Share News

Mutton Digestion Problems: మటన్ తిన్న వెంటనే పొరపాటున కూడా వీటిని తినకండి..

ABN , Publish Date - Jan 10 , 2026 | 10:43 AM

చలికాలంలో చాలా మంది మటన్ తినడానికి ఇష్టపడతారు. మటన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మటన్ తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తీసుకుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మటన్ తిన్న తర్వాత ఏవి తినకూడదో తెలుసుకోవడం చాలా అవసరం..

Mutton Digestion Problems: మటన్ తిన్న వెంటనే పొరపాటున కూడా వీటిని తినకండి..
Mutton Digestion Problems

ఇంటర్నెట్ డెస్క్: చలికాలం వచ్చిందంటే చాలా మంది మటన్, చికెన్ వంటలు ఎక్కువగా చేస్తారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు ఇళ్లలో మటన్ లేదా చికెన్ కచ్చితంగా ఉంటుంది. కొంతమంది అయితే వారానికి మూడు, నాలుగు సార్లు కూడా మాంసాహారం తింటారు. మాంసాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ.. సరైన విధంగా తినకపోతే అది ఇబ్బందులకు కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా మటన్ తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అందుకే మటన్ తిన్న తర్వాత ఏమి తినకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.


మటన్ తిన్న తర్వాత ఇవి అస్సలు తినకండి

  • పాలు, పెరుగు, మజ్జిగ: చాలా మంది మటన్ తిన్న వెంటనే పాలు లేదా పెరుగు తీసుకుంటారు. ఇది చాలా మందికి అలవాటు. కానీ నిపుణుల ప్రకారం.. మాంసాహారం తర్వాత ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దాంతో గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.

  • తేనె: మటన్ తిన్న తర్వాత తేనె తినడం కూడా మంచిది కాదట. తేనె శరీరంలో వేడి పెంచుతుంది. మటన్ కూడా శరీరాన్ని వేడిగా చేస్తుంది. ఈ రెండూ కలిసి శరీర వేడిని మరింత పెంచి గుండెల్లో మంట, అసౌకర్యం కలిగిస్తాయి.

  • అరటిపండ్లు: మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు వెంటనే అరటిపండ్లు తింటే కడుపు ఉబ్బరం, అసౌకర్యం ఏర్పడుతుంది.

  • స్వీట్లు, డెజర్ట్స్: మటన్ తిన్న వెంటనే స్వీట్లు తినడం కూడా మంచిది కాదు. ఇది జీర్ణక్రియను మరింత నెమ్మదిగా చేస్తుంది. అలాగే కడుపు భారంగా అనిపిస్తుంది. రాత్రి మటన్ ఆలస్యంగా తినడం కూడా తగ్గించాలి.


మటన్ తిన్న తర్వాత ఏం చేయాలి?

  • మటన్ తిన్న తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి..

  • పుష్కలంగా నీరు తాగండి..

  • కడుపు భారంగా అనిపిస్తే అల్లం కషాయం లేదా మెంతుల కషాయం తాగవచ్చు.


శీతాకాలంలో మటన్ తినడం వల్ల లాభాలు..

పోషకాహార నిపుణురాల ప్రకారం.. చలికాలంలో మటన్ తినడం శరీరానికి మేలు చేస్తుంది. మటన్‌లో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చలిలో శరీర ఉష్ణోగ్రతను నిలబెట్టడంలో కూడా మటన్ ఉపయోగపడుతుంది. అయితే జీర్ణశక్తి బలంగా ఉన్నవారే మటన్ ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 10 , 2026 | 11:26 AM