బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?
ABN , Publish Date - Mar 09 , 2026 | 07:52 AM
పోషకాలతో నిండిన బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, బొప్పాయిని ఎప్పుడు తింటే శరీరానికి పూర్తి ప్రయోజనం కలుగుతుందో చాలా మందికి తెలియదు. ఉదయం తినడం మంచిదా? లేక రాత్రి తినాలా? బొప్పాయి తినడానికి సరైన సమయం ఏమిటో, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బొప్పాయి పండులో విటమిన్ A, విటమిన్ Cతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో బొప్పాయి తినడం వల్ల శరీరం చల్లగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అయితే ఈ పండును సరైన సమయంలో తింటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు.
బొప్పాయి తినడానికి సరైన సమయం
బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B9, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ B1, B3, B5, విటమిన్ E, విటమిన్ K వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఈ పోషకాలన్నింటి ప్రయోజనాలను పొందాలంటే ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారం సమయంలో బొప్పాయి తినడం ఉత్తమం. ఇలా తింటే రోజంతా జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తుంది. శరీరం తేలికగా ఉంటుంది.
అలాగే బొప్పాయి పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది కాబట్టి రాత్రి సమయంలో కూడా తినవచ్చు. అయితే భోజనం చేసిన వెంటనే బొప్పాయి తినకూడదు. భోజనం చేసిన తర్వాత కనీసం 3–4 గంటల గ్యాప్ ఇచ్చి తినడం మంచిది. లేదంటే జీర్ణక్రియకు ఇబ్బంది కలగవచ్చు.
బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.
చర్మ ఆరోగ్యానికి మంచిది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ.. ఈ విధంగా చేస్తే సూపర్ టేస్ట్
మీ ముఖం బంగారంలా మెరిసిపోవాలా? శనగపిండిని ఇలా వాడండి
For More Latest News