Share News

ట్రైన్‌లో పడుకోవడానికి ఏ బెర్త్ మంచిది?

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:39 PM

దూర ప్రయాణాలకు ఎక్కువ మంది రైలుకే ప్రాధాన్యత ఇస్తారు. అందులో లోయర్ బెర్తుకు ప్రత్యేకంగా డిమాండ్ ఉంటుంది. అయితే, ట్రైన్‌లో నిద్రపోవడానికి అప్పర్ బెర్త్ మంచిదా?లేదా లోయర్ బెర్త్ సౌకర్యంగా ఉంటుందా?

ట్రైన్‌లో పడుకోవడానికి ఏ బెర్త్ మంచిది?
Upper Berth Vs Lower Berth

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించడానికి రైలు ప్రయాణం ది బెస్ట్. అయితే, లాంగ్ ట్రైన్ జర్నీలలో కంఫర్ట్ చాలా ముఖ్యం. ముఖ్యంగా నిద్ర బాగా పడితేనే ప్రయాణం సుఖంగా అనిపిస్తుంది. అందుకే చాలామంది ముందుగా ఏ బెర్త్ ఎంచుకోవాలి అని ఆలోచిస్తారు. అయితే, బాగా నిద్రపోవడానికి ట్రైన్‌లో అప్పర్ బెర్త్ మంచిదా? లేదా లోయర్ బెర్త్ సౌకర్యంగా ఉంటుందా? అనే విషయాన్ని తెలుసుకుందాం..


అప్పర్ బెర్త్ ప్రయోజనాలు

  • ప్రైవసీ: అప్పర్ బెర్త్‌లో ఉంటే ఇతర ప్రయాణికుల రాకపోకలు తక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ప్రైవసీ ఉంటుంది.

  • అంతరాయం ఉండదు: లైట్లు, ఫోన్ వాడకం, మాట్లాడటం వంటి ఇబ్బందులు లోయర్ బెర్త్‌లో ఎక్కువగా ఉంటాయి. కానీ అప్పర్ బెర్త్‌లో ఇవి తక్కువగా ఉంటాయి.

  • విశ్రాంతి: లోయర్ బెర్త్ పగటిపూట ఇతరులతో షేర్ చేయాల్సి వస్తుంది. కానీ అప్పర్ బెర్త్ మాత్రం మీకే ఉంటుంది.


లోయర్ బెర్త్ ప్రయోజనాలు

  • సౌకర్యం: లోయర్ బెర్త్‌కు ఎక్కడం వంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు, పెద్దవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

  • రాకపోకలు సులభం: రాత్రి వాష్‌రూమ్‌కి వెళ్లాలంటే లేదా బ్యాగ్ నుంచి ఏదైనా తీసుకోవాలంటే దిగువ బెర్త్ చాలా ఉపయోగపడుతుంది.

  • వృద్ధులకు అనుకూలం: వయస్సు ఎక్కువగా ఉన్నవారు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారికి లోయర్ బెర్త్‌లో కూర్చోవడానికి లేదా పడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

  • లగేజీ భద్రత: మీ బ్యాగులు మీ దగ్గరే ఉండటం వల్ల అవి సురక్షితంగా ఉంటాయి.


ఏది మంచిది?

  • ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవాలనుకుంటే అప్పర్ బెర్త్ మంచిది.

  • సౌకర్యం, సులభమైన రాకపోకలు, కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండాలంటే లోయర్ బెర్త్ బెస్ట్.

  • మీ అవసరానికి అనుగుణంగా బెర్త్ ఎంచుకుంటే మీ ట్రైన్ ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 05:57 PM