తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాల యాత్ర.. IRCTC స్పెషల్ ఆఫర్
ABN , Publish Date - Mar 31 , 2026 | 03:10 PM
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ ఖర్చుతో సందర్శించాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా తిరుమల, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రదేశాలను కేవలం 12 రోజుల్లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: యాత్రికుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను తక్కువ సమయంలో సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్రయాణంలో తిరుమల, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి శ్రీశైలం వంటి ప్రసిద్ధ ప్రదేశాలను చూపిస్తారు.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస్సు సౌకర్యం, హోటల్ వసతి, భోజనం, గైడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుంది. ఈ యాత్ర 2026 ఏప్రిల్ 11న ప్రారంభమవుతుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, లఖ్‌నవూ, కాన్పుర్ వంటి పలు నగరాల నుంచి ప్రయాణికులు ఈ టూర్‌లో చేరవచ్చు. ప్రధాన ప్రయాణం రైలు ద్వారా జరుగుతుండగా, స్థానిక దర్శనాలకు బస్సులు ఏర్పాటు చేస్తారు.
ఈ టూర్ ముఖ్యంగా కుటుంబాలు, వృద్ధులు, గ్రూప్‌గా ప్రయాణించేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యాత్రలో తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, రామేశ్వరం ఆలయం, మదురై మీనాక్షి ఆలయం, కన్యాకుమారి వంటి ముఖ్య ప్రదేశాలను దర్శించవచ్చు.
ప్యాకేజీ ధరలు:
ఈ టూర్ ప్యాకేజీలో కంఫర్ట్ (2AC) కేటగిరీకి వ్యక్తికి రూ. 56,710 వసూలు చేస్తారు. స్టాండర్డ్ (3AC) కేటగిరీకి ఒక్కొక్కరికి రూ. 42,530 కాగా, ఎకానమీ (స్లీపర్) కేటగిరీకి ఒక్కొక్కరికి రూ. 24,790గా నిర్ణయించారు. IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. మొత్తానికి, తక్కువ ఖర్చుతో దక్షిణ భారతదేశాన్ని దర్శించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Latest News