రోజుకు 24 గంటలు సరిపోవట్లేదా? ఈ సింపుల్ ఫార్ములాతో లైఫ్ సెట్..
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:44 PM
నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరికీ సమయం సరిపోవడం పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత అవసరాల మధ్య సమతుల్యం కోల్పోతూ చాలా మంది మానసిక అలసటకు గురవుతున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికీ రోజుకు లభించేది 24 గంటలే.. కానీ ఆ సమయాన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటారన్నదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. మారుతున్న జీవన శైలి, వేగవంతమైన వర్క్ కల్చర్, పెరుగుతున్న ఒత్తిడి మధ్య సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం చాలా మందికి సవాలుగా మారింది. ఉద్యోగ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం కోల్పోకుండా ముందుకు సాగాలంటే సమర్థవంతమైన టైం మేనేజ్‌మెంట్ అవసరం. ఈ క్రమంలో రోజువారీ జీవితంలో క్రమశిక్షణను పెంపొందించి, శారీరక–మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో 8+8+8 రూల్ కీలకంగా పనిచేస్తుంది.
ఏంటీ 8+8+8 రూల్?
ఈ పద్ధతి ప్రకారం రోజులోని 24 గంటలను మూడు భాగాలుగా విభజించుకోవాలి.
8 గంటలు – ఉద్యోగం లేదా వృత్తికి కేటాయించాలి.
8 గంటలు – నాణ్యమైన నిద్రకు వినియోగించాలి.
మిగిలిన 8 గంటలు – కుటుంబం, స్నేహితులు, వ్యక్తిగత అభిరుచులు, ఆరోగ్యం, సేవా కార్యక్రమాలకు కేటాయించాలి. ఇలా సమయాన్ని సమతుల్యంగా వినియోగించుకుంటే ఒత్తిడి తగ్గి, జీవితం మరింత ఆనందంగా మారుతుంది.
ఈ రూల్ వల్ల కలిగే లాభాలు..
ప్రతి ఒక్కరి జీవనశైలికి అనుగుణంగా సమయాన్ని చిన్న భాగాలుగా విభజించుకోవచ్చు.
పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి.
.కుటుంబానికి, అభిరుచులకు ఎక్కువ సమయం దొరుకుతుంది.
సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలు పుడతాయి.
తగినంత విశ్రాంతితో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన, అలసట తగ్గుతాయి.
రోజువారి జీవితంలో ఈ రూల్‌ను అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాలంలో విజయంతో పాటు సంతృప్తికరమైన జీవితం సాధ్యమవుతుంది.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News