ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు
ABN , Publish Date - Mar 01 , 2026 | 07:53 AM
పండ్లు ఆరోగ్యానికి మంచివే, కానీ వాటిని తినే సమయం కూడా చాలా ముఖ్యం. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, వాటిని తినే సమయం కూడా ముఖ్యం. కొన్ని పండ్లను ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదని డైటీషియన్‌లు సూచిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం, గ్యాస్, జీర్ణ సమస్యలు కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు:
సిట్రస్ పండ్లు
నారింజ, లెమన్ వంటి సిట్రస్ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తింటే కడుపులో ఆమ్లత్వం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు రావచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారికి సిట్రస్ పండ్లు తినడం మరింత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండు
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులోని మెగ్నీషియం, సహజ చక్కెరల కారణంగా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. అందువల్ల భోజనం తిన్న కొంతసేపు తరువాత తినడం మంచిదని సూచిస్తున్నారు.
మామిడి పండు
మామిడి పండులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది, ఇది ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు
ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లు తినకూడదు.
పాలు పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది కాదు.
కట్ చేసిన పండ్లను ఎక్కువసేపు నిల్వ చేయకూడదు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News