-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 18th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 18 , 2026 | 06:26 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 18, 2026 10:47 IST
జమ్మూకశ్మీర్: ఎదురుకాల్పుల్లో LET ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
కుల్గాంలో భద్రతా బలగాల కాల్పుల్లో లతీఫ్ మృతి
ఈ నెల 11న అఖ్రాన్‌లో CRPF చెక్‌పోస్టుపై దాడిలో కీలక పాత్ర
మసీదులో దాక్కున్న లతీఫ్‌ను లొంగిపోవాలని కోరిన జవాన్లు
వీడియోకాల్ ద్వారా కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి
హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఎదురుకాల్పులు
-
Nov 18, 2026 10:45 IST
ఉస్మానియా వర్సిటీ లేడీస్ హాస్టల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు
నాణ్యతలేని భోజనం పెడుతున్నారని విద్యార్థినుల నిరసన
హాస్టల్ కిచెన్‌లో ఆహార పదార్థాల నాణ్యత పరిశీలన
తనిఖీలు చేపట్టిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు
నాణ్యమైన ఆహారం అందేలా చూస్తామని హామీ
-
Nov 18, 2026 10:40 IST
పులివెందుల: ఎంపీ అవినాశ్ రెడ్డిపై పోలీసుల నిఘా
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అవినాశ్ రెడ్డిపై నిఘా
గ్రామాల్లో పర్యటిస్తే ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసుల అంచనా
పాత కేసుల్లో పలువురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Nov 18, 2026 10:35 IST
పల్నాడు: నామినేషన్ సందర్భంగా క్రోసూరు మండలం నాగవరంలో ఉద్రిక్త పరిస్థితులు
ఆటోలో కర్రలు, రాళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆటోను పోలీస్ స్టేషన్‌కు తరలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Nov 18, 2026 10:30 IST
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. అప్రమత్తమైన అధికారులు
నూజివీడు అటవీ ప్రాంతంలో పులి కదలికల గుర్తింపు
ముసునూరు మండలం రమణక్కపేట ఫారెస్ట్ రేంజ్‌లోకి ప్రవేశం
రైతులు, గ్రామస్థులకు రెవెన్యూ అధికారుల హెచ్చరికలు
అటవీ మార్గాల్లో పోలీసుల గస్తీ ముమ్మరం
పులిని పట్టుకునేందుకు రంగంలోకి పూణే ప్రత్యేక బృందం
-
Nov 18, 2026 09:30 IST
శాండ్‌పేపర్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
ఉస్మాన్ ఖవాజా ఆత్మకథతో మళ్లీ తెరపైకి వచ్చిన శాండ్‌పేపర్ గేట్ వివాదం
2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా వివాదం
బంతి ఆకృతిని మార్చేందుకు శాండ్‌పేపర్ ఉపయోగించినట్లు అప్పట్లో ఆరోపణలు
ఈ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు
అప్పట్లో జట్టులో ఉన్న ఆటగాళ్ల వాంగ్మూలాలను మరోసారి వింటామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన
-
Nov 18, 2026 09:20 IST
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
158 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్న సెన్సెక్స్
60 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
-
Nov 18, 2026 09:00 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
నేడు నాలుగో రోజు కొనసాగనున్న పర్యటన
గీసుకొండ టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించనున్న సీతక్క
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
-
Nov 18, 2026 08:55 IST
రంగారెడ్డి: శంకర్‌పల్లిలో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం
దొంతాన్‌పల్లి గేట్ సమీపంలోని A1 ఫర్నిచర్ షాపులో మంటలు
షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన అగ్నిప్రమాదం
రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్న సిబ్బంది
దుకాణంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం
-
Nov 18, 2026 08:50 IST
సిద్దిపేట యంగ్ ఇండియా స్కూల్‌కు రూ.200 కోట్లు
రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
రూ.200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు
రేపు పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Nov 18, 2026 08:45 IST
రంగారెడ్డి: MLC బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం
కొత్తూరు సమీపంలో బల్మూరి కారును ఢీకొట్టిన లారీ
బల్మూరి వెంకట్, ఆయన భార్యకు స్వల్ప గాయాలు
ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన కారు
తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
-
Nov 18, 2026 08:40 IST
నేడు మధ్యాహ్నం 12 గంటలకు కేటీఆర్ ప్రెస్‌మీట్
నాగార్జునసాగర్ నుంచి నీటి తరలింపుపై స్పందించే అవకాశం
ఏపీ చేపట్టిన ప్రాజెక్ట్‌పై కేటీఆర్ మాట్లాడే అవకాశం
-
Nov 18, 2026 08:35 IST
హైదరాబాద్ పాతబస్తీలో భార్యను హత్య చేసిన భర్త
హసన్‌నగర్‌లో అస్మా బేగం (30) దారుణ హత్య
భార్య గొంతు కోసి చంపిన భర్త ధర్మేందర్
మూడేళ్ల కుమార్తెను తీసుకుని పరారైన నిందితుడు
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగింపు
-
Nov 18, 2026 08:30 IST
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సేవల్లో అంతరాయం
ఐక్లౌడ్, యాప్ స్టోర్ సేవల్లో సమస్యలు
యాపిల్ పే, వాలెట్, మ్యూజిక్ సేవలపైనా ప్రభావం
లాగిన్, చెల్లింపులు, కనెక్షన్లలో ఇబ్బందులని యూజర్ల ఫిర్యాదు
అకౌంట్స్, సర్వీసెస్‌లో అంతరాయాలు ఏర్పడినట్లు యాపిల్ వెల్లడి
-
Nov 18, 2026 08:15 IST
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త చాట్ బ్యాకప్ సదుపాయం
గూగుల్ డ్రైవ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు
నేరుగా వాట్సాప్ సర్వర్లలోనే చాట్ బ్యాకప్ చేసుకునే అవకాశం
ఈ ఫీచర్‌తో 2 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అందించనున్నట్లు వెల్లడి
-
Nov 18, 2026 08:10 IST
ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి రూ.231 కోట్లు
2026-27 ఆర్థిక సంవత్సరానికి నిధుల విడుదల
రూ.231 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వ ఆమోదం
పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వుల జారీ
-
Nov 18, 2026 08:05 IST
తిరుమలలో భక్తుల రద్దీ.. SSD టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
నేడు తిరుపతిలో SSD టోకెన్ల జారీ నిలిపివేత
గురువారం దర్శనానికి సంబంధించి టోకెన్ల రద్దు
బుధవారం జారీ చేయాల్సిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల నిలిపివేత
-
Nov 18, 2026 08:00 IST
వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలి: భారత్
LPG ట్యాంకర్‌పై దాడిని ఖండించిన భారత్
హోర్ముజ్ జలసంధిలో 24 మంది భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి
అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ఆటంకం కలగకూడదని స్పష్టం
వాణిజ్య నౌకలపై దాడులు నిలిపివేయాలని విదేశాంగ శాఖ డిమాండ్
అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి
-
Nov 18, 2026 07:50 IST
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక
నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరిలో భారీ వర్షాలు
19, 20 తేదీల్లో కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోనూ అతి భారీ వర్ష సూచన
రేపు విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం: IMD
-
Nov 18, 2026 07:45 IST
డర్టీ బాంబ్ ప్రయోగిస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాలి: ట్రంప్
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందన్న ఇంటెలిజెన్స్ నివేదికపై స్పందన
డర్టీ బాంబ్ ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
దాడికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్య
-
Nov 18, 2026 07:30 IST
ప్రకాశం: కొత్తపట్నం మండలం పల్లెపాలెం సముద్రతీరంలో అగ్నిప్రమాదం
జాలర్ల వలలకు అంటుకున్న మంటలు
ఒకే చోట వలలు ఉండటంతో పెద్దఎత్తున వ్యాపించిన మంటలు
మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
ఘటనాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు
-
Nov 18, 2026 07:15 IST
విజయవాడ: నేడు విజయ డెయిరీ బోర్డు అత్యవసర సమావేశం
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం
కీలక అంశాలపై చర్చించే అవకాశం
-
Nov 18, 2026 07:00 IST
తిరుమలలో నేడు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం
చైర్మన్ రవిచంద్ర ఆధ్వర్యంలో సమావేశం
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ప్రధానంగా చర్చ
వచ్చే నెల 20న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష
పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లపై నిర్ణయాలు
పలు ఇంజినీరింగ్ పనులు, కొనుగోళ్లకు ఆమోదం తెలిపే అవకాశం
-
Nov 18, 2026 06:47 IST
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
నేడు నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు
ఈ నెల 26న తొలి విడత పంచాయతీ ఎన్నికలు
అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
-
Nov 18, 2026 06:45 IST
రష్యాలో విమానం కుప్పకూలి 17 మంది మృతి
కెమెరోవో ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం
ప్రమాదంలో విమానంలోని 17 మంది మృతి
గాల్లో ఉండగానే An-12 విమానంలో మంటలు
మంటలతో అదుపుతప్పి నిట్టనిలువుగా కూలిన విమానం