Share News

రైలు బోగీలపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ రంగుల వెనుక ఉన్న రహస్యం ఇదే!

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:25 PM

మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు బోగీల పైన, ముఖ్యంగా కిటికీల దగ్గర రంగు రంగుల గీతలు గమనిస్తూ ఉంటాం. చాలామంది ఇవి కేవలం రైలుకు అందాన్ని ఇచ్చే డిజైన్లు అని అనుకుంటారు.

రైలు బోగీలపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ రంగుల వెనుక ఉన్న రహస్యం ఇదే!
Indian Railway Coach Stripes

ఇంటర్నెట్ డెస్క్: మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు బోగీల పైన, ముఖ్యంగా కిటికీల దగ్గర రంగు రంగుల గీతలు గమనిస్తూ ఉంటాం. చాలామంది ఇవి కేవలం రైలుకు అందాన్నిచ్చే డిజైన్లు అని అనుకుంటారు. కానీ, భారతీయ రైల్వేలో ప్రతి గీతకు, ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. రైల్వే సిబ్బందికి, ప్రయాణికులకు ఆ బోగీ ఏ రకానికి చెందినదో సులభంగా తెలియజేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఆ రంగుల అర్థం ఏంటో తెలుసుకుందాం.


రంగులను బట్టి బోగీ గుర్తింపు:

రైలు వేగంగా ఫ్లాట్‌ఫారమ్ మీదకు వస్తున్నప్పుడు లేదా దూరంగా ఉన్నప్పుడు ప్రయాణికులు అయోమయానికి గురికాకుండా ఈ రంగులను బట్టి బోగీలను గుర్తించడానికి కోడింగ్ ఉపయోగిస్తారు.

పసుపు రంగు గీతలు:

భారతదేశంలోని ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లకు నీలం రంగు గీతలు ఉంటాయి. బోగీ చివర పసుపు రంగు గీతలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్ అని అర్థం. అంటే జనరల్ కోచ్.. ఇందులో టికెట్ నంబర్ అవసరం లేదు. రిజర్వేషన్‌లేని వారు ప్రయాణించవచ్చు.

తెల్లటి గీతలు:

నీలం రంగు కోచ్ కిటికీలపై తెల్లటి గీతలు ఉంటే అవి అన్-రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ బోగీలను సూచిస్తాయి. ఇవి కూడా సాధారణ ప్రయాణికుల కోసం కేటాయించినవే.

ఆకుపచ్చ-పసుపు గీతలు:

ఈ రంగుల కలయికతో ఉన్న గీతలు మహిళల ప్రత్యేక బోగీలను సూచిస్తాయి. మహిళా ప్రయాణికుల రక్షణ, సౌకర్యం కోసం వీటిని దూరం నుంచే గుర్తించేలా ఇలా డిజైన్ చేస్తారు.

ఎరుపు గీతలు:

గ్రే లేదా నీలం రంగు బోగీలపై ఎరుపు గీతలు ఉంటే, అవి ఫస్ట్ క్లాస్ బోగీలని అర్థం. ఫస్ట్‌క్లాస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ఈ బోగీలో ప్రయాణించవచ్చు. వీటిలో సౌకర్యాలు ఇతర బోగీల కంటే భిన్నంగా ఉంటాయి.

కోచ్ రకాన్ని బట్టి రంగులు:

కేవలం గీతలే కాకుండా, బోగి రంగు కూడా అది ఏ రకమైన రైలు అనే విషయం స్పష్టం చేస్తుంది.

నీలం రంగు: ఇవి సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ఎరుపు రంగు: ఇవి అత్యంత వేగంగా వెళ్లే రాజధాని లేదా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

ఆకుపచ్చ రంగు: గరీబ్ రథ్ వంటి రైళ్లకు ఈ రంగును ఉపయోగిస్తారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు

For More Latest News

Updated Date - Mar 23 , 2026 | 04:17 PM