Share News

వేసవిలో ఈ టూరిస్ట్ ప్లేస్‌లకు దూరంగా ఉండండి

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:11 PM

వేసవిలో చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, ఈ సీజన్‌లో వెళ్లకూడని ప్రదేశాల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.

 వేసవిలో ఈ టూరిస్ట్ ప్లేస్‌లకు దూరంగా ఉండండి
Places To Avoid in Summer

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో చాలా మంది ట్రిప్ ప్లాన్‌ చేస్తారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో పాఠశాలలకు సెలవులు ఉండటంతో కుటుంబాలతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటారు. కానీ ఈ సమయంలో కొన్ని ప్రదేశాలకు వెళ్లడం అసౌకర్యంగా మారుతుంది.

చాలామంది వాతావరణం, రద్దీ వంటి విషయాలను పట్టించుకోకుండా ట్రిప్ ప్లాన్ చేస్తారు. దీంతో ఉక్కపోత, అధిక రద్దీ, ఖరీదైన హోటళ్లు, పొడవైన క్యూలు వంటి సమస్యలు ఎదురై ప్రయాణం ఆనందంగా కాకుండా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి సరైన గమ్యస్థానం ఎంచుకోవడం చాలా ముఖ్యం. మరి వేసవిలో వెళ్లకూడని కొన్ని ప్రదేశాలు ఏవో చూద్దాం..


జైపూర్

వేసవిలో జైపూర్‌లో ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా ఉంటాయి. అందమైన కోటలు ఉన్నప్పటికీ ఈ కాలంలో అక్కడ తిరగడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎండలు మండిపోతాయి.

ఢిల్లీ

వేసవిలో ఢిల్లీ సందర్శన అంత మంచి ఆలోచన కాదు. ఉష్ణోగ్రతలు తరచుగా 40°C -45°C దాటడం, వడగాల్పుల కారణంగా పగటిపూట బయట తిరగడం చాలా కష్టం. ఈ సమయంలో అక్కడికి వెళ్లడం ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారవచ్చు.

ఆగ్రా

వేసవిలో ఆగ్రా సందర్శించడం అంత మంచిది కాదు. ఉష్ణోగ్రతలు 45°C - 50°C వరకు ఉండే అవకాశం ఉంది. వేడి గాలులు వీస్తుండటంతో పర్యటన కష్టమవుతుంది. తాజ్ మహల్ చూడటానికి ఆగ్రాకు ఏడాది పొడవునా పర్యాటకులు వస్తుంటారు. కానీ వేసవిలో మండే ఎండ వల్ల ప్రయాణం అలసటగా మారుతుంది.


జైసల్మేర్

ఏప్రిల్–మేలో జైసల్మేర్‌లో ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైన ఎండ కారణంగా బయట తిరగడం చాలా కష్టం. ఒంటె సవారీలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి. వేసవిలో ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు వాతావరణం, రద్దీ వంటి విషయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. సరైన ప్రదేశాన్ని ఎంచుకుంటే మీ ట్రిప్ హ్యాపీగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

వాషింగ్ మెషీన్ త్వరగా చెడిపోవడానికి కారణాలివే..

మనసు చెప్పింది తిందాం!

For More Latest News

Updated Date - Apr 12 , 2026 | 01:12 PM