అరకు యాత్రకు IRCTC బంపర్ ఆఫర్
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:36 PM
అరకు యాత్ర చేయాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ పేరుతో హైదరాబాద్ టూ అరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ పేరుతో IRCTC కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజ్ ద్వారా విశాఖపట్నం, అరకు లోయ, బొర్రా గుహలు, సింహాచలం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. ఈ టూర్ మొత్తం 5 రోజులపాటు కొనసాగుతుంది. యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. రవాణా, హోటల్ వసతి, భోజనం అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
టూర్ వివరాలు ఇలా ఉన్నాయి
IRCTC ప్రకటించిన ఈ ప్యాకేజ్ ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఇందులో స్లీపర్, 3ఏసీ కోచ్‌లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. టూర్ సమయంలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలు కూడా అందిస్తారు.
రోజువారీ ప్రయాణ ప్రణాళిక
హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది.
రెండో రోజు శుక్రవారం ఉదయం విశాఖపట్నం చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్-ఇన్ ఉంటుంది. అనంతరం కాళీమాత ఆలయం, సబ్‌మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత కైలాసగిరి, రిషికొండ బీచ్‌లను సందర్శిస్తారు. రాత్రి భోజనం తర్వాత విశాఖలోనే బస ఉంటుంది.
మూడో రోజు శనివారం ఉదయం అల్పాహారం తర్వాత అరకు ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడ తైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖ చేరుకుంటారు.
నాలుగో రోజు ఆదివారం ఉదయం సింహాచలం ఆలయం సందర్శన తర్వాత ఆర్‌కే బీచ్‌కు వెళ్తారు. సాయంత్రం విశాఖ నుంచి తిరిగి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణం ప్రారంభమవుతుంది.
ఐదో రోజు ఉదయం హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరలు (సుమారుగా)
3AC కోచ్:
సింగిల్ షేరింగ్ రూ.27,910
డబుల్ షేరింగ్ రూ.17,010
ట్రిపుల్ షేరింగ్ రూ.13,370
స్లీపర్ కోచ్:
సింగిల్ షేరింగ్ రూ. 20,010
డబుల్ షేరింగ్ రూ.15,110
ట్రిపుల్ షేరింగ్ రూ. 11,480
(పిల్లల టికెట్ ధరలు వేరుగా ఉంటాయి)
టికెట్ల బుకింగ్‌తో పాటు మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారికి వెబ్‌సైట్ https://www.irctctourism.com ద్వారా తెలుసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News