Share News

వాషింగ్ మెషీన్‌లో ఈ బట్టలు అస్సలు ఉతకకండి.!

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:29 AM

బట్టలన్నీ వాషింగ్ మెషీన్‌లో ఉతుకుతున్నారా? అయితే జాగ్రత్త.! కొన్ని రకాల దుస్తులను వాషింగ్ మెషీన్‌‌లో ఉతికితే వాటి నాణ్యత తగ్గిపోతుంది. వాషింగ్ మెషీన్‌లో అస్సలు ఉతకకూడని దుస్తులేవో, చేతితో లేదా డ్రైక్లీన్ చేయాల్సిన దుస్తులేవో ఇప్పుడు తెలుసుకుందాం..

వాషింగ్ మెషీన్‌లో ఈ బట్టలు అస్సలు ఉతకకండి.!
Washing Tips

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉంటోంది. పని తక్కువ అవుతుందని, సమయం ఆదా అవుతుందని చాలా మంది తమ బట్టలన్నింటినీ మెషీన్‌లోనే వేస్తుంటారు. కానీ అన్ని రకాల దుస్తులను వాషింగ్ మెషీన్‌లో వేయడం మంచిది కాదు. కొన్ని వస్త్రాలను వాషింగ్ మెషీన్‌లో వేస్తే వాటి నాణ్యత తగ్గిపోతుంది, త్వరగా పాడైపోతాయి. అలాంటి దుస్తులను చేతితో ఉతకడం లేదా డ్రైక్లీన్ చేయడం మంచిది.


వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడని దుస్తులివే..

  • తెల్లటి దుస్తులు: మెషీన్‌లో వేస్తే ఇతర దుస్తుల రంగు వాటికి పట్టే అవకాశం ఉంటుంది.

  • బాగా మురికిగా ఉన్న బట్టలు: ముందుగా చేతితో ఉతికితే మురికి బాగా పోతుంది.

  • సున్నితమైన కాటన్ టాప్స్, లినెన్ చొక్కాలు: ఇవి మెషీన్‌లో ఉతికితే త్వరగా పాడైపోతాయి. ఉదాహరణకు డిజైనర్ కుర్తాలు, ఎంబ్రాయిడరీ పని ఉన్న వస్త్రాలు.

  • ముదురు రంగు బట్టలు: చేతితో ఉతికితే రంగు మెరుపు ఎక్కువ కాలం ఉంటుంది.

  • ఉన్ని, పట్టు, షిఫాన్ బట్టలు: ఇవి చాలా సున్నితమైనవి కావడంతో మెషీన్‌లో వేయకూడదు.

  • లెదర్ జాకెట్లు: ఇలాంటి దుస్తులను వాషింగ్ మెషీన్‌లో వేస్తే పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది.


వాషింగ్ మెషీన్‌లో ఈ బట్టలు వేయవచ్చు..

  • మందమైన జీన్స్, ప్యాంట్లు

  • తువ్వాళ్లు

  • ఎక్కువ సున్నితంగా లేని రోజువారీ బట్టలు

  • బెడ్‌షీట్లు, దిండు కవర్లు

డ్రైక్లీన్ చేయాల్సిన దుస్తులు..

  • పట్టు చీరలు

  • సూట్లు, కోట్లు

  • ఈ దుస్తులను డ్రైక్లీన్ చేయడం వల్ల వాటి మెరుపు నిలుస్తుంది, ఫాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే బట్టలు చిరగకుండా, రంగు మారకుండా, ఆకారం కోల్పోకుండా ఎక్కువ కాలం ఉంటాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 06 , 2026 | 02:02 PM