Share News

కాంతివంతమైన చర్మం కోసం ఈ చిట్కా ట్రై చేయండి

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:00 PM

మీ ముఖం తాజాగా, ప్రకాశవంతంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే, ప్రతిరోజూ కలబంద జెల్‌తో ఈ రెండు పదార్థాలను కలిపి ముఖానికి రాసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కాంతివంతమైన చర్మం కోసం ఈ చిట్కా ట్రై చేయండి
Aloe Vera Face Pack Benefits

ఇంటర్నెట్ డెస్క్: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మందికి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి, చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, పండ్లు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ వాడటం, చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ఉపయోగించడం, క్రమం తప్పకుండా ముఖం కడుక్కోవడం వంటి అలవాట్లు పాటించాలి.

ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు కలబంద జెల్ అప్లై చేయడం ద్వారా చర్మం లోతుగా శుభ్రంగా ఉంటుంది. మచ్చలు తగ్గుతాయి, చర్మం కాంతివంతంగా మారుతుంది.


కలబందలో ఉండే పోషకాలు:

కలబంద (Aloe Vera) ముఖానికి అప్లై చేయడం చాలా మంచిది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, తేమను అందిస్తుంది, మొటిమలను తగ్గించడంలో, సూర్యరశ్మి వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కలబందలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి.


కాంతివంతమైన చర్మం కోసం

  • ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కలబంద జెల్ వేసుకోవాలి.

  • అందులో కొబ్బరి నూనె, విటమిన్ E క్యాప్సూల్ జ్యూస్‌ని కలపాలి.

  • బాగా కలిపి పేస్ట్ తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15–20 నిమిషాల పాటు అలాగే ఉండి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

  • ప్రతిరోజూ రాత్రి ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల ముఖం సహజంగా తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Mar 27 , 2026 | 01:00 PM