Share News

మొబైల్‌ఫోన్‌ ఊసే ఉండదక్కడ!

ABN , Publish Date - Sep 20 , 2026 | 09:50 AM

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఐదు నిమిషాలు కూడా ఉండలేని కాలంలో... సెల్‌ఫోన్‌ కనిపించని ఊరు ఉందంటే నమ్ముతారా? అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియా రాష్ట్రంలో ఉన్న ‘గ్రీన్‌ బ్యాంక్‌’ అనే చిన్న గ్రామంలో ఒక్కటంటే ఒక్క ఫోన్‌ కూడా కనిపించదు.

మొబైల్‌ఫోన్‌ ఊసే ఉండదక్కడ!
village without mobile phones

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఐదు నిమిషాలు కూడా ఉండలేని కాలంలో... సెల్‌ఫోన్‌ కనిపించని ఊరు ఉందంటే నమ్ముతారా? అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియా రాష్ట్రంలో ఉన్న ‘గ్రీన్‌ బ్యాంక్‌’ అనే చిన్న గ్రామంలో ఒక్కటంటే ఒక్క ఫోన్‌ కూడా కనిపించదు. వై-ఫై మాటే వినబడదు. అందుకే ఈ ఊరు ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఎవరూ కూడా మొబైల్‌ ఫోన్స్‌, వైఫై ఉపయోగించకపోవడం గ్రీన్‌ బ్యాంక్‌ గ్రామం ప్రత్యేకత! ఎందుకంటే అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ ఉంది. దీన్ని ‘గ్రీన్‌బ్యాంక్‌ టెలిస్కోప్‌’ అంటారు. ఈ టెలిస్కోప్‌ ద్వారా విశ్లేషించే సంకేతాలకు ఎలాంటి అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వాడకాన్ని నిషేధించారు. సుదూర గెలాక్సీల నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలను ఈ రేడియో టెలిస్కోప్‌ గుర్తిస్తుంది.


book5.2.jpgఈ సంకేతాలు ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్‌ల నుంచి వెలువడే తరంగాలతో కలిసే అవకాశం ఉంటుంది. రేడియో టెలిస్కోపులు అంతరిక్షం నుంచి వచ్చే సూక్ష్మ సంకేతాలను ఎలాంటి అంతరాయం లేకుండా గుర్తించాల్సి ఉంటుంది. అందుకే అక్కడ సెల్‌ఫోన్లు, వైఫై, ఇతరత్రా కమ్యూనికేషన్‌ డివైజ్‌లను ఉపయోగించరు. గ్రీన్‌ బ్యాంక్‌ చుట్టూ ఉన్న ప్రత్యేక ప్రాంతాన్ని ‘నేషనల్‌ రేడియో క్వైట్‌ జోన్‌’ అంటారు. ఇది సుమారు 13 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో వర్జీనియా, మేరీల్యాండ్‌ రాష్ట్రాల సరిహద్దులదాకా విస్తరించి ఉంది.


book5.3.jpgఆత్మీయ పలకరింపులు

గ్రీన్‌ బ్యాంక్‌లో నివసించే ప్రజల జీవితం... మిగతా ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. పిల్లలు గంటల తరబడి మొబైల్‌ స్ర్కీన్లకు అతుక్కు పోవడం కనిపించదు. పిల్లలు కలిసిమెలసి బయట ఆడుకుంటూ కనిపిస్తారు. వాట్సాప్‌ మెసేజ్‌ల గోల అసలే ఉండదు. విషయమేదైనా సరే, నేరుగా కలిసి మాట్లాడుకుంటుంటారు.


స్థానికులు ప్రతీ రోజూ ఒకరినొకరు పలకరించుకుంటారు. బయటివాళ్లతో మాట్లాడాల్సి వస్తే పబ్లిక్‌ పే ఫోన్లను ఉపయోగించడం ఒక్కటే మార్గం. టెక్నాలజీకి దూరంగా, ప్రశాంతంగా ఉండాలనుకునేవారు గ్రీన్‌బ్యాంక్‌కు వచ్చి కొన్నాళ్లు గడుపుతారు. స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండలేని ఈరోజుల్లో... వాటికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారంటే ఆ గ్రామస్థులను అభినందించాల్సిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 09:51 AM