Share News

పలుచని కనుబొమ్మలకు సహజ పరిష్కారం

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:27 PM

పలుచని కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో సులభంగా కనుబొమ్మలను దట్టంగా మార్చుకోవచ్చు. అలాంటి ప్రభావవంతమైన 5 ఇంటి చిట్కాలను తెలుసుకుందాం..

పలుచని కనుబొమ్మలకు సహజ పరిష్కారం
Home Remedies for Eyebrows

ఇంటర్నెట్ డెస్క్: పలుచని కనుబొమ్మల వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఖరీదైన సీరమ్‌లు, కాస్మేటిక్ ఉత్పత్తులు, పెన్సిల్‌లు వాడినా ఫలితం రావడంలేదా? అయితే, అమ్మమ్మ కాలం నాటి ఇంటి చిట్కాలు ప్రయత్నించడం మంచిది. ఇవి సహజంగా, సురక్షితంగా మీ కనుబొమ్మలను దట్టంగా, బలంగా మార్చగలవు. పలుచని కనుబొమ్మలను దట్టంగా మార్చే 5 చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం..


కొబ్బరి నూనె

పడుకునే ముందు కొబ్బరి నూనెని కనుబొమ్మలకు రాసుకోవడం ద్వారా వాటిని బలంగా, దట్టంగా చేయవచ్చు. దీనివల్ల చర్మం సాఫీగా, ప్రకాశవంతంగా కూడా ఉంటుంది.

ఆముదం నూనె

రోజు రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు ఆముదం నూనె రాయడం వల్ల కొన్ని వారాలలో ఫలితం ఉండే అవకాశం ఉంది. ఇది చర్మానికి, జుట్టుకూ చాలా మేలు చేస్తుంది.


ఉల్లిపాయ రసం

తాజా ఉల్లిపాయ రసాన్ని కొంచెం కనుబొమ్మలకు పూయండి. ఇది కనుబొమ్మలను బలంగా, ఒత్తుగా చేయడంలో సహాయపడుతుంది.

విటమిన్ ఇ క్యాప్సూల్స్

విటమిన్ ఇ క్యాప్సూల్‌లోని జెల్‌ను కనుబొమ్మలపై అప్లై చేయడం వల్ల వాటి వృద్ధి మెరుగుపడుతుంది. ఇది జుట్టు రాలడం నివారించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

కలబంద జెల్

ప్రతిరోజూ కలబంద జెల్ కనుబొమ్మలకు రాయడం వల్ల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అందుకుని, కనుబొమ్మలు బలంగా, దట్టంగా మారతాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా, మీరు సహజంగా, రసాయనాలు లేకుండా, మీ కనుబొమ్మలను దట్టంగా మార్చుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Mar 26 , 2026 | 03:27 PM