సొరకాయతో నూడుల్స్.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:47 PM
నూడుల్స్.. చాలా మంది లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతోనే రెడీ అయ్యే ఈ నూడుల్స్‌ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఇందులో ఆరోగ్యకమైన పోషకాలకంటే..
నూడుల్స్.. చాలా మంది లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతోనే రెడీ అయ్యే ఈ నూడుల్స్‌ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఇందులో ఆరోగ్యకమైన పోషకాలకంటే.. అనారోగ్యకమైన కారకాలే ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలు వంటివి వస్తుంటాయి. అందుకే.. నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే ఇక్కడో ఛాన్స్ ఉందండోయ్.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నూడుల్స్‌ని పుష్కలంగా తినొచ్చు. వీటిని తింటామంటే ‘నో’ చెప్పేవారే ఉండరు. అనారోగ్యం దరిదాపుల్లోకి కూడా రాదు.
సాధారణంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే నూడుల్స్‌ని గోధుమ పిండి, మైదా పిండి, చిలగడదుంప స్టార్చ్ వంటి పదార్థాలతో తయారు చేస్తుంటారు. వీటితో తయారు చేసే పదార్థాలు అనారోగ్యానికి కారణమవుతుంది. కానీ, సొరకాయతో కూడా నూడుల్స్ చేయొచ్చని మీకు తెలుసా? ఈ నూడుల్స్ సాధారణ నూడుల్స్ కంటే టేస్టీగా, హెల్తీగా ఉంటాయి. అవును మీరు చదివేది నిజంగా నిజం. సొరకాయతో టేస్టీ టేస్టీ నూడుల్స్ చేసుకుని కడుపునిండా తినేయొచ్చు. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, పైగా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి సొరకాయతో నూడుల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
లూడుల్స్ కోసం రెసిపీ..
ముందుగా మంచి సొరకాయ ఒకటి తీసుకోవాలి.
దాని పొట్టు తీసేయాలి.
ఆ తరువాత బాక్స్ గ్రేటర్‌తో సన్నని తీగల మాదిరిగా తరగాలి.
తరిగిన తీగలను ఉప్పుతో కలిపి పది 10-30 నిమిషాలు పక్కన పెట్టాలి.
వాటిని తడి లేకుండా అరబెట్టాలి. లేదా టవల్‌తో వాటర్ లేకుండా పిండాలి.
ఆ తరువాత గ్యాస్ స్టౌపై ఒక గిన్నెలో నువ్వులు, నిమ్మరసం, తేనె, టమాటా జ్యూస్ కలిపి మంచి టేస్టీ, హెల్తీ సాస్ తయారు చేసుకోవాలి.
ఆ తరువాత మరో గిన్నెలో నూనె వేసి.. తరిగిన వెల్లుల్లి కొంత వేయించాలి.
ఇందులో మీకు నచ్చిన కూరగాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి.
ఆ తరువాత పాన్‌లో సొరకాయ తరుగును వేసి కాస్త వేయించాలి.
ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్న సాస్‌ని కూడా ఆ తరుగులో వేసి ఫ్రై చేయాలి.
అంతే.. రుచికరమైన నూడుల్స్ రెడీ అయిపోయాయి. ఇక తినడమే తరువాయి.
సొరకాయ నూడుల్స్‌కి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అర్జితా సింగ్ అనే మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియోలో సొరకాయ నూడుల్స్ తయారు చేసే విధానం గురించి చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె ‘మీరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల నూడుల్స్ తిని ఉంటారు. గుమ్మడికాయతో చేసిన నూడుల్స్ కూడా తిని ఉంటారు. కానీ, ఇప్పుడు తొలిసారి సొరకాయ నూడుల్స్ తినబోతున్నారు.’ అంటూ తను షేర్ చేసిన వీడియోకి క్యాప్షన్ పెట్టింది అర్జితా సింగ్. వీటికి లూడిల్స్ అని పేరు కూడా పెట్టిందామె.
Also Read:
ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన
చికెన్ ముక్క కోసం యాక్టింగ్ ఇరగదీసిన కుక్క.. ట్విస్ట్ మామూలుగా లేదు..
ఫిఫా వరల్డ్ కప్ 2026: ఇరాన్ ప్లేయర్ల ప్రాణాలకు మేం గ్యారెంటీ ఇవ్వలేం: ట్రంప్