Share News

ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. ఈ ప్యాకేజీ మిస్ అవ్వకండి

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:58 PM

వేసవిలో చల్లటి హిల్ స్టేషన్‌లకు వెళ్లాలని అనుకుంటున్నారా? అలాంటివారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. ఈ ప్యాకేజీ మిస్ అవ్వకండి
IRCTC Ooty Tour Package

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి ప్రేమికులకు ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ( IRCTC) అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ఊటీ, కూనూర్ వంటి అందమైన ప్రాంతాలను కవర్ చేసే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ఖర్చుతో హిల్ స్టేషన్ ట్రిప్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.


టూర్ ముఖ్య వివరాలు

ఈ ప్యాకేజీ మొత్తం 6 రోజులు – 5 రాత్రులు ఉంటుంది. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) నుంచి ట్రిప్ ప్రారంభమవుతుంది. రైలు ప్రయాణం తరువాత రోడ్డు మార్గంలో ఊటీకి తీసుకెళ్తారు. ఈ ప్రయాణంలో పచ్చని కొండలు, టీ తోటలు, జలపాతాలు ఆకట్టుకుంటాయి.

Ooty (3).jpg

ప్యాకేజీ ధరలు

కంఫర్ట్ (3AC):

  • సింగిల్ షేరింగ్ – రూ.33,590

  • ట్విన్ షేరింగ్ – రూ.18,890

  • ట్రిపుల్ షేరింగ్ – రూ.17,170

స్టాండర్డ్ (స్లీపర్):

  • సింగిల్ షేరింగ్ – రూ.31,050

  • ట్విన్ షేరింగ్ – రూ.16,360

  • ట్రిపుల్ షేరింగ్ – రూ.14,630

5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.6,300.. బెడ్ లేకుండా అయితే రూ.3,950 చార్జ్ చేస్తుంది.


  • ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్:20629) మధ్యాహ్నం 2.25 గంటలకు ప్రారంభమవుతుంది. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది. సికింద్రాబాద్ తర్వాత నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్ ఉంటుంది.

  • రెండో రోజు ఉదయం సుమారు 9.10 గంటలకు కోయంబత్తూరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అయ్యి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సును సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.

Coimbathur.jpg

  • మూడవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతాలను చూసి తిరిగి హోటల్‌కు చేరుకుని అక్కడే బస చేస్తారు.

  • నాలుగో రోజు ఉదయం కూనూర్ సైట్‌సీయింగ్‌కు వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు, రాత్రికి అక్కడే ఉంటారు.

  • ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్‌ అవుట్ చేసి కోయంబత్తూరు చేరుకుని, మధ్యాహ్నం 3.40 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు.


ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

  • రైలు టికెట్లు

  • హోటల్ వసతి (బ్రేక్‌ఫాస్ట్‌తో)

  • లోకల్ ట్రాన్స్‌పోర్ట్ (ఏసీ వాహనం)

  • సైట్ సీయింగ్

  • పన్నులు, టోల్ చార్జీలు

Coonor (1).jpg

ప్యాకేజీలో లేని సదుపాయాలు

  • మధ్యాహ్నం, రాత్రి భోజనం

  • ట్రైన్‌లో భోజనం

  • ఎంట్రీ టికెట్లు

  • బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్

  • వ్యక్తిగత ఖర్చులు

ముఖ్య సూచనలు

  • ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్లు అందిస్తారు.

  • హోటల్ చెక్-ఇన్ సాధారణంగా మధ్యాహ్నం ఉంటుంది.

  • ట్రైన్ టైమింగ్ మారితే షెడ్యూల్‌లో మార్పులు ఉండొచ్చు.

తక్కువ ఖర్చుతో హిల్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారికి ఈ ప్యాకేజీ మంచి ఎంపిక. వేసవి వేడిని దూరం చేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇది సరైన అవకాశం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Mar 30 , 2026 | 05:12 PM