Share News

సంక్రాంతి వేళ గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:08 PM

సంక్రాంతి పండుగ వేళ దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

సంక్రాంతి వేళ గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లు..
Sankranti Special Trains

హైదరాబాద్, నవంబర్ 28: సంక్రాంతి పండుగ వేళ దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, సమయాలతో సహా పూర్తి వివరాలతో ఓ ప్రకటన జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం.. జనవరి 10, 2027, జనవరి 17, 2027 తేదీల్లో 07119 నంబర్ రైలు చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య నడవనుంది.


ఆయా తేదీల్లో సాయంత్రం 4:20 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. అలాగే, శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి మధ్య జనవరి 11, 2027, జనవరి 18, 2027 తేదీల్లో 07120 నంబర్ రైలును నడపనున్నారు. శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ఆయా రోజుల్లో మధ్యాహ్నం 2:00 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగనున్నాయి.


ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ సందర్భంగా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరింది. రైళ్ల సమయాలకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

విశాఖలో బస్సు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం: హోంమంత్రి అనిత

Updated Date - Nov 28 , 2026 | 05:39 PM