Share News

ఈ 5 దేశాలలో ఒక్క ఎయిర్‌పోర్ట్ కూడా లేదు.. అయినా పర్యాటకుల రద్దీ!

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:54 PM

ప్రపంచంలో అత్యాధునిక విమానాశ్రయాలు ఉన్న దేశాలే కాదు, ఒక్క విమానాశ్రయం కూడా లేని దేశాలూ ఉన్నాయి. అయినప్పటికీ.. ఈ దేశాలకు విదేశీ పర్యాటకులు భారీ స్థాయిలో వస్తుంటారు. కారణం ఆయాదేశాల్లోని ప్రకృతి అందాలే. మరి ఆ ఐదు దేశాల ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఈ 5 దేశాలలో ఒక్క ఎయిర్‌పోర్ట్ కూడా లేదు.. అయినా పర్యాటకుల రద్దీ!
Countries Without Airport

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి దేశంలో కనీసం ఒక విమానాశ్రయం అయినా ఉంటుంది. విమానాశ్రయాలు ఆ దేశ అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి. కానీ ప్రపంచ పటంలో ఒక్క విమానాశ్రయం కూడా లేని దేశాలు ఐదు ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. విమానాశ్రయాలు లేకపోయినా, ఈ దేశాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆ దేశాల్లో ప్రకృతి అందాలు.. ప్రశాంత వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం. ఆ దేశాలు ఏవో వివరంగా తెలుసుకుందాం..


అండోరా

ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్ పర్వతాలలో ఉన్న ఈ చిన్న దేశం ఒక పర్వత స్వర్గధామం. చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఇక్కడ విమానాశ్రయం నిర్మించడం సాధ్యం కాదు. కానీ స్కీయింగ్, మంచు దృశ్యాలు, ప్రకృతి సహజ సౌందర్యం చూసిన తర్వాత విమానాశ్రయం లేదనే విషయమే పెద్దగా గుర్తుకు రాదు.

Andora.jpg

మొనాకో

మొనాకో ప్రపంచంలోనే రెండో అతి చిన్న దేశం. దేశం చాలా చిన్నదిగా ఉండటంతో విమానాశ్రయం నిర్మించడానికి స్థలం లేదు. కానీ క్యాసినోలు, ఖరీదైన కార్లు, సముద్రతీర అందాలు మొనాకోను ప్రత్యేకంగా నిలబెడతాయి.

Monaco.jpg


శాన్ మారినో..

ఇటలీ మధ్యలో ఉన్న ఈ చిన్న దేశం చరిత్రకు సాక్షంగా నిలుస్తుంది. పురాతన కోటలు, సన్నని వీధులు, పురాతన నిర్మాణాలు చూసి చరిత్ర ప్రేమికులు మంత్రముగ్ధులు అవుతారు.

sanmarona.jpg


లీచ్టెన్‌స్టెయిన్

స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న ఈ చిన్న దేశం అద్భుత కథలలో కనిపించే లోయలాగే ఉంటుంది. పచ్చని కొండలు, పురాతన కోటలు, ప్రశాంత వాతావరణం దీని ప్రత్యేకత.

Licheston.jpg

వాటికన్ సిటీ

ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ రోమ్ నగరం మధ్యలో ఉంది. దేశం అంత చిన్నది కావడంతో విమానాశ్రయం సంగతి పక్కనపెడితే.. సరిగ్గా నడవడానికి కూడా పరిమిత స్థలమే ఉంటుంది!

Vatican City.jpg


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆత్మవిశ్వాసం... అందరికీ సాధ్యమేనా?

రోజుకు 24 గంటలు సరిపోవట్లేదా? ఈ సింపుల్‌ ఫార్ములాతో లైఫ్ సెట్‌..

For More Latest News

Updated Date - Feb 02 , 2026 | 03:07 PM