ఎయిర్‌పోర్టులో మిస్సైన లగేజీని ఎన్ని రోజులు భద్రపరుస్తారంటే?
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:09 PM
కొందరు ప్రయాణికులు ప్రయాణాల హడావుడిలో తమ లగేజీని మర్చిపోతుంటారు. అయితే ఎయిర్‌పోర్టులో మిస్సైన లగేజీని అధికారులు ఏం చేస్తారు? ఎన్ని రోజులు భద్రపరుస్తారు? అనే విషయాలను తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణాల్లో తొందరపాటు, కనెక్షన్ ఫ్లైట్లు లేదా అలసట వల్ల కొంతమంది తమ లగేజీని బ్యాగేజ్ కారౌసెల్(చెక్-ఇన్ సామాను తీసుకునే ప్రదేశం) వద్ద మర్చిపోతుంటారు. ఆ తర్వాత విమానయాన అధికారులు ఈ లగేజీని ఏం చేస్తారు? యజమాని అందుబాటులో లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎన్ని రోజులు భద్రపరుస్తారు? ఆ పూర్తి వివరాలు మీకోసం...
లాస్ట్ అండ్ ఫౌండ్..
బ్యాగేజ్ కారౌసెల్‌పై ఎవరూ తీసుకోని లగేజీని సిబ్బంది.. లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగానికి లేదా సంబంధిత ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ట్యాగ్‌లు పరిశీలించి 24-72 గంటల పాటు భద్రంగా నిల్వ ఉంచుతారు. బ్యాగ్‌పై ఉన్న ట్యాగ్ ఆధారంగా రిజర్వేషన్ వివరాలు తీసుకుని ఫోన్, ఇమెయిల్ ద్వారా యజమానిని సంప్రదిస్తారు. కొన్నిసార్లు ఆ లగేజీని ఇంటికి కూడా డెలివరీ చేసే అవకాశముంది.
వేలం లేదా దానం..
యజమాని వెంటనే స్పందించకపోతే.. భారతదేశంలో సాధారణంగా 21 రోజుల వరకు ఆ లగేజీని భద్రపరుస్తారు. ఇతర దేశాల్లో ఇది 60-90 రోజుల వరకు ఉండవచ్చు. ఆహారం, చెడిపోయే ద్రవాలు వంటి వాటిని వెంటనే పారవేస్తారు. నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేయకపోతే.. ఆ లగేజీని వేలం వేయవచ్చు, దానం చేయవచ్చు లేదా అనుమతించిన సంస్థలకు విక్రయించవచ్చు.
ట్యాగ్ లేకపోయినా లేదా లగేజీ డ్యామేజ్ అయినా..
మిస్సైన లగేజీకి ట్యాగ్‌లు లేకపోయినా లేదా ఏమైనా డ్యామేజ్ అయినా.. సిబ్బంది వాటిలోని గుర్తింపు కార్డులు, బోర్డింగ్ పాస్‌లు, లేబుల్ వంటి ఆధారాలను పరిశీలిస్తారు. అవసరమైతే స్కానింగ్ సిస్టమ్‌ల ద్వారా బార్‌కోడ్‌లు చెక్ చేసి యజమానిని గుర్తించే ప్రయత్నం చేస్తారు.
లగేజీ మిస్ కాకుండా ఉండాలంటే..
లగేజీకి ప్రత్యేక ట్యాగ్ పెట్టుకోవాలి.
స్మార్ట్ ట్రాకర్‌లు ఉపయోగించాలి.
బ్యాగేజ్ కారౌసెల్ వద్ద జాగ్రత్తగా గమనించి మీ బ్యాగ్‌ను తీసుకోవాలి.
విమానాశ్రయాల్లో క్లెయిమ్ చేయని లగేజీకి స్పష్టమైన విధానం ఉన్నప్పటికీ, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటం అత్యంత ఆవశ్యకం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News