పచ్చి కూరగాయలు తినే ముందు ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి
ABN , Publish Date - Apr 02 , 2026 | 09:03 AM
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే కొంతమంది వాటిని పచ్చిగా కూడా తింటుంటారు. కానీ పచ్చి కూరగాయలు తినే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొంతమంది వాటిని పచ్చిగా కూడా తింటుంటారు. కానీ పచ్చి కూరగాయలు తినే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పచ్చి కూరగాయలు తీసుకునే ముందు ఏమేమి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో హానికరం కావచ్చు.
జీర్ణ సమస్యలు: పచ్చి కూరగాయల్లో ఎక్కువగా పీచుపదార్థం ఉంటుంది. ఇవి ఎక్కువగా తింటే కడుపు నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు.
సహజ విషపదార్థాలు: కొన్ని కూరగాయల్లో సోలనిన్ వంటి సహజ విషపదార్థాలు ఉంటాయి.
బ్యాక్టీరియా ప్రమాదం: సరిగా శుభ్రం చేయని కూరగాయల్లో ఇ.కోలి వంటి హానికర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది.
కాబట్టి పచ్చి కూరగాయలను తినే ముందు కనీసం 20 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రంగా కడగడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణులు కొన్ని కూరగాయలను పచ్చిగా తినకూడదని సూచిస్తున్నారు. బంగాళాదుంప, వంకాయ, క్యాప్సికమ్, బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర, క్యాబేజీ వంటి కూరగాయలను పచ్చిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాబేజీలో కంటికి కనిపించని పురుగులు లేదా వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంది. అందుకే దాన్ని వేడి నీటిలో బాగా కడిగి, పూర్తిగా ఉడికించి తినడం మంచిది. పచ్చిగా తింటే జీర్ణ సమస్యలు రావచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Health News