Share News

వరుసగా రెండో రోజూ భారీ నష్టాలే.. 850 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:45 PM

వరుసగా నాలుగో సెషన్‌లో కూడా క్రూడాయిల్ ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి.

వరుసగా రెండో రోజూ భారీ నష్టాలే.. 850 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
Stock Market

వరుసగా నాలుగో సెషన్‌లో కూడా క్రూడాయిల్ ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. బుధవారం విదేశీ మదుపర్లు రూ.2,078 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు కూడా నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (78,516)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 852 పాయింట్ల నష్టంతో 77,664 వద్ద రోజును ముగించింది. మళ్లీ 78 వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 205 పాయింట్ల నష్టంతో 24,173 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో రెడ్డీస్ ల్యాబ్స్, ఒరాకిల్ ఫిన్‌సర్వ్, పిరామిల్ ఫార్మా, సిప్లా, టొరెంట్ పవర్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). యూనియన్ బ్యాంక్, హవెల్స్ ఇండియా, ఫోర్స్ మోటార్స్, ఏపీఎల్ అపోలో, అశోక్ లేలాండ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 819 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 248 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.11గా ఉంది.


ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్


నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 23 , 2026 | 03:54 PM