తరచుగా ముఖం కడుక్కుంటున్నారా? చర్మానికి హానికరం.!
ABN , Publish Date - May 15 , 2026 | 09:35 AM
వేసవిలో చెమట, జిడ్డు ఎక్కువగా ఉండటంతో చాలామంది రోజుకు పలుమార్లు ముఖం కడుక్కుంటారు. అయితే అతిగా ఫేస్‌వాష్ ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గి పలు చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో చెమట, జిడ్డు ఎక్కువగా ఉండటంతో చాలామంది అదే పనిగా ముఖం కడుక్కుంటారు. ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే కానీ, అతిగా కడుక్కోవడం చర్మానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఫేస్‌వాష్ ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో చర్మం సహజ సమతుల్యత దెబ్బతింటుంది. రోజుకు రెండు సార్లకంటే ఎక్కువగా ఫేస్‌వాష్ క్రీమ్‌తో ముఖం కడుక్కుంటే కొన్ని చర్మ సమస్యలు రావచ్చు.
అతిగా ముఖం కడుక్కోవడం వల్ల వచ్చే సమస్యలు
చర్మం పొడిబారడం
ముఖాన్ని ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. చర్మం బిగుసుకుపోయినట్లు అనిపించవచ్చు.
జిడ్డు పెరగడం
చర్మంలోని తేమ తగ్గిపోతే, దానిని భర్తీ చేయడానికి చర్మం మరింత నూనె ఉత్పత్తి చేస్తుంది. దీంతో ముఖం మరింత జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
చర్మ రక్షణ తగ్గడం
చర్మంపై ఉండే సహజ రక్షణ పొర బలహీనపడుతుంది. దీంతో దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువవుతుంది.
చికాకు, దురద
సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఎర్రబడటం, దురద, చిన్న చిన్న దద్దుర్లు రావచ్చు.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం రోజుకు రెండు సార్లు మాత్రమే ఫేస్‌వాష్ క్రీమ్ ఉపయోగించడం మంచిది. ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎక్కువగా చెమటపడినప్పుడు లేదా బయట దుమ్ము, కాలుష్యం ఎక్కువగా తగిలినప్పుడు సాధారణ నీటితో ముఖం కడుక్కోవచ్చు. ప్రతిసారీ ఫేస్‌వాష్ క్రీమ్ వాడటం చర్మానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మీ చర్మ రకానికి సరిపోయే మైల్డ్ ఫేస్‌వాష్ క్రీమ్‌ను ఉపయోగించాలి. ఎక్కువ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు చర్మాన్ని మరింత పొడిగా, సున్నితంగా మార్చే అవకాశం ఉంది. వేసవిలో చర్మ సంరక్షణ అంటే తరచుగా ముఖం కడుక్కోవడం కాదు.. చర్మానికి సరైన సమతుల్యతను కాపాడుకోవడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా
For More Latest News