Share News

ఇంటికొచ్చి ప్రపోజ్ చేశాడు

ABN , Publish Date - Mar 01 , 2026 | 08:05 AM

మిస్‌ ఇండియాగా అందాల కిరీటాన్ని సొంతం చేసుకుని, సినిమా రంగంలోకి అడుగుపెట్టినవారిలో ఆమె ఒకరు. కాకపోతే మన తెలుగమ్మాయి.

ఇంటికొచ్చి ప్రపోజ్ చేశాడు

మిస్‌ ఇండియాగా అందాల కిరీటాన్ని సొంతం చేసుకుని, సినిమా రంగంలోకి అడుగుపెట్టినవారిలో ఆమె ఒకరు. కాకపోతే మన తెలుగమ్మాయి. ‘దేవకీ నందన వాసుదేవ’తో వెండితెరకు పరిచయమై... ఇటీవల వచ్చిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’తో యువతరం హృదయాలను కొల్లగొట్టింది మానస వారణాసి. హిట్‌ జోష్‌లో ఉన్న ఈ హైదరాబాదీ బ్యూటీ పంచుకున్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...

ఆ క్షణం...

నిజానికి కవితాత్మక ప్రేమలేఖల్లో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. అలాంటి ప్రపోజల్స్‌ నాకూ వచ్చాయి. వాటిని చదివి నవ్వుకునేదాన్ని. ఇప్పటిదాకా వచ్చిన క్రేజీ ప్రపోజల్‌ అంటే... ఓసారి నేను మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాను. సడెన్‌గా ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఎదురుగా తెలుపు రంగు చొక్కా, నీలం రంగు ప్యాంటులో ఒక అబ్బాయి. అతడి చేతిలో పూల బొకే. ‘మీ మనవరాలంటే నాకు చాలా ఇష్టం. మీరు అనుమతిస్తే పెళ్లి చేసుకుంటా’ అని నేరుగా అమ్మమ్మతోనే చెప్పాడు. ఆ క్షణంలో భయమేసింది.


ఆ క్షణం...

నిజానికి కవితాత్మక ప్రేమలేఖల్లో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. అలాంటి ప్రపోజల్స్‌ నాకూ వచ్చాయి. వాటిని చదివి నవ్వుకునేదాన్ని. ఇప్పటిదాకా వచ్చిన క్రేజీ ప్రపోజల్‌ అంటే... ఓసారి నేను మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాను. సడెన్‌గా ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఎదురుగా తెలుపు రంగు చొక్కా, నీలం రంగు ప్యాంటులో ఒక అబ్బాయి. అతడి చేతిలో పూల బొకే. ‘మీ మనవరాలంటే నాకు చాలా ఇష్టం. మీరు అనుమతిస్తే పెళ్లి చేసుకుంటా’ అని నేరుగా అమ్మమ్మతోనే చెప్పాడు. ఆ క్షణంలో భయమేసింది.


మేకప్‌ లేకుండా నటించా...

2022లో దర్శకుడు అశ్విన్‌ చంద్రశేఖర్‌ ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ పేరుతో ఓ లఘు చిత్రం చేశారు. అది మంచి ఆదరణ పొందడంతో, అదే కథను విస్తరించి పూర్తి స్థాయిలో సినిమాగా తెరకెక్కించారు. డైరెక్టర్‌ తమిళ నేపథ్యం ఉన్న వ్యక్తి కావడంతో సినిమా కథ మొత్తం తమిళంలోనే రాసుకున్నారు. నేను, హీరో సంతోష్‌ శోభన్‌ ఆ తమిళ డైలాగ్‌ అసలు ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకుని, దానికి సరిపోయే పక్కా తెలుగు పదాలను అక్కడికక్కడే రాసుకునేవాళ్లం. ఈ సినిమాను చెన్నైలో రియల్‌ లొకేషన్లలో, హిడెన్‌ కెమెరాలతో షూట్‌ చేశారు. ఎలాంటి మేకప్‌ లేకుండా నటించా.


book2.2.jpgఉద్యోగానికి రాజీనామా చేసి..

నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. ఓ కార్పొరేట్‌ కంపెనీలో రెండేళ్లపాటు ఉద్యోగం చేశా. ఆ సమయంలోనే మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనమని నా స్నేహితులు ప్రోత్సహించడంతో ఆ దిశగా ప్రయత్నించా. కట్‌ చేస్తే ‘మిస్‌ ఇండియా 2020’ కిరీటం అందుకున్నా. తర్వాత ‘మిస్‌ వరల్డ్‌ 2021’ పోటీలకు ప్రాతినిథ్యం వహించా. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లో ఆడిషన్స్‌ ఇవ్వడం మొదలెట్టా. అలా ‘దేవకీ నందన వాసుదేవ’లో అవకాశం వచ్చింది.


మహేశ్‌బాబుకి వీరాభిమానిని...

చిన్నప్పటి నుంచి మహేశ్‌ బాబుకి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలన్నీ చూశా. ‘పోకిరి’, ‘1: నేనొక్కడినే’ చాలా ఇష్టం. హీరోయిన్స్‌లో అయితే సమంత, సాయిపల్లవి, రష్మిక నాకు స్ఫూర్తి. ‘అమరన్‌’లో సాయిపల్లవి, ‘రంగస్థలం’లో సమంత పోషించిన టైపు పాత్రల్లో నటించాలనుంది. అలాగే థ్రిల్లర్‌ మిస్టరీస్‌, స్పై, డిటెక్టివ్‌ పాత్రల్లో మెప్పించాలనుంది.


book2.3.jpgఫటాఫట్‌

  • నాలో నాకు బాగా నచ్చే లక్షణం: ఎప్పుడూ చిల్‌గా, బిందాస్‌గా ఉంటా.

  • హైదరాబాద్‌ అంటే ఠక్కున గుర్తొచ్చేది: ట్యాంక్‌బండ్‌

  • ఇష్టమైన ఫుడ్‌: వెజిటేరియన్‌లో ఏదైనా సరే ఇష్టంగా తింటా. పులిహోరా నా ఫేవరెట్‌.

  • నచ్చిన రంగు: ఎరుపు

  • ఇష్టమైన దర్శకులు: రాజమౌళి, సుకుమార్‌, మణిరత్నం

  • ఇష్టమైన పాట: ఇటీవల కాలంలో ‘వారణాసి’లోని సంచారి సాంగ్‌ ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు.

  • కాబోయేవాడు ఎలా ఉండాలంటే: ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ఎంత భద్రతగా ఫీలవుతామో... అతడి వద్ద అంతే భద్రత ఉండాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2026 | 09:03 AM