Share News

ఒంటరిగా ఫీలవుతున్నారా? కారణం మీ అలవాట్లే కావచ్చు!

ABN , Publish Date - Mar 18 , 2026 | 03:11 PM

నన్నెవరూ పట్టించుకోవడం లేదు అనే భావన చాలా మందికి కలుగుతుంది. కానీ ఈ సమస్యకు కారణం మన అలవాట్లు, మనస్తత్వం కూడా కావచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఒంటరిగా ఫీలవుతున్నారా?  కారణం మీ అలవాట్లే కావచ్చు!
Feeling ignored

ఇంటర్నెట్ డెస్క్: కొంతమందికి 'నన్నెవరూ పట్టించుకోవడం లేదు', 'నాకు ఎవరూ లేరు' అనే భావన కలుగుతుంది. కానీ మానసిక నిపుణుల ప్రకారం, ఈ పరిస్థితికి చాలా సార్లు మన అలవాట్లు, మనస్తత్వం, ఆలోచనా విధానమే కారణమవుతాయి. ఇవే మన దగ్గర వాళ్లను మన నుంచి దూరం చేయవచ్చు.


ఎందుకు ఇలా అనిపిస్తుంది?

మనకు దగ్గరగా ఉన్నవాళ్లు సహజంగానే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆశిస్తారు. కానీ మనం వారికంటే ఇతరులకు ప్రాధాన్యం ఇస్తే, వారు తమను తక్కువగా భావిస్తారు. దీంతో బంధం క్రమంగా బలహీనమవుతుంది.

Loniliness.jpg

ఎక్కువగా విమర్శించడం

ఎప్పుడూ ఇతరుల తప్పులే చూసి విమర్శిస్తే, వాళ్లు మీతో ఉండాలని అనుకోరు. 'నేనే సరిగా ఉన్నాను' అనే భావన కూడా సంబంధాలను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు సర్దుకుపోవడం కూడా చాలా ముఖ్యం.


క్షమించలేకపోవడం

గతంలో జరిగిన విషయాలను పట్టుకుని ఉండటం వల్ల బంధాలు దూరమవుతాయి. మనసులోని బాధలను వదిలేయడం, క్షమించడం నేర్చుకుంటేనే సంబంధాలు బలపడతాయి.

అబద్ధాలు చెప్పడం

ఏ సంబంధానికైనా నమ్మకం చాలా ముఖ్యమైనది. అబద్ధాలు చెప్పడం వల్ల ఆ నమ్మకం పోతుంది. నిజాయతీగా ఉంటేనే బంధాలు నిలుస్తాయి.


Lonileness.jpg

డబ్బు వచ్చిన తర్వాత మార్పు

కొంతమంది ఆర్థికంగా ఎదిగిన తర్వాత తమను సాయం చేసినవారిని పట్టించుకోరు. దీంతో వారు దూరమవుతారు. అలాగే కొందరికి అసూయ కూడా పెరుగుతుంది. కాబట్టి మనకు నిజంగా తోడుగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం.

బంధాలను బలంగా ఉంచాలంటే

  • అపార్థాలు వస్తే వెంటనే మాట్లాడి పరిష్కరించుకోవాలి.

  • చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండాలి.

  • అహంకారంగా ఉండకుండా బంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

  • కష్టసమయంలో అండగా ఉండాలి.

  • ముఖ్య నిర్ణయాల్లో కుటుంబాన్ని కలుపుకోవాలి.

  • కుటుంబం, స్నేహితులతో కలిసి సమయం గడపాలి.

మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదనిపిస్తే, ముందుగా మన ప్రవర్తనను పరిశీలించాలి. చిన్న మార్పులతోనే బంధాలను మళ్లీ బలంగా మార్చుకోవచ్చు.


Also Read

వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?

For More Latest News

Updated Date - Mar 18 , 2026 | 03:25 PM