Share News

బాస్మతి బియ్యం వండేటప్పుడు ఈ తప్పులు చేయకండి.!

ABN , Publish Date - Feb 03 , 2026 | 10:10 AM

బాస్మతి బియ్యం వండినప్పుడు పొడిపొడిగా, మృదువుగా ఉంటుంది. అందుకే బిర్యానీ, పులావ్‌లకు ఇవే ఎక్కువగా వాడుతారు. కానీ బాస్మతి బియ్యం వండేటప్పుడు కొన్ని చిన్న తప్పులు చేస్తే అన్నం జిగటగా మారుతుంది.

బాస్మతి బియ్యం వండేటప్పుడు ఈ తప్పులు చేయకండి.!
Tipd to Cook Basmati Rice

ఇంటర్నెట్ డెస్క్: బాస్మతి బియ్యాన్ని సాధారణంగా పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లో వండుతారు. బిర్యానీ, పులావ్, జీరా రైస్ లాంటి వంటల్లో ఎక్కువగా వాడుతారు. కానీ వండేటప్పుడు చిన్న తప్పులు చేస్తే అన్నం జిగటగా మారుతుంది, గింజలు కూడా విరిగిపోతాయి. అందుకే చాలా మంది హోటల్‌లో బాస్మతి రైస్ బాగుంటుంది ఇంట్లో చేస్తే ఎందుకు అలా ఉండదు? అనే సందేహం వస్తుంది. దీనికి కారణం బియ్యం కాదు, వండే పద్ధతిలో చేసే పొరపాట్లే. ఇప్పుడు బాస్మతి బియ్యం వండేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దాం..


నీటి మోతాదు

బాస్మతి బియ్యం బాగా ఉడకాలంటే నీటి పరిమాణం చాలా ముఖ్యం. నీరు తక్కువైతే బియ్యం సరిగ్గా ఉడకవు. నీరు ఎక్కువైతే అన్నం అతుక్కుపోయి జిగటగా మారుతుంది. ఒక కప్పు బాస్మతి బియ్యానికి సుమారు 1½ కప్పుల నీరు సరిపోతుంది.

పదే పదే కలపడం

బియ్యం ఉడికేటప్పుడు తరచూ గరిటెతో కలిపితే గింజలు విరిగిపోతాయి. నీరు మరిగిన తర్వాత ఒకసారి మాత్రమే కలిపి, ఆవిరి తగ్గాక మంటను తగ్గించి మూత పెట్టాలి. తర్వాత అసలు కలపకూడదు.


కడగడంలో చేసే పొరపాటు

బాస్మతి బియ్యంలో సహజంగా స్టార్చ్ ఉంటుంది. అదే బియ్యం జిగటగా మారడానికి కారణం. వండే ముందు 3–4 సార్లు మృదువుగా కడగాలి. బలంగా రుద్దకూడదు. బియ్యాన్ని కనీసం 15–20 నిమిషాలు నానబెట్టాలి. అలా చేస్తే బియ్యం బాగా ఉడుకుతాయి.

ఉడికిన వెంటనే వడ్డించడం

బియ్యం పూర్తిగా ఉడికిన వెంటనే మంట ఆపి మూత పెట్టాలి. చాలామంది మంట మీదే ఎక్కువసేపు ఉంచేస్తారు. అలా చేస్తే బియ్యం ఎక్కువగా ఉడికిపోతాయి. మంట ఆపిన తర్వాత 10 నిమిషాలు అలాగే ఉంచాలి.


చిట్కాలు

  • నీరు మరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా నూనె వేస్తే అన్నం అడుగున అతుక్కుపోదు.

  • నీరు ఆవిరైన తర్వాత మంట తగ్గించాలి.

  • అడుగు మందంగా ఉన్న పాత్ర వాడాలి.

  • మీడియం నుంచి లో ఫ్లేమ్‌లోనే ఉడికించాలి.

  • ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లో చేసిన బాస్మతి బియ్యం కూడా హోటల్ స్టైల్‌లో ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆత్మవిశ్వాసం... అందరికీ సాధ్యమేనా?

రోజుకు 24 గంటలు సరిపోవట్లేదా? ఈ సింపుల్‌ ఫార్ములాతో లైఫ్ సెట్‌..

For More Latest News

Updated Date - Feb 03 , 2026 | 10:45 AM