Share News

డీహైడ్రేషన్ తగ్గించే కర్బూజ జ్యూస్.. ఇంట్లోనే ఎలా చేయాలంటే..?

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:01 PM

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లలో కర్బూజ ముఖ్యమైనది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా కర్బూజ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

డీహైడ్రేషన్ తగ్గించే కర్బూజ జ్యూస్.. ఇంట్లోనే ఎలా చేయాలంటే..?
Muskmelon Juice Recipe

ఇంటర్నెట్ డెస్క్: కర్బూజ (Muskmelon) వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో 90శాతం పైగా నీరు, విటమిన్ A, C, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.


వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లలో కర్బూజ ముఖ్యమైనది. అధిక వేడి వల్ల వచ్చే డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కొంతమంది దీనిని నేరుగా ముక్కలుగా తినడానికి ఇష్టపడతారు. మరికొందరు జ్యూస్‌గా తాగడానికి ఇష్టపడతారు. అయితే, ఇంట్లోనే సులభంగా కర్బూజ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..


కర్బూజ జ్యూస్‌కు కావలసిన పదార్థాలు:

  • కర్బూజ ముక్కలు – సుమారు 2-3 కప్పులు

  • నీరు లేదా చల్లటి పాలు - 1 కప్పు

  • నిమ్మరసం – 1 టీ స్పూన్

  • చక్కెర - 3-4 టేబుల్ స్పూన్లు

  • ఐస్ క్యూబ్స్ – తగినన్ని (చల్లదనం కోసం )

  • పుదీనా ఆకులు - గార్నిషింగ్ కోసం


తయారీ విధానం:

  • ముందుగా కర్బూజ పండును కడిగి, పైన తొక్క, లోపల గింజలు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

  • మిక్సీ జార్‌లో కర్బూజ ముక్కలు, చక్కెర, నీరు లేదా పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.

  • అవసరమైతే నిమ్మరసం వేసి మరోసారి బ్లెండ్ చేయాలి.

  • మిశ్రమాన్ని వడకట్టి జ్యూస్ తీసుకోవాలి.

  • గ్లాసులో జ్యూస్ పోసి ఐస్ క్యూబ్స్‌తో సర్వ్ చేసుకోవాలి.

వేసవిలో కర్బూజ తినడం లేదా కర్బూజ జ్యూస్ తాగడం శరీరానికి చాలా మంచిది. ఇది సహజంగా చల్లదనం ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే మితంగా తీసుకోవడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

పక్షుల గుంపులు 'వి' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి.. దీని వెనుక కారణమేంటి?

ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

For More Latest News

Updated Date - Apr 23 , 2026 | 05:34 PM