ఉదయాన్నే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:12 AM
ఆరోగ్యకరమైన జీవితం కోసం ఉదయం నిద్రలేచిన వెంటనే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ఉదయం కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం చాలా అవసరం. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. మనసును ప్రశాంతం చేసేందుకు కూడా సాయపడతాయి.
నాలుకను శుభ్రం చేసుకోవడం..
ఉదయం బ్రష్ చేయడంతో పాటు నాలుకనూ శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని అంతర్గత అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
వ్యాయామం చేయడం..
రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా యోగా, సూర్య నమస్కారాలతో రోజును ప్రారంభిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది శరీర బలం పెంచుతుంది, మానసిక శాంతిని అందిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల.. మానసిక స్పష్టత, శాంతి, దృష్టి మెరుగుపడుతుంది.

తలకు మసాజ్ చేసుకోవడం..
గోరువెచ్చని నూనెతో తల, శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే కండరాల బలం పెరుగుతుంది.
గోరువెచ్చని నీరు తాగడం..
రోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ యాక్టివ్ అవుతుంది. శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, చర్మ ప్రకాశాన్ని పెంచుతుంది.

ముఖాన్ని చల్లటి నీటితో కడగడం..
ముఖం, కళ్లను చల్లటి నీటితో కడగడం వల్ల.. ఇంద్రియాలను రీఫ్రెష్ చేస్తుంది. చర్మంలో పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News