Share News

కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? ఉచితంగా మార్చుకోండిలా..!

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:15 AM

చాలామంది చిరిగిపోయిన కరెన్సీ నోట్లు చెల్లవని భావిస్తారు. ఈ నోట్లను సులభంగా మార్చుకునేందుకు ఓ మార్గం ఉంది. అది ఏంటంటే..?

కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? ఉచితంగా మార్చుకోండిలా..!
Currency Exchange

ఇంటర్నెట్ డెస్క్: ఒకోసారి మన దగ్గరకు చిరిగిపోయిన కరెన్సీ నోట్లు వస్తుంటాయి. ఇవి బాగా చిరిగిపోయి ఉంటే వీటిని తీసుకోవడానికి దుకాణదారులు లేదా ఇతర వ్యక్తులు నిరాకరిస్తారు. అలాంటి సమయాల్లో కంగారు పడిపోతాం. అవి ఇక చెల్లవని భావిస్తాం. అయితే ఈ పరిస్థితుల్లో చిరిగిన నోట్లను సులభంగా మార్చుకునేందుకు మార్గం ఉంది. సమీపంలోని బ్యాంక్‌ను సందర్శించి పూర్తి ఉచితంగా ఈ నోట్లను మార్చుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.


ఎక్కడెక్కడ మార్చుకోవచ్చు?

  • ప్రస్తుత ఆర్బీఐ నిబంధనల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులూ పాత, చిరిగిపోయిన నోట్లను మార్చుకునేందుకు సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.

  • కాబట్టి సమీపంలో ఉన్న బ్యాంక్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

  • మరో విషయం.. నోట్లు మార్చుకునేందుకు ఆ బ్యాంక్‌లో ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైనా ఏ బ్యాంక్‌కైనా వెళ్లి నోట్లను మార్చుకోవచ్చు.


ఎన్ని నోట్లను మార్చుకోవచ్చు

ఒకరోజులో ఎన్ని చిరిగిన నోట్లు మార్చుకోవచ్చు అనేదానిపై పరిమితేమీ లేదు. అయితే ఒక రోజులో గరిష్ఠంగా 20 చిరిగిన నోట్ల మార్చుకునేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. 20 కన్నా ఎక్కువ నోట్లను మార్చుకునేందుకు మరో ప్రక్రియ ఉంటుంది. మొదట మీ దగ్గర 20 నోట్లు (వాటి మొత్తం విలువ రూ.5000కు మించకూడదు) ఉంటే అప్పుడు బ్యాంక్ వాటిని కౌంటర్ వద్ద మార్పిడి చేస్తుంది. అంటే వేగంగా నోట్ల మార్పిడి జరుగుతుంది. మరోవైపు 20 నోట్ల కంటే ఎక్కువగా ఉన్నా, వాటి మొత్తం విలువ రూ.5000 దాటినా బ్యాంక్ వాటిని రసీదుతో స్వీకరిస్తుంది. ఆ తరువాత నగదును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి వారం రోజుల సమయం పడుతుంది.

కాలిపోయిన నోట్లు ఏం చేయాలి.

ఆర్బీఐ నోట్ రీఫండ్ నియమాల ప్రకారం కొంత భాగం కాలిపోయిన నోట్లను కూడా బ్యాంక్‌లు స్వీకరిస్తాయి. కానీ బాగా కాలిపోయి ఉన్న నోట్లను మాత్రం తీసుకోవని గుర్తు పెట్టుకోవాలి.


ఇవీ చదవండి

రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!

మీ బైక్ మైలేజీ తగ్గుతోందా..? అయితే ఈ తప్పులు చేయకండి!

Updated Date - Oct 14 , 2026 | 07:24 AM