-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 30th September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 30 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 30, 2026 07:10 IST
జమ్మూకశ్మీర్: కథువా జిల్లా బసోహ్లీలో కాల్పులు
తోటి జవాన్లపై కాల్పులు జరిపిన CISF జవాన్
నలుగురు మృతి, పలువురికి గాయాలు
మృతుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్, SI లక్ష్మణ్
నిందితుడు అవధేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Sep 30, 2026 07:05 IST
సూర్యాపేట: మోతె మండలం హుస్సేనా బాద్ వద్ద ప్రమాదం
హైదరాబాద్- ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా
ప్రమాదంలో 10 మందికి గాయాలు
క్షతగాత్రులు సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఘటన
ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు
-
Sep 30, 2026 07:00 IST
ఢిల్లీ: నేడు ఇండియా కూటమి నేతల భేటీ
EC వివాదాలు, SIR ప్రక్రియపై చర్చ
CECపై దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణపై చర్చ
పార్లమెంట్‌లో అభిశంసన నోటీసులపై చర్చించే అవకాశం
రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీపై నిర్ణయానికి అవకాశం
-
Sep 30, 2026 06:55 IST
మంచిర్యాల : సింగరేణి బకాయి-బీజేపీ లడాయి పేరిట నేడు నస్పూర్‌లో మహా ధర్నా
హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
సింగరేణికి ఇవ్వాల్సిన రూ. 55వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని బీజేపీ ఆందోళన
-
Sep 30, 2026 06:45 IST
హైదరాబాద్: నేడు ఎథిక్స్ కమిటీ కీలక సమావేశం
పాడి కౌశిక్‌రెడ్డి అంశంపై చర్చించనున్న కమిటీ
గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
కడియం వీడియో ఫుటేజీపైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Sep 30, 2026 06:30 IST
విశాఖపట్నం: ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ గౌరవ చైర్మన్‌గా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏకగ్రీవ ఎన్నిక
-
Sep 30, 2026 06:15 IST
ప్రకాశం: నేడు ఒంగోలు మున్సిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలు
ఒంగోలు మినీ స్టేడియంలో ఉత్సవాల నిర్వహణ
హాజరుకానున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
హాజరుకానున్న స్పీకర్ అయ్యన్న, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
-
Sep 30, 2026 06:07 IST
వైసీపీ పోస్టుకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ట్వీట్
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనను ఓ దిక్కుమాలిన పార్టీ రాజకీయం చేస్తోందన్న లోకేశ్
కుటుంబ విహారయాత్రను రాజకీయ అంశంగా మార్చడంపై లోకేశ్ అభ్యంతరం
-
Sep 30, 2026 06:05 IST
నేడు కొచ్చికి కేటీఆర్
ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026 సదస్సుకు హాజరుకానున్న మాజీ మంత్రి కేటీఆర్
-
Sep 30, 2026 06:00 IST
నేడు కరీంనగర్ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
సాయంత్రం సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ
సిరిసిల్లలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు