత్వం వైఖరి తెసుకున్నాకే హైకమాండ్ నిర్ణయం తీసుకుంది: మల్లు రవి

    • పార్టీలో ఎంతటివారైనా సరే క్రమశిక్షణతో వ్యవహరించాలి: మల్లు రవి

    • పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టం చేసింది: మల్లు రవి

  • Sep 03, 2026 17:21 IST

    ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    • కాసేపట్లో చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్​‌ను ప్రారంభించనున్న సీఎం

  • Sep 03, 2026 17:17 IST

    హైదరాబాద్: 15 ఏళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్ల లైంగికదాడి

    • పనికి వెళ్తుండగా బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం

    • అహ్మద్, అస్లాంలను అరెస్ట్ చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు

    • లైంగికదాడికి పాల్పడ్డ డ్రైవర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

  • Sep 03, 2026 17:16 IST

    అమరావతి: సమన్వయ లోపంతో వివిధ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘన: సీఎం చంద్రబాబు

    • శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత మంత్రుల ఫొటోలు లేకపోవటం సరికాదు: సీఎం

    • వెలిగొండ, పోలవరం ప్రకటనల్లో మంత్రి నిమ్మల రామానాయుడి ఫొటో లేకపోవడాన్ని తప్పుబట్టిన సీఎం

    • ఈ నెల 2 లేదా 3వ వారంలో హార్టికల్చర్ హబ్‌కు మదనపల్లిలో శంకుస్థాపన: సీఎం

    • దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు: సీఎం

  • Sep 03, 2026 17:05 IST

    హైదరాబాద్: బర్తరఫ్ కావడం కొండా సురేఖ స్వయంకృతాపరాదం: ఆది శ్రీనివాస్

    • సురేఖకు పార్టీ, ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చింది: ఆది శ్రీనివాస్

    • కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోలేకపోయారు: ఆది శ్రీనివాస్

  • Sep 03, 2026 17:04 IST

    హైదరాబాద్: ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి SIR నోటీసులు

    • నేమ్ అనమలీస్ కింద నోటీసులు ఇచ్చిన అధికారులు

    • 2002 - 2026 జాబితాతో సరిపోలని పేరు

    • నేమ్ అనమలిస్ కింద నోటీసులు జారీ

    • నోటీసులు అందుకున్న సీఈవో

    • ఎన్నికల అధికారులకు వివరాలు ఇవ్వనున్న సీఈఓ సుదర్శన్ రెడ్డి

  • Sep 03, 2026 17:00 IST

    హైదరాబాద్: మంత్రి పదవి లేకున్నా ఎమ్మెల్యేగా కొనసాగుతా: కొండా సురేఖ

    • కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదు: కొండా సురేఖ

    • నేను తప్పు చేయకుండా బర్తరఫ్ చేయడం పార్టీ తప్పు: సురేఖ

  • Sep 03, 2026 16:59 IST

    హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారా?: కొండా సురేఖ

    • మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తమ బాధలు చెప్పుకోవాలి: సురేఖ

    • హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది: సురేఖ

    • క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేయించుకుంటే మంచిది: సురేఖ

    • పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉంది: సురేఖ

    • కాంగ్రెస్ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు చేసుకోవాలి: సురేఖ

  • Sep 03, 2026 16:57 IST

    హైదరాబాద్: నేనేం తప్పు చేశానో చెప్పకుండా బర్తరఫ్‌ చేశారు: కొండా సురేఖ

    • నన్ను ఇలా ఏకపక్షంగా తొలగించడం బాధాకరం: సురేఖ

    • హైకమాండ్‌కు నన్ను తొలగించే ఆలోచన లేదు: కొండా సురేఖ

    • హైకమాండ్‌ను రేవంత్ బ్లాక్‌మెయిల్ చేశారు: కొండా సురేఖ

    • నన్ను తొలగించకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ బెదిరించారు: సురేఖ

    • రేవంత్ బ్లాక్‌మెయిల్‌తోనే హైకమాండ్ నిర్ణయం తీసుకుంది: సురేఖ

    • బర్తరఫ్ కుట్ర వెనుక రేవంత్ బ్రదర్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు: సురేఖ

  • Sep 03, 2026 15:52 IST

    అమరావతి: కిడ్నాప్ కేసుపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

    • నాపై కిడ్నాప్ ఆరోపణలు వైసీపీ ఆడిన నాటకం

    • వైసీపీ నేతలు నాపై దుష్ర్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే సుధాకర్

    • నాపై కిడ్నాప్ కేసు పెట్టారన్న సంగతి సోషల్‌ మీడియా ద్వారానే తెలిసింది: సుధాకర్

    • నేను హైదరాబాద్‌లో ఉంటే బెంగళూరులో ఎలా కిడ్నాప్ చేస్తా: సుధాకర్

    • డాక్టర్ రవి ప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేస్తే నేను ఎలా కిడ్నాప్ చేస్తా: సుధాకర్

  • Sep 03, 2026 15:50 IST

    భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 417, నిఫ్టీ 41 పాయింట్ల నష్టం

  • Sep 03, 2026 15:49 IST

    నంద్యాల: ఆత్మకూరులో ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులకు రైతు ఆత్మహత్యాయత్నం

    • ​నల్లకాలువ గ్రామానికి చెందిన రైతు నాగలింగం (46) పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం

    • గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

    • పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

    • రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు

  • Sep 03, 2026 15:25 IST

    హైదరాబాద్: ఇప్పటివరకు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కొండా సురేఖ

    • నా భర్తతో కలిసి తదుపరి నిర్ణయం తీసుకుంటా: కొండా సురేఖ

  • Sep 03, 2026 15:24 IST

    హైదరాబాద్: మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని ఖండిస్తున్నా: కొండా సురేఖ

    • కనీసం నాతో మాట్లాడాల్సింది: కొండా సురేఖ

    • ఇప్పటివరకు నేను నిర్ణయం తీసుకోలేదు: కొండా సురేఖ

    • నా భర్తతో కలిసి తదుపరి నిర్ణయం తీసుకుంటా: కొండా సురేఖ

    • కుటుంబసభ్యులు మాట్లాడితే నాకేం సంబంధం: కొండా సురేఖ

  • Sep 03, 2026 15:10 IST

    ఢిల్లీ: పార్టీకి వ్యతిరేకంగా ఉంటే వేటు తప్పదు: ఏఐసీసీ

    • ఓపికకు కూడా హద్దు ఉంటుంది: ఏఐసీసీ

    • మేం ప్రకటించిన సీఎంపై వ్యాఖ్యలు చేయడమేంటి?: ఏఐసీసీ

    • పార్టీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి: ఏఐసీసీ

    • పార్టీని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో మాకు తెలుసు: ఏఐసీసీ

  • Sep 03, 2026 15:09 IST

    హైదరాబాద్: ఏఐసీసీ నిర్ణయంపై కాంగ్రెస్ క్యాడర్ హర్షం

    • పార్టీ, ప్రభుత్వాన్ని బలహీనపరిచేవారి పట్ల కఠినంగానే ఉండాలంటున్న కాంగ్రెస్ శ్రేణులు

    • పార్టీపై గౌరవం లేనివారు వెళ్లిపోవాలంటున్న క్యాడర్

  • Sep 03, 2026 14:30 IST

    చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు

    • ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు

    • ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

    • మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద

    • కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి

  • Sep 03, 2026 14:29 IST

    కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం

    • గవర్నర్‌కు చేరిన మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ లేఖ

    • రాజీనామాకు సురేఖ అంగీకరించక పోవడంతో లోక్‌భవన్‌కు లేఖ పంపిన సీఎంవో

  • Sep 03, 2026 13:50 IST

    ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి

    • కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

  • Sep 03, 2026 13:45 IST

    ఖమ్మం: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

    • కిష్టారం అంగన్‌వాడీలో చిన్నారుల అస్వస్థత ఘటనపై ABN వరుస కథనాలు

    • ఏబీఎన్ కథనాలపై స్పందించిన మంత్రి తుమ్మల

    • చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌కు ఆదేశం

    • ఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని మంత్రి ఆదేశం

    • గన్నేరు ఆకులు పడిన ఆహారం తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారులు

  • Sep 03, 2026 13:30 IST

    మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీల పనులపై మంత్రి దామోదర సమీక్ష

    • కాలేజీల హాస్టల్ భవనాల నిర్మాణ పురోగతిపై మంత్రి ఆరా

    • హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, అధికారులు

  • Sep 03, 2026 13:25 IST

    ఏపీలో విద్యాహక్కు చట్టం అమలుపై రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు

    • పాఠశాల విద్యాశాఖ ద్వారా G.O.RT.141 జారీ చేసిన ప్రభుత్వం

    • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

  • Sep 03, 2026 13:19 IST

    కొండా సురేఖ అంశంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: రాజగోపాల్‌రెడ్డి

    • కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం దగ్గర పూర్తి సమాచారం ఉంది: రాజగోపాల్‌రెడ్డి

    • కేబినెట్ విస్తరణలో ఎవరికి చోటు అనేది హైకమాండ్ చూసుకుంటుంది

    • అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి: రాజగోపాల్‌రెడ్డి

    • BRSపై పదేళ్లు పోరాటం చేసిన కార్యకర్తలకు న్యాయం జరగాలి: రాజగోపాల్‌రెడ్డి

  • Sep 03, 2026 13:15 IST

    మెదక్: నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన

    • రెడ్డిపల్లి, మంతూరు శివారులో ఆగిపోయిన కాళేశ్వరం కాలువ పనులను పరిశీలించిన మాజీ మంత్రి

    • అక్కడే సెల్ఫీ దిగి సీఎం రేవంత్ రెడ్డికి పంపిన మాజీ మంత్రి

    • ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగబట్టారు: హరీశ్ రావు

    • కాంగ్రెస్ ప్రభుత్వానికి పనులు చేయడం చేతకాదు: హరీశ్ రావు

  • Sep 03, 2026 13:07 IST

    బొల్లారం: మిస్సయిన ఆయుధాల కోసం గాలిస్తున్న ఆర్మీ సిబ్బంది

    • ఆయుధాల కోసం ఆర్మీ క్యాంప్‌కి అనుకుని ఉన్న గోల్ఫ్ ఎన్ క్లేవ్‌లోని చెట్ల పొదల్లో గాలింపు

    • ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టినటికీ కనిపించని ఫలితం

    • మరో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న బొల్లారం పోలీసులు

  • Sep 03, 2026 13:02 IST

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల తేదీలు ఖరారు

    • అక్టోబర్ 11 నుంచి 20 వరకూ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు

    • అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీదేవి అలంకరణ

    • 12న గాయత్రీదేవి అలంకరణ

    • 13న అన్నపూర్ణాదేవి అలంకరణ

    • 14న మహాచండీదేవి అలంకరణ

    • 15న లలితా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం

    • 16న సరస్వతిదేవి అలంకరణ

    • 17న మహాలక్ష్మీదేవి అలంకరణ

    • 18న దుర్గాదేవి అలంకరణ

    • 19న మహిషాసురమర్థిని అలంకరణ

    • 20న రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం

    • 20న సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం

  • Sep 03, 2026 12:57 IST

    ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్ పగబట్టారు: హరీశ్ రావు

    • కాంగ్రెస్ ప్రభుత్వానికి పనులు చేయడం చేతకాదు: మాజీ మంత్రి హరీశ్ రావు

    • మూడేళ్ల నుంచి కాళేశ్వరం కాలువ పనులు నిలిచిపోయాయి: మాజీ మంత్రి హరీశ్ రావు

  • Sep 03, 2026 12:50 IST

    విశాఖ: పెందుర్తి నాయుడుతోట సమీపంలోని సర్వీస్ రోడ్డులో ప్రమాదం

    • ద్విచక్ర వాహనంపై వెళ్తూ వాటర్ ట్యాంక్ వాహనాన్ని ఢీకొట్టిన మహిళ

    • వాహనం వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి

    • మహిళ వివరాలు సేకరిస్తున్న పోలీసులు

  • Sep 03, 2026 12:40 IST

    హైదరాబాద్: సెక్రటేరియట్ దగ్గర బీజేపీ నేతల అరెస్ట్

    • పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నిరసన

    • పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట

    • ఎంపీ డీకే అరుణ, మహేశ్వర్‌రెడ్డి సహా బీజేపీ శ్రేణుల అరెస్ట్

  • Sep 03, 2026 12:30 IST

    ఎయిర్ ఇండియాకు మరో రూ.10 వేల కోట్లు

    • పెట్టుబడికి అమోదం తెలిపిన టాటా సన్స్ బోర్డ్

    • ఈ నిధులతో పాటూ కొన్ని నిబంధనలు విధించిన టాటా నన్స్

  • Sep 03, 2026 12:27 IST

    అమరావతి: మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

    • క్యాబినెట్ హాల్లోకి సీఎం అడుగుపెట్టగానే లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపిన మంత్రులు

    • వెలిగొండ, పోలవరం ఎల్ఎంసీ ప్రారంభించిన సందర్భంగా సీఎంకు మంత్రులంతా శుభాకాంక్షలు

  • Sep 03, 2026 12:15 IST

    ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ భారీ ర్యాలీ

    • సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ర్యాలీ

    • కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట

    • ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు

    • లింగాల నుంచి కల్లూరు చండ్రుపట్ల రోడ్డు వరకూ సాగిన ర్యాలీ లో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు

  • Sep 03, 2026 12:10 IST

    భారత్ త్వరపడాలి: ఎన్విడియా సీఈఓ హువాంగ్ జెన్సెంగ్ సూచన

    • భారత్‌ ఐటీ రంగం శక్తిమంతమైనదన్న సీఈఓ

    • ప్రాంతీయ ఏఐ వ్యవస్థను రూపొందించాలని సూచన

    • భారతీయ సంస్థలు ఏఐని అందిపుచ్చుకుంటున్నాయని వ్యాఖ్య

  • Sep 03, 2026 12:01 IST

    దోహా-బెంగళూరు ఇండిగో విమానం మళ్లింపు

    • గాల్లో ఉండగా విమాన సిబ్బందికి క్షీణించిన ఆరోగ్యం

    • మస్కట్‌కు మళ్లించి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • Sep 03, 2026 12:00 IST

    రేవంత్-సురేఖ రాజకీయ వివాదం హాట్‌టాపిక్‌గా మారింది: రాజాసింగ్

    • ఇవాళ జరగనున్న ప్రెస్‌మీట్‌పై అందరి దృష్టీ నెలకొంది: రాజాసింగ్

    • కొండా సురేఖ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?: రాజాసింగ్

    • ఇవాళ్టి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి: రాజాసింగ్

  • Sep 03, 2026 11:57 IST

    అమరావతి: మంత్రులతో నారా లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం

    • అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశల వారీగా కొత్త ఫించన్లు: మంత్రి నారా లోకేశ్

    • స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: లోకేశ్

    • అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.. వాయిదా పడే ప్రసక్తే లేదు: మంత్రి నారా లోకేశ్

  • Sep 03, 2026 11:50 IST

    మెదక్: రామాయంపేటలో రైతులకు యూరియా కష్టాలు

    • యూరియా అందుబాటులో ఉన్నా.. ఆన్‌లైన్‌లో చూపించకపోవడంతో రైతుల ఆగ్రహం

    • ఉదయం 7 గంటల నుంచి PACS సెంటర్ వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు

    • పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్

    • మెదక్- సిద్దిపేట రహదారిపై రైతుల రాస్తారోకో

  • Sep 03, 2026 11:45 IST

    చెన్నై: సీఎం విజయ్ డీప్‌ఫేక్ వీడియోల కలకలం

    • విజయ్ సహాయం అందిస్తున్నట్టు Ai వీడియోలు

    • పాకిస్తాన్‌కు చెందిన ఫేస్‌బుక్ ఐడీల ద్వారా వీడియోలు షేర్ చేసినట్టు CBCID గుర్తింపు

  • Sep 03, 2026 11:40 IST

    చెన్నై: కొళత్తూరు ఎన్నికలపై స్టాలిన్ రిట్ పిటిషన్ కొట్టివేత

    • వీవీప్యాట్ స్లిప్పులు 100శాతం లెక్కించాలని స్టాలిన్ పిటిషన్

    • TVK ఎమ్మెల్యే బాబు విజయాన్ని రద్దు చేయాలని కోరిన స్టాలిన్

    • స్టాలిన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు

  • Sep 03, 2026 11:35 IST

    చెన్నైలో కొత్త సెక్రటేరియట్ నిర్మించనున్నట్టు సీఎం విజయ్ ప్రకటన

    • 20లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెక్రటేరియట్ భవనం

    • సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.1,200 కోట్ల వ్యయం: సీఎం విజయ్

  • Sep 03, 2026 11:30 IST

    తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై TG సేఫ్ డ్రగ్స్ వింగ్ దాడులు

    • మందుల అక్రమ విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు

    • 158 షాపులు నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తింపు

  • Sep 03, 2026 11:25 IST

    ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌’ పదమే దాదాపు తిట్టుగా మారింది: నటి తాప్సీ

    • ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌’ అనే పదం దుర్వినియోగమవుతోంది: తాప్సీ

    • మహిళల బలాన్ని తీవ్రతకే పరిమితం చేయొద్దు: తాప్సీ

    • ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌’ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: తాప్సీ

    • బలమైన మహిళ అంటే ఇలా ఉండాలనే భావన వద్దు: తాప్సీ

    • హాస్యం, గ్లామర్‌ బలహీనతకు సంకేతాలు కావు: నటి తాప్సీ

  • Sep 03, 2026 11:18 IST

    హైదరాబాద్‌: సస్పెండ్ అయిన DSP భీమ్‌రెడ్డికి మరో షాక్

    • మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎంట్రీ

    • డీఎస్‌పీ భీమ్‌రెడ్డిపై ఈడీ ECIR నమోదు

    • PMLA కింద దర్యాప్తు ప్రారంభం.. ACB FIRలో రూ.2.4 కోట్ల అక్రమాస్తులు

    • సోదాల్లో బయటపడ్డ రూ.150 కోట్లకుపైగా ఆస్తులు

  • Sep 03, 2026 11:15 IST

    దక్షిణాదిలో డ్రగ్స్ కేసుల్లో ED భారీ సోదాలు

    • నాలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ED తనిఖీలు

    • తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళంలో సోదాలు

    • మొత్తం 30 ప్రాంతాల్లో కొనసాగుతున్న ED తనిఖీలు

  • Sep 03, 2026 11:10 IST

    ఖమ్మం: కిష్టారం అంగన్‌వాడీలో చిన్నారులకు అస్వస్థత

    • గన్నేరు ఆకులు పడిన ఆహారాన్ని పిల్లలకు పెట్టిన ఆయా

    • 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారులు

    • పిల్లల ఆరోగ్యం విషమించడంతో తల్లిదండ్రుల ఆందోళన

  • Sep 03, 2026 11:05 IST

    ఢిల్లీ: హల్ద్వానీలో శుద్ధి ఘటనపై జేపీ నడ్డాకు ఖర్గే లేఖ

    • 24 రోజులు దాటినా FIR నమోదు చేయకపోవడంపై అసంతృప్తి

    • రాజ్యసభలో ఇచ్చిన హామీ ఏమైంది?: ఖర్గే

    • ఇది నా వ్యక్తిగత అంశం కాదు.. దళితులు ఎదుర్కొంటున్న కులవివక్షకు నిదర్శనం: ఖర్గే

    • తక్షణమే బాధ్యులపై FIR నమోదు చేయాలి: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

  • Sep 03, 2026 11:00 IST

    హైదరాబాద్: ఏ క్షణమైనా కొండా సురేఖ బర్తరఫ్?

    • సిఫార్సు లేఖను అధికారికంగా గవర్నర్‌కు పంపే అవకాశం

    • అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం వెయిటింగ్

    • అనుమతి వచ్చిన వెంటనే లోక్‌భవన్‌కు లేఖ పంపించే యోచన

    • ఢిల్లీలో రాహుల్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం

    • సమావేశం తర్వాత కొండా ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే ఛాన్స్

  • Sep 03, 2026 10:50 IST

    హైదరాబాద్: బొల్లారంలో డిటోనేటర్ల ఘటనపై మల్కాజ్‌గిరి DCP శ్రీధర్ ప్రెస్‌నోట్

    • ప్రైవేట్ వెంచర్‌లో డిటోనేటర్లు గుర్తించాం: DCP శ్రీధర్

    • డిటోనేటర్లు ఆర్మీకి చెందినవి కాదు: DCP శ్రీధర్

    • ఆయుధాల చోరీ ఘటనతో వీటికి ఎలాంటి సంబంధం లేదు: DCP

    • ఏడాది క్రితమే డిటోనేటర్లను డెవలపర్లు ఉపయోగించి ఉండాలి

    • ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: DCP శ్రీధర్

  • Sep 03, 2026 10:48 IST

    ఢిల్లీ: రాహుల్‌గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం

    • సమావేశం తర్వాత కొండా సురేఖ అంశంపై స్పష్టత?

  • Sep 03, 2026 10:45 IST

    కోల్‌కతా: అభిషేక్‌ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి

    • టీఎంసీ కార్యాలయంలో విధ్వంసం.. బీజేపీపై అభిషేక్‌ ఆరోపణలు

    • టీఎంసీ కార్యాలయంపై బీజేపీ గూండాల దాడి: అభిషేక్‌

    • కోల్‌కతాలో టీఎంసీ కార్యాలయం ధ్వంసం.. బీజేపీపై ఆరోపణలు

    • కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం.. బీజేపీపై అభిషేక్‌ ఫైర్‌

    • టీఎంసీ కార్యాలయంపై దాడి.. పోలీసుల తీరుపై అభిషేక్‌ ఆగ్రహం

  • Sep 03, 2026 10:45 IST

    అమరావతి: విద్యాభవన్ ముట్టడికి UTF యత్నం

    • విద్యాభవన్ దగ్గర బైఠాయించి ఉపాధ్యాయుల నిరసన

    • ఇన్‌సర్వీస్ టీచర్స్‌కు టెట్ మినహాయించాలని డిమాండ్

    • ఆందోళనకు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు

  • Sep 03, 2026 10:35 IST

    అమరావతి: ఈ నెల 6, 7 తేదీల్లో MLAలకు శిక్షణ తరగతులు

    • టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతులు

    • ఏడు అంశాలపై తరగతులు నిర్వహించనున్న టీడీపీ

    • MLAలు హాజరు కావాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు

  • Sep 03, 2026 10:31 IST

    టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

    • ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోకనాథంను అరెస్ట్ చేసిన ఏసీబీ

    • లోకనాథాన్ని ఏసీబీ కార్యాలయానికి తరలింపు

    • నిన్న లోకనాథం ఇంట్లో ఏసీబీ దాడుల్లో రూ.5 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

  • Sep 03, 2026 10:15 IST

    పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో పేకాట క్లబ్ వివాదం

    • తెల్లవారుజామున పేకాట క్లబ్‌పై దాడి

    • క్లబ్‌లో CC కెమెరాలు, ఫర్నిచర్ ధ్వంసం

    • కార్లలో 20 మంది వచ్చి ధ్వంసం చేశారని ప్రాథమిక సమాచారం

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన క్లబ్ యాజమాన్యం

  • Sep 03, 2026 10:01 IST

    హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు తమ నిర్ణయం ప్రకటించనున్న కొండా దంపతులు

    • కుటుంబ సభ్యులతో సమావేశమైన కొండా దంపతులు

    • మధ్యాహ్నం 2 గంటలకు తన నివాసంలో అనుచరులతో కొండా దంపతుల భేటీ

  • Sep 03, 2026 09:56 IST

    ట్రంప్‌నకు కోర్టులో మళ్లీ చుక్కెదురు

    • జన్మతః పౌరసత్వ హక్కుకు పరిమితులు విధించిన ట్రంప్

    • బర్త్‌ టూరిజానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇటీవల ఆదేశాలు జారీ

    • ఈ ఆదేశాలను తాజాగా నిపుదల చేసిన కోర్టు

  • Sep 03, 2026 09:30 IST

    హైదరాబాద్‌: గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో అర్ధరాత్రి ఆటో డ్రైవర్ హల్‌చల్

    • గంజాయి సేవించి నిర్లక్ష్యంగా ఆటోను నడిపిన డ్రైవర్

    • మెహదీపట్నం–రెతిబౌలి పిల్లర్ నంబర్ 41 సమీపంలో ఘటన

    • రెండు చక్రాలపై ఆటో నడుపుతూ స్టంట్ చేసిన డ్రైవర్

    • ప్రమాదకర స్టంట్‌తో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి త్రుటిలో తప్పిన ప్రమాదం

    • ఆటోను అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్న బైకర్

  • Sep 03, 2026 09:25 IST

    తెలంగాణలో నిరుపేద పిల్లలకు సర్కార్ బ్రేక్‌ఫాస్ట్ భరోసా!

    • సింగరేణి సాయంతో 50 వేల మందికి పౌష్టికాహారం

    • చిన్నారులు చదువుపై ఫోకస్ పెట్టేలా ప్రభుత్వ పథకం

  • Sep 03, 2026 09:20 IST

    ఏలూరు: అక్వా రైతులపై మరోసారి మేత కంపెనీల పిడుగు

    • మేత రేట్లు టన్నుకు రూ.10 వేల వరకూ పెంచిన కంపెనీలు

    • 2నెలల్లో టన్నుకు రూ.20 వేల చొప్పున ధరల పెంపు

    • కంపెనీల తీరుపై రాష్ట్ర ఆక్వా రైతు సంక్షేమ సంఘం ఆగ్రహం

  • Sep 03, 2026 09:15 IST

    మల్కాజిగిరి జోన్‌లో రెండు రోజులుగా విస్తృత తనిఖీలు

    • మద్రాస్‌ రెజిమెంట్‌ వెపన్స్‌ మిస్సింగ్‌తో హైఅలర్ట్‌

    • డిటోనేటర్లు లభ్యంతో మాల్కాజిగిరి పోలీసుల అప్రమత్తం

    • పలు ప్రాంతాల్లో పోలీసుల మాక్‌‌డ్రిల్‌

    • జవహర్‌నగర్‌లో CRPF ఆధ్వర్యంలో మాక్‌‌డ్రిల్‌

  • Sep 03, 2026 09:10 IST

    సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. భారీ వినాయక విగ్రహం ధ్వంసం

    • హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు తరలిస్తుండగా ప్రమాదం

    • ఫ్లైఓవర్‌పై సూచిక బోర్డుకు తగులుతుందని లారీని ఆపిన డ్రైవర్

    • వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఘటన

    • లారీ నుంచి కిందపడి ధ్వంసమైన వినాయక విగ్రహం

  • Sep 03, 2026 09:00 IST

    విశాఖ: కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలకు సెలవు

    • జీవీఎంసీ పరిధిలోని మాంసం దుకాణాలు, జంతు వధశాలలకు సెలవు

    • దుకాణదారులంతా తప్పనిసరిగా మూసివేయాలి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

    • నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

  • Sep 03, 2026 08:50 IST

    ప.గో: భీమవరం గుణుపూడి బ్రిడ్జి పేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి

    • బిల్డింగ్ పైనుంచి పడి రాజేష్ (36 ) మృతి

    • ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Sep 03, 2026 08:45 IST

    హైదరాబాద్: గంజాయి డాన్ నీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు

    • ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు

    • ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ సోదాలు

    • గంజాయి అమ్మకాలతో రూ.కోట్లు సంపాదించిన నీతు భాయ్

    • హవాలా రూపంలో డబ్బులు సంపాదించినట్లు గుర్తించిన ఈడీ

  • Sep 03, 2026 08:30 IST

    నేడు నల్గొండ జిల్లా పర్యటనకు కేటీఆర్

    • కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేటీఆర్

    • మధ్యాహ్నం 3గంటలకు మిర్యాలగూడ రైతు సభలో పాల్గొననున్న కేటీఆర్

    • కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన కార్యక్రమాల్లో భాగంగా కేటీఆర్ పర్యటన

  • Sep 03, 2026 08:20 IST

    ఏలూరు జిల్లా: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో రేపు సేవల రద్దు

    • రేపు శ్రీకృష్ణ జయంతి సందర్భంగా నిత్యార్జిత కళ్యాణం, ఆర్జిత సేవల రద్దు

    • ఈనెల 5న సాయంత్రం ఆలయంలో ఉట్ల పండగ, గ్రామోత్సవం

  • Sep 03, 2026 08:15 IST

    ఏలూరు: ఆందోళన కలిగిస్తున్న పెద్దపులి సంచారం

    • పెద్దపులి గోదావరి దాటినట్లు గుర్తించిన అధికారులు

    • పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి గోదావరి దాటిన పెద్ద పులి

    • అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోకి ప్రవేశించిన పులి

    • తొమ్మిది నెలలుగా ఆందోళన కలిగిస్తున్న పెద్దపులి సంచారం

  • Sep 03, 2026 08:00 IST

    సూర్యాపేట : ఏసీబీ వలలో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య

    • మానస నగర్‌లోని ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

  • Sep 03, 2026 07:45 IST

    హైదరాబాద్‌: బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం

    • ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్ల లభ్యం

    • బకెట్‌లో డిటోనేటర్లను పెట్టిన దుండగులు

    • బకెట్‌లో 8 బండిల్స్‌ డిటోనేటర్ల లభ్యం

    • ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తింపు

    • బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు

  • Sep 03, 2026 07:40 IST

    తిరుపతి: 'నాని క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్' యాప్ నిర్వాహకుడి కిడ్నాప్‌ కేసు

    • ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన రూరల్‌ పోలీసులు

    • చంద్రగిరికి చెందిన బాలాజీ, చరణ్, వాజిద్‌ అరెస్ట్

    • పరారీలో ఉన్న యశ్వంత్, మనోజ్, గౌతమ్‌ కోసం గాలింపు

  • Sep 03, 2026 07:30 IST

    ములుగు: కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర

    • గతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి గిరిజనుడి మృతి

    • మృతుడు దుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావుగా గుర్తింపు

    • వెదురు బొంగుల కోసం గుట్టలపైకి వెళ్లినట్లు సమాచారం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

    పూర్తి కథనం..

  • Sep 03, 2026 07:20 IST

    మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై నేడు నిర్ణయం

    • కొండా సురేఖను బర్తరఫ్‌ చేసే అవకాశం

    • ఇప్పటికే అధిష్ఠానానికి సీఎం రేవంత్‌, మహేశ్ గౌడ్ , మీనాక్షి నివేదిక

    • ఈ మేరకు కొండా సురేఖకు ఇండికేషన్ ఇచ్చిన అధిష్ఠానం

    • నేడు నాసిక్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకోనున్న రాహుల్ గాంధీ

  • Sep 03, 2026 07:15 IST

    విశాఖ: అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

    • బీచ్‌ రోడ్‌లో 1.6 కే ఫిజికల్‌ రన్నింగ్‌ టెస్ట్‌

    • రన్నింగ్‌ టెస్టులో పాల్గొన్న 725 మంది అభ్యర్థులు

    • ఈ నెల 20 వరకూ కొనసాగనున్న అగ్నివీర్‌ ర్యాలీ

  • Sep 03, 2026 07:00 IST

    నేడు అగ్రిగోల్డ్‌ సమస్యలపై ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

    • అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు, డిపాజిట్లపై చర్చ

    • కోర్టు వ్యవహారాలపై సమీక్షించనున్న సబ్‌ కమిటీ

  • Sep 03, 2026 06:50 IST

    హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవీ

    • 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,010

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,340

    • కిలో వెండి ధర రూ.2,49,900

    పూర్తి కథనం..

  • Sep 03, 2026 06:50 IST

    నేపాల్ వరదల్లో 1,243కు చేరిన మృతుల సంఖ్య

    • ఇంకా లభించని 4,800 మంది ఆచూకీ

    • గల్లంతైనవారిలో 583 మంది విదేశీయులు

    • ఇప్పటివరకూ 12వేల మందిని రక్షించిన భద్రతా దళాలు

    • మరో వరద ముప్పు నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తం

  • Sep 03, 2026 06:45 IST

    హారిజాంటల్ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్‌ మార్గదర్శకాలు

    • 13 జిల్లాలకు పాత రోస్టర్ కొనసాగింపు

    • మరో 13 జిల్లాలకు కొత్త రోస్టర్ అమలు

    • రోస్టర్, పోస్టుల భర్తీ, రిజర్వేషన్లపై స్పష్టత

    • సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ రూల్స్ మేరకు మార్పులు

    • కేడర్ మార్పు జరిగితే కొత్త రోస్టర్ తప్పనిసరి

  • Sep 03, 2026 06:40 IST

    సంగారెడ్డి: నేపాల్ వరదల్లో NRI కుటుంబం గల్లంతు

    • వరదల్లో గల్లంతైన శ్రీధర్, భార్య దీప్తి, కుమారుడు అభినవ్

    • గత నెల 13న ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన శ్రీధర్ కుటుంబం

    • వరదల్లో శ్రీధర్‌ కుటుంబం గల్లంతైనట్లు ఈషా ఫౌండేషన్ ధృవీకరణ

    • మూడేళ్ల క్రితం UK నుంచి వచ్చి తెల్లాపూర్‌లో నివాసం

  • Sep 03, 2026 06:35 IST

    ఏపీలో కొనసాగుతున్న JAC అమరావతి ఉద్యమం

    • నేడు కలెక్టరేట్లు, RDO కార్యాలయాల దగ్గర నిరసన

  • Sep 03, 2026 06:30 IST

    తెలంగాణలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

    • ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం

    • హైదరాబాద్‌, జగిత్యాల, కామారెడ్డికి వర్ష సూచన

  • Sep 03, 2026 06:25 IST

    హైదరాబాద్‌: నేడు ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌లో ABVP దీక్ష

    • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు డిమాండ్‌

  • Sep 03, 2026 06:20 IST

    కాంగ్రెస్‌ సర్కార్‌ వెయ్యి రోజుల పాలనపై BRS పోరుబాట

    • నేడు మిర్యాలగూడలో మధ్యాహ్నం 3 గంటలకు రైతు ర్యాలీ

    • ర్యాలీలో పాల్గొననున్న మాజీ మంత్రి కేటీఆర్‌

    • వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై నిరసన

  • Sep 03, 2026 06:17 IST

    ఢిల్లీ: నేడు బీజేపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం

    • పాల్గొననున్న బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, నేతలు

    • శిక్షణ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీని కలవనున్న మంత్రులు

    • ప్రధాని నివాసంలో బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులకు డిన్నర్‌

  • Sep 03, 2026 06:15 IST

    హోర్ముజ్‌ పేరు మార్పుపై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

    • హోర్ముజ్‌ను ట్రంప్‌ స్ట్రెయిట్‌గా మార్చాలన్న ట్రంప్‌

    • హోర్ముజ్ జలసంధి పేరు మార్చాలని ప్రతిపాదన

    • హోర్ముజ్‌పై అమెరికా నియంత్రణ ఉంది: ట్రంప్‌

  • Sep 03, 2026 06:12 IST

    రేపు వరంగల్‌లో అనుచరులతో కొండా సురేఖ భేటీ

    • ఢిల్లీ పర్యటన వివరాలను అనుచరులకు వివరించే ఛాన్స్‌

    • పలువురు నియోజకవర్గ అనుచరులతో సురేఖ సమావేశం

  • Sep 03, 2026 06:10 IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్ చిత్రం

    • నేడు విడుదల కానున్న 'ద డెకాయ్ ప్లేన్' పేరుతో వీడియో మూవీ

    • ఇరాన్ ముప్పు నేపథ్యంలో టర్కీలో ట్రంప్ విమానం మార్పు, జులైలో జరిగిన రహస్య ఘటనపై నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్

  • Sep 03, 2026 06:09 IST

    నల్లగొండ: నేడు మిర్యాలగూడలో కేటీఆర్‌ పర్యటన

    • కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ మహాధర్నా

  • Sep 03, 2026 06:07 IST

    హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు

    • నేడు సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • రూ.620 కోట్లతో 3.23 కి.మీ పొడవున 4 లైన్లతో బ్రిడ్జి నిర్మాణం

    • చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్‌ వరకూ బ్రిడ్జి నిర్మాణం

  • Sep 03, 2026 06:05 IST

    సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం

    • భార్య, కుమారుడు, అత్తపై కత్తితో దాడి చేసిన సురేష్‌

    • భార్య జ్యోతి మృతి, అత్త, కుమారుడి పరిస్థితి విషమం

    • సిరిసిల్ల పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

  • Sep 03, 2026 06:02 IST

    హైదరాబాద్‌: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో దారుణ హత్య

    • డెక్కన్ ప్యాలెస్ సమీపంలో వ్యక్తి హత్య

    • జహంగీర్‌బాద్‌కు చెందిన అబ్దుల్ రవూఫ్‌గా అనుమానం

  • Sep 03, 2026 06:00 IST

    శ్రీహరికోట: కొనసాగుతున్న GSLV-F17 రాకెట్‌ కౌంట్‌డౌన్‌

    • 27.5 గంటల పాటు కొనసాగనున్న కౌంట్‌డౌన్‌

    • రేపు తెల్లవారుజామున 2:55కు GSLV-F17 రాకెట్‌ ప్రయోగం

    • శ్రీహరికోట రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి రాకెట్‌ ప్రయోగం

    • EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో