చికెన్ ముక్క కోసం యాక్టింగ్ ఇరగదీసిన కుక్క.. ట్విస్ట్ మామూలుగా లేదు..
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:30 PM
ఓ కుక్క చికెన్ ముక్క కోసం యాక్టింగ్ ఇరగదీసింది. రెండు వెనుక కాళ్లు విరిగిపోయినట్లు భలే యాక్ట్ చేసింది. తన నటనతో చికెన్ అమ్మే మహిళను మెప్పించింది. చికెన్ ముక్కను సంపాదించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: సాధారణంగా అద్భుతమైన యాక్టింగ్ చేసే ఆడవాళ్లను మహానటి అని.. మగవాళ్లను మహా నటుడు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ కుక్క చికెన్ ముక్క కోసం యాక్టింగ్ ఇరగదీసింది. రెండు వెనుక కాళ్లు విరిగిపోయినట్లు భలే యాక్ట్ చేసింది. తన నటనతో చికెన్ అమ్మే మహిళను మెప్పించింది. చికెన్ ముక్కను సంపాదించింది. తర్వాత తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. తాపీగా నాలుగు కాళ్లపై నడవటం మొదలెట్టింది. ఇది చూసి ఆ మహిళా వ్యాపారి షాక్ అయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కుక్క తన రెండు వెనుక కాళ్లు విరిగి పోయిన దానిలా కాల్లు ఈడ్చుకుంటూ చికెన్ అమ్మే బండి దగ్గరకు వచ్చింది. బండి దగ్గరకు రాగానే కిందపడిపోయింది. ఎంతో ధీనంగా ముఖం పెట్టింది. ఎంతో కష్టపడి పైకి లేచి, చికెన్ అమ్మే మహిళ వైపు చూసింది. మొదట ఆమె దాన్ని పట్టించుకోలేదు. కొద్దిసేపు అది బండి చుట్టూ కాళ్లు ఈడ్చుకుంటూ తిరిగింది. దాన్ని చూసి జాలిపడ్డ మహిళ ఓ చికెన్ ముక్కను దాని వైపు విసిరింది.
ఆ కుక్క గాల్లోనే దాన్ని నోటితో పట్టుకుంది. చకచకా నమిలి మింగేసింది. ఆ వెంటనే నాలుగు కాళ్లపై పైకి లేచి నిలబడింది. కుక్క నాలుగు కాళ్లపై నిలబడ్డం చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయింది. ఆ కుక్క మాత్రం తోక ఊపుకుంటూ అక్కడినుంచి పరుగులు తీసింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘కుక్కలు ఈ మధ్య కాలంలో బాగా తెలివి మీరి పోయాయి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి’..‘ఈ మధ్య కాలంలో ఏఐ వీడియోలు బాగా ఎక్కువయ్యాయి. ఇది కూడా ఏఐ వీడియో కావచ్చు’..‘ఇది చాలా పాత వీడియో.. మళ్లీ వైరల్ అవుతోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గుర్రంగూడ అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటింపు
గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్