Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 18 , 2026 | 08:10 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 18, 2026 10:05 IST

    హైదరాబాద్: ఏసీబీ కోర్టుకి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • Sep 18, 2026 10:04 IST

    ఢిల్లీలో 17 ఏళ్ల బాలిక హత్య కేసులో నలుగురి అరెస్ట్

    • నలుగురిలో ముగ్గురు మైనర్లు.. ఒకరు పెద్దవాడు

    • బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు

    • సెప్టెంబర్‌ 13న స్వరూప్‌నగర్‌లో బాలిక మృతదేహం గుర్తింపు

    • 50కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు

    • ఘటనకు ఉపయోగించినట్లు భావిస్తున్న టెంపో, రెండు కత్తులు స్వాధీనం

  • Sep 18, 2026 09:59 IST

    ఆర్టీసీ క్రాస్ రోడ్డులో యువకుడి మృతి

    • స్టీల్ బ్రిడ్జిపై బైక్ పార్క్ చేసి బ్రిడ్జి పైనుండి దూకి సూసైడ్ చేసుకున్న యువకుడు

    • ఫోన్‌లో సూసైడ్ నోట్ రాసి బైక్‌పై పెట్టిన యువకుడు

    • తన చావుకి ప్రేమించిన అమ్మాయే కారణమని సూసైడ్ నోట్‌లో రాసిన యువకుడు

  • Sep 18, 2026 09:06 IST

    తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నేటి రాత్రి 9 నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

    • బైక్‌ల కోసం బాలాజీ లింకు బస్టాండ్‌, నెహ్రూ హైస్కూల్ గ్రౌండ్, ఎస్వీ వైద్య కళాశాల, ఇస్కాన్ ఆలయ మైదానాల్లో పార్కింగ్

    • కార్లు, టూరిస్ట్ వాహనాల కోసం తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయింపు

    • ఘాట్ రోడ్డులో నిరంతరాయంగా తిరగనున్న ఆర్టీసీ బస్సులు

  • Sep 18, 2026 09:05 IST

    నిజామాబాద్‌: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్‌ఐ సతీష్ ఆత్మహత్య

    • తుపాకీతో కాల్చుకుని ఎస్‌ఐ సతీష్ ఆత్మహత్య

    • అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం

  • Sep 18, 2026 08:25 IST

    తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    • ఉదయం కల్పవృక్ష వాహన సేవ

    • రాత్రి సర్వభూపాల వాహన సేవ

  • Sep 18, 2026 08:24 IST

    హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

    • హిందీపై తమిళనాడు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి: సుప్రీం

    • నవోదయ స్కూళ్ల ఏర్పాటుకు స్థలం ఏర్పాటుచేయాలని ఆదేశం

    • భాషా వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలి: సుప్రీంకోర్టు

  • Sep 18, 2026 08:24 IST

    నేడు కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

    • ఉదయం 10 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో భేటీ

    • రాజకీయ పరిస్థితులు, ఎంపీల కార్యాచరణపై చర్చ

    • కేటీఆర్ కుటుంబ అక్రమాస్తులపై కార్యక్రమాలు చేయాలని ఎంపీల నిర్ణయం

    • ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

  • Sep 18, 2026 08:23 IST

    నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్

    • నేడు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు

    • హాజరుకానున్న కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌

    • డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌, రైతు రిజిస్ట్రీపై సమీక్ష

    • రైతు నేస్తం కార్యక్రమంపై మంత్రి తుమ్మల ప్రెజెంటేషన్‌

    • వాతావరణ మార్పులపై ఏపీ ప్రభుత్వం ప్రెజెంటేషన్‌

  • Sep 18, 2026 08:22 IST

    నల్లగొండ: మిర్యాలగూడలో నందిపాడు బైపాస్ దగ్గర ట్యాంకర్ బీభత్సం

    • మితిమీరిన వేగంతో కారు, అంబులెన్స్ సహా 4 వాహనాలను ఢీకొట్టిన ట్యాంకర్‌

    • ప్రమాదంలో ఒకరి మృతి

    • మృతుడు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వ్యక్తిగా గుర్తింపు

  • Sep 18, 2026 08:21 IST

    హైదరాబాద్‌: వనస్థలిపురంలో దారుణం

    • పాల వ్యాపారిపై వేట కొడవళ్లతో దాడి

    • స్కూటీపై వెళ్తున్న పాల వ్యాపారిపై దాడి

    • భూ వివాదంలో దాడి జరిగినట్లు అనుమానం

    • పాల వ్యాపారిని ఆస్పత్రికి తరలించి ICUలో చికిత్స

    • కేసు నమోదు, నిందితుల కోసం గాలింపు

  • Sep 18, 2026 08:14 IST

    విజయవాడ: నేడు వైసీపీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌

    • డీఎస్సీ ఆరోపణలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చ

  • Sep 18, 2026 08:14 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు

    • నిన్న సిట్‌ ఎదుట లొంగిపోయిన A4 సురేష్‌

    • సురేష్‌ను నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం

    • సాయికృష్ణ మృతదేహం మాయం కేసులో సురేష్‌ కీలక పాత్ర

    • సిట్‌ విచారణ తర్వాత పరారీలో ఉన్న సురేష్‌

    • సాయికృష్ణ కుటుంబంతో సెటిల్‌మెంట్‌కు సురేష్‌ యత్నం

    • సీఐ నాగరాజుకు సురేష్‌ అత్యంత సన్నిహితుడు

  • Sep 18, 2026 08:14 IST

    విజయవాడ: పోలీస్‌ కస్టడీకి యూట్యూబర్‌ జోసెఫ్‌ రావణ్‌

    • నేడు జోసెఫ్‌ రావణ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

    • ఈ నెల 24 వరకు విచారించనున్న పోలీసులు

    • ఉపా కేసులో నెల్లూరు జైలులో ఉన్న జోసెఫ్‌ రావణ్‌

  • Sep 18, 2026 08:10 IST

    హైదరాబాద్‌: నేడు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు కేటీఆర్‌

    • ఫార్ములా ఈ కేసు విచారణలో భాగంగా స్వయంగా కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్‌