Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 09 , 2026 | 06:07 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 09, 2026 18:23 IST

    శ్రీకాకుళం: మందస ఏజెన్సీ ప్రాంతంలో విషాదం

    • పాతకోటలో పిడుగుపడి ఇద్దరు మహిళల మృతి

  • Aug 09, 2026 18:22 IST

    నెల్లూరు: మంత్రి ఆనం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

    • జిల్లాలో రాజకీయ పరిస్థితులపై నేతల సుదీర్ఘ చర్చ

    • డీఎస్సీపై వైసీపీ దొంగదీక్షలు చేస్తోంది: నెల్లూరు టీడీపీ నేతలు

    • స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టకపోతే ఇన్‌‌ఛార్జ్‌లను తొలగిస్తామని జగన్‌ భయపెట్టడంతోనే రోడ్లపై పడ్డారు: టీడీపీ నేతలు

    • వైసీపీ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరు: టీడీపీ నేతలు

  • Aug 09, 2026 18:20 IST

    గుంటూరు: ఏటుకూరు బైపాస్‌ దగ్గర రోడ్డుప్రమాదం

    • లారీ-కారు ఢీకొని IPS షరీన్‌ బేగం కుమార్తె ఆసిఫా మృతి

  • Aug 09, 2026 17:55 IST

    హైదరాబాద్‌: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి

    • సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

    • ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఇద్దరు తాగుబోతులు

    • బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్థారించిన వైద్యులు

    • మ.3.32 గంటలకు ప్రియాంక మృతిచెందినట్లు వైద్యుల ప్రకటన

    • 3 రోజులుగా కిమ్స్‌లో చికిత్సపొందుతూ ప్రియాంక మృతి

  • Aug 09, 2026 17:51 IST

    కర్నూలు: ఆదోనిలో హైటెన్షన్‌

    • డీఎస్సీపై చర్చకు సిద్ధమంటూ వైసీపీకి ఎమ్మెల్యే పార్థసారథి సవాల్‌

    • ఎమ్మెల్యే పార్థసారథి, వైసీపీ ఆఫీస్‌ దగ్గర మోహరించిన పోలీసులు

    • వైసీపీ ఆఫీస్‌కు బయల్దేరిన పార్థసారథిని అడ్డుకున్న పోలీసులు

  • Aug 09, 2026 17:19 IST

    ఖమ్మం: మిస్ ఇండియా యూనివర్స్-2026లో వైరా యువతి

    • ఒకటో రన్నరప్‌గా వైరాకు చెందిన మాదినేని నిఖిత

    • జాతీయస్థాయి అందాల పోటీలో సత్తాచాటిన మాదినేని నిఖిత

  • Aug 09, 2026 16:45 IST

    యాదాద్రి: బీబీనగర్ కొండమడుగు శివారులో వాహనాల తనిఖీలో భారీగా డ్రగ్స్ పట్టివేత

    • రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ పట్టుకున్న పోలీసులు

    • 40 కిలోల అసిటోన్ లిక్విడ్, ఫార్చ్యూనర్ కారు సీజ్

    • నలుగురు నిందితుల అరెస్ట్

    • కొండమడుగు వేటుకూరి ల్యాబ్స్‌లో డ్రగ్ తయారి సంబంధించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ సహా పరికరాలు సీజ్

    • నాగ్‌పూర్‌కు తరలించే ప్రయత్నంలో డ్రగ్స్ పట్టివేత

  • Aug 09, 2026 16:29 IST

    విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

    • పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు వచ్చే గోదావరి నీరు పరిశీలన

    • గోదావరి నీటితో బ్యారేజ్‌ నిండుకుండలా ఉందన్న చంద్రబాబు

    • ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందన్న సీఎం చంద్రబాబు

  • Aug 09, 2026 15:28 IST

    వరంగల్: నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి చేరుకున్న కేసీఆర్

    • దివంగత పెద్ది చిత్రపటానికి నివాళులు

    • పెద్ది కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేసీఆర్

    • భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు

  • Aug 09, 2026 15:17 IST

    ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వానికి టీచర్ల సంఘీభావ ర్యాలీ

    • ఉపాధ్యాయుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

    • డీఎస్సీపై వైసీపీ ఆరోపణలను తప్పుబడుతూ టీచర్ల ర్యాలీ

    • కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాం: ఉపాధ్యాయులు

    • డీఎస్సీపై వైసీపీది అసత్య ప్రచారం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

  • Aug 09, 2026 15:15 IST

    ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం దగ్గర స్కూటీని ఢీకొన్న లారీ

    • ఇంటర్‌ విద్యార్థి భరద్వాజ్‌ మృతి

    • కుమారుడి అవయవాలు దానం చేస్తామని ప్రకటించిన తల్లిదండ్రులు

  • Aug 09, 2026 15:11 IST

    విజయనగరం: బొబ్బిలి మండలం పిరిడిలో ఏనుగుల సంచారం

    • కుంకీ ఏనుగులను చూసి పరుగులు పెడుతున్న అడవి ఏనుగులు

    • ఏనుగులున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: DFO

  • Aug 09, 2026 14:24 IST

    బోరబండ బోనాల వేడుకల్లో ఎమ్మెల్సీ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

    • తెలంగాణలోకి దుష్టశక్తులు ప్రవేశించాయి: విజయశాంతి

    • తెలంగాణ ఒక బంగారు బాతు: విజయశాంతి

    • దాన్ని కోసుకొని తింటున్నారు: విజయశాంతి

    • వారి నుంచి తెలంగాణను కాపాడుకోవాలి: విజయశాంతి

    • తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ: విజయశాంతి

  • Aug 09, 2026 13:09 IST

    గిరిజన బిడ్డలు అడవిని అమ్మగా ఆరాధిస్తారు: సీఎం చంద్రబాబు

    • అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలది: సీఎం చంద్రబాబు

    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డ: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Aug 09, 2026 12:10 IST

    DSCపై వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి: మంత్రి సవిత

    • DSCపై అనుమానాలుంటే అసెంబ్లీలో చర్చకు రావాలి: మంత్రి సవిత

    • DSCపై చర్చకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి సవిత

    • టీచర్లను అవమానించడం జగన్‌కు తగదు: మంత్రి సవిత

    • DSC అంటే జగన్‌కు ద్వేషం: మంత్రి సవిత

  • Aug 09, 2026 12:09 IST

    హైదరాబాద్‌లో జరిగే సింహ వాహిని బోనాలకు ప్రత్యేక స్థానం: మంత్రి కొండా సురేఖ

    • ఆషాఢ మాసంలో బోనాల జాతర ఘనంగా జరుగుతుంది: మంత్రి కొండా సురేఖ

    • రూ.20 కోట్ల బడ్జెట్‌తో బోనాల జాతర జరుగుతోంది

    • ఎవరికీ ఇబ్బ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ

  • Aug 09, 2026 11:57 IST

    ఝార్ఖండ్‌లో 16వ రోజుకు విద్యార్థుల దీక్ష

    • నేడు ప్రభుత్వంతో మూడో దఫా చర్చలు

    • ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీక్‌లపై విద్యార్థుల ఆందోళన

    • JPSC ఎగ్జామ్‌ రద్దు చేయాలని డిమాండ్‌

  • Aug 09, 2026 11:33 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ దూకుడు

    • ఆధారాలు ముందు పెట్టి నిందితులను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

    • మాకేం తెలియదు.. అంతా సీఐ నాగరాజుకే తెలుసని చెబుతోన్న కానిస్టేబుళ్లు

    • నలుగురు కానిస్టేబుళ్లను ఒకేసారి ప్రశ్నించనున్న అధికారులు

    • నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టే దిశగా సిట్ చర్యలు

  • Aug 09, 2026 11:32 IST

    కామారెడ్డి జిల్లా: 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

    • పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన ధరబోయిన జస్వంత్ (15) మృతి

    • ఇంట్లో అపస్మారక స్థితిలో గుర్తించిన కుటుంబ సభ్యులు

    • కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

    • బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు

  • Aug 09, 2026 11:30 IST

    మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్

    • ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్

    • మహేష్ బాబుకి సుఖసంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను: పవన్ కళ్యాణ్

  • Aug 09, 2026 10:49 IST

    ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

    • గిరిజన సంస్కృతి మన సమాజానికి గర్వకారణం: సీఎం చంద్రబాబు

  • Aug 09, 2026 10:30 IST

    గుంటూరు జిల్లా: బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

    • వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి నాడి సెంటర్ వరకూ ర్యాలీ

    • జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. నగర ప్రజలు

    • పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు బాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు

  • Aug 09, 2026 10:15 IST

    ఆరు నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా

    • 2026 ప్రథమార్థంలో 3233 మందిని డిపోర్టు చేసిన కెనడా

    • శరణార్థి అభ్యర్థనల తిరస్కరణ, వీసా కాలపరిమితి ముగిశాక డిపోర్టేషన్లు

    • కెనడాలో వలస నిబంధనలు మరింత కఠినతరం

  • Aug 09, 2026 10:00 IST

    నెల్లూరు: గూడూరు దగ్గర పోటుపాలెం జంక్షన్ దగ్గర రేషన్ బియ్యం పట్టివేత

    • ఆటోతో సహా రేషన్ బియ్యం బస్తాలు రూరల్ పీఎస్‌కు తరలింపు

  • Aug 09, 2026 09:50 IST

    ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

    • ప్రపంచ నాగరికతకు మూలం ఆదివాసీ సంస్కృతి: సీఎం రేవంత్‌రెడ్డి

    • మానవాళికి మార్గదర్శకం ఆదివాసీలు: సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 09, 2026 09:49 IST

    హైదరాబాద్: లాల్ దర్వాజా వేడుకల్లో నటుడు విజయ్ దేవరకొండ

    • వేడుకల్లో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తదితరులు

  • Aug 09, 2026 09:47 IST

    నంద్యాల: నేడు శ్రీశైల ఆలయంలో మూడో రోజు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం

    • ఉదయం యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, కంకణపూజ, కంకణధారణ

    • సాయంత్రం అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం తదితర పూజలు

  • Aug 09, 2026 09:40 IST

    నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

    • ఇన్ ఫ్లో 16 వేల క్యూసెక్కులు

    • పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు.. ప్రస్తుతం 1078 అడుగులు

    • నీటి సామర్థ్యం 80 టీఎంసీలు.. ప్రస్తుతం 41 టీఎంసీలు

  • Aug 09, 2026 09:30 IST

    కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

    • ఇన్ ఫ్లో 9 వేల క్యూసెక్కులు

    • పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు.. ప్రస్తుతం 1399 అడుగులు

    • నీటి సామర్థ్యం 17 టీఎంసీలు.. ప్రస్తుతం 11 టీఎంసీలు

  • Aug 09, 2026 09:20 IST

    కామారెడ్డి: మాచారెడ్డి మండలంలో నాటు సారా స్థావరాలపై అధికారుల దాడులు

    • మాచారెడ్డి, గజ్జ్యానాయక్, కాకులగుట్ట, నడిమిగుట్ట, ఏలుపుగొండ తండాల్లో దాడులు

    • దాడుల్లో 4 లీటర్ల నాటు సారా, 30 లీటర్ల పులియబెట్టిన పానకం స్వాధీనం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు

  • Aug 09, 2026 09:15 IST

    ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

    • అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా: ఎమ్మల్యే దానం నాగేందర్

    • 1500 శతాబ్దంలోనే ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి: దానం నాగేందర్

    • మన సంస్కృతి నిన్న మొన్నటిది కాదు.. వందల ఏళ్ల నాటిది: దానం నాగేందర్

    • నిజాం కాలంలో కూడా వేడుకలు, కులమతాలకతీతంగా పూజలు జరిగేవి: దానం నాగేందర్

    • అదే ఆనవాయితీతో బోనాల వేడుకలు జరగడం ఎంతో సంతోషం: ఎమ్మల్యే దానం నాగేందర్

  • Aug 09, 2026 09:00 IST

    తిరుపతి: చైల్డ్ హోమ్ నుంచి అదృశ్యమైన బాలిక అప్పగింత

    • సరోజినీదేవి రోడ్డులోని బాలికల సంరక్షణ పాఠశాలలో ఘటన

    • బాపట్ల జిల్లాకు చెందిన బాలిక ఈ నెల 1న హోమ్‌‌కి రాక

    • చైల్డ్ హోమ్‌లో ఉండడం నచ్చక బాలిక పరారీ

    • బాలికను అదుపులోకి తీసుకుని తిరిగి హోమ్‌కు తరలింపు

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన చైల్డ్ హోమ్ సూపరింటెండెంట్

  • Aug 09, 2026 08:41 IST

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి

    • 19.40 అడుగుల వద్ద 1,65,974 క్యూసెక్కుల నీటి ప్రవాహం

  • Aug 09, 2026 08:10 IST

    నల్లగొండ: నార్కట్‌పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

    • ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న డీసీఎం

    • డ్రైవర్ స్వరూప్ మృతి, కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం

    • కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 09, 2026 08:00 IST

    కొమురంభీం: కాగజ్‌నగర్‌ సంతోషిమాత గోల్డ్ షాపులో చోరీ

    • బంగారం, వెండి వస్తువుల అపహరణ

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 09, 2026 07:52 IST

    ‘యూఎస్ తన పద్ధతి మార్చుకునే వరకూ హోర్ముజ్ తెరుచుకోదు’

    • ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన

    • హోర్ముజ్‌లో ట్రాఫిక్ నిర్వహణపై కొత్త డిమాండ్స్ విడుదల

    • నావికా దిగ్బంధనాన్ని ఎత్తేయాలని డిమాండ్

    • పర్షియన్ గల్ఫ్‌ నుంచి దళాలను ఉపసంహరించుకోవాలన్న కౌన్సిల్

    పూర్తి కథనం..

  • Aug 09, 2026 07:46 IST

    నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద నీరు

    • ఇన్‌ ఫ్లో : 36,233 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 38,369 క్యూసెక్కులు

    • పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

    • ప్రస్తుతం : 878.10 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

    • ప్రస్తుతం : 178.7400 టీఎంసీలు

    • కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • Aug 09, 2026 07:43 IST

    రాజీనామా తర్వాత స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌

    • NEET పేపర్ లీక్ నిరసనల సమయంలోనే రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్‌

    • జెన్‌జీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయి: ధర్మేంద్ర ప్రధాన్‌

    • ఆందోళనలను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు యత్నించారు

    • పదవి కంటే విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యమనుకున్నా: ధర్మేంద్ర ప్రధాన్‌

  • Aug 09, 2026 07:35 IST

    హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇవీ

    • 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,350

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650

    • 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,260

    పూర్తి కథనం..

  • Aug 09, 2026 06:55 IST

    హైదరాబాద్: నేడు డ్యాన్సర్‌ అసోసియేషన్‌లో ఉపఎన్నికలు

    • ఖాళీ అయిన 10 స్థానాలకు జరగనున్న ఉపఎన్నికలు

  • Aug 09, 2026 06:54 IST

    తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

    • ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం

    • నల్లగొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌

  • Aug 09, 2026 06:46 IST

    అనంతపురం: పొగరూరు దగ్గర రోడ్డు ప్రమాదం

    • ప్రైవేట్ బస్సు-ఐషర్‌ ఢీ, 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

    • కల్వర్టు పైనుంచి కిందపడ్డ ప్రైవేట్ బస్సు, ఐషర్‌

    • ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు

  • Aug 09, 2026 06:30 IST

    హైదరాబాద్: పాతబస్తీ మహంకాళేశ్వరాలయంలో బోనాలు

    • ఘనంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు

    • అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

    • మహా హారతిలో పాల్గొన్న భక్తులు

  • Aug 09, 2026 06:30 IST

    నేడు విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం

    • ఆదివాసీ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • సీఎం చంద్రబాబు సమక్షంలో గిరిజన సంక్షేమ శాఖ 20 కీలక ఒప్పందాలు

  • Aug 09, 2026 06:30 IST

    హోర్ముజ్‌ జలసంధిలో UAE నౌకపై క్షిపణి దాడి

    • వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేసిందన్న UAE

  • Aug 09, 2026 06:30 IST

    ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్‌

    • ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ-వాన్స్ చర్చలు

    • వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చలు

  • Aug 09, 2026 06:30 IST

    నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొననున్న కల్వకుంట్ల కవిత

    • లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్న కవిత

  • Aug 09, 2026 06:07 IST

    నేడు వరంగల్‌ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్‌ పర్యటన

    • నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులకు కేసీఆర్ పరామర్శ

    • ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి

  • Aug 09, 2026 06:04 IST

    నేడు వరంగల్ కమిషనరేట్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌ సమీక్ష

    • ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో డీజీపీ సీవీ ఆనంద్‌ పర్యటన

  • Aug 09, 2026 06:00 IST

    నేడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు

    • 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

    • భక్తుల కోసం 6, బోనం తీసుకొచ్చేవారికి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్

  • Aug 09, 2026 02:00 IST

    విజయనగరం. బొబ్బిలి మండలం పిరిడి గ్రామ చెరువులో తిష్టవేసిన అడవి ఏనుగుల గుంపు

    • తెల్లని దుస్తులు ధరించి ఏనుగులకు కనిపించకూడదని ప్రజలకు సూచన చేసిన అటవీ శాఖ అధికారులు

    • శిక్షణ పొందిన ఏనుగులను చూసి పరుగులు పెడుతున్న అడవి ఏనుగులు

    • కుంకీ ఏనుగులను చూడగానే అడవి ఏనుగులు భయపడటం గమనించామని తెలిపిన అధికారులు.

  • Aug 09, 2026 00:30 IST

    తెలంగాణలో మావోయిజం, నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్

    • కర్రెగుట్టల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు ఉన్నారు: డీజీపీ సీవీ ఆనంద్

    • ప్రధాన కేడర్ అంతా లొంగిపోయింది: డీజీపీ సీవీ ఆనంద్

    • లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం: డీజీపీ సీవీ ఆనంద్