రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:00 PM
మామిడి సీజన్ కావడంతో మార్కెట్లో విభిన్న రకాల మామిడి పండ్లు విరివిగా లభిస్తున్నాయి. అయితే వీటిలో చాలా పండ్లు రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మామిడి సీజన్ కావడంతో మార్కెట్లో అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటంతో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఈ రోజుల్లో చాలా పండ్లు రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారని కూడా గుర్తుంచుకోవాలి. సహజంగా పండిన పండ్లకు బదులుగా రసాయనాలతో పండించిన పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే నిజమైన పండ్లు ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సహజ మామిడి పండ్లను గుర్తించే మార్గాలు
సహజంగా పండిన మామిడికి మంచి సువాసన ఉంటుంది. దూరం నుంచే వాసన తెలుస్తుంది. ఇవి పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంగా ఉంటాయి. చేతితో తాకితే కొద్దిగా మృదువుగా ఉంటాయి. రంగు ఒకేలా కాకుండా సహజంగా అసమానంగా ఉంటుంది.

రసాయనాలతో పండించిన మామిడి లక్షణాలు
చాలా ప్రకాశవంతమైన పసుపు రంగులో కనిపిస్తాయి. సువాసన ఉండదు. బయట పండినట్లు కనిపించినా లోపల పచ్చిగా ఉంటుంది. తాకితే గట్టిగా ఉంటుంది. ఎక్కువగా ఒకే రంగులో మెరిసిపోతాయి.
రసాయన పండ్ల వల్ల సమస్యలు
రసాయనాలతో పండించిన మామిడి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన పండ్లు తింటే గొంతులో మంటగా అనిపించవచ్చు. అసౌకర్యం కలగవచ్చు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అలర్జీలు, తల తిరగడం, శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

వాటర్ టెస్ట్
ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లు వేయండి. సహజంగా పండిన మామిడి పండ్లు నీటిలో మునిగిపోతాయి. రసాయనాలతో పండించిన పండ్లు మాత్రం నీటిపై తేలుతాయి. కాబట్టి, మామిడి పండ్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేయడం చాలా ముఖ్యం. సహజ పండ్లను గుర్తిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మనీ ప్లాంట్ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం
నేను బంతినే చూస్తా.. బౌలర్‌ను కాదు: వైభవ్ సూర్యవంశీ
For More Latest News