Share News

కొత్త ఏసీ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:42 PM

మీరు కొత్త ఏసీ కొంటున్నారా? అయితే, ఏసీ కొనే ముందు వినియోగదారులు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

కొత్త ఏసీ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
AC Buying Guide

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో చాలామంది ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడటం లేదా కొత్తవి కొనడం సహజం. కొందరు చాలాకాలంగా ఉపయోగించకుండా ఉంచిన ఏసీలు, కూలర్లను శుభ్రం చేసి మళ్లీ ఉపయోగిస్తారు, మరికొందరు కొత్త పరికరాలు కొనుగోలు చేస్తారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలపై కొంత అవగాహన ఉండటం చాలా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.


కొత్త ఏసీ కొంటున్నారా?

ఏసీ కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే కాకుండా సాంకేతిక అంశాలను కూడా గమనించాలి. చిన్న గదులు లేదా అద్దె ఇళ్లలో ఉండేవారికి విండో ఏసీ సరైన ఎంపిక. ఇది తక్కువ ఖర్చుతో మంచి కూలింగ్ ఇస్తుంది. పెద్ద గదులు ఉన్నవారికి స్ప్లిట్ ఏసీ ఉపయోగకరంగా ఉంటుంది. విండో ఏసీ ఒకే యూనిట్‌గా ఉండగా, స్ప్లిట్ ఏసీ వేర్వేరు యూనిట్లతో ఉంటుంది.

AC (1).jpg

ఏసీ ఎలా పనిచేస్తుంది?

ఏసీ పనితీరు ప్రధానంగా కంప్రెసర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇన్వర్టర్, నాన్-ఇన్వర్టర్ అనే రెండు రకాల ఏసీలు ఉంటాయి. ఇన్వర్టర్ ఏసీలు స్థిరంగా పనిచేస్తూ తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. నాన్-ఇన్వర్టర్ ఏసీలు గది చల్లగా అయిన తర్వాత ఆగి, మళ్లీ వేడి పెరిగినప్పుడు ఆన్ అవుతాయి. దీనివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం ఉత్తమం.


కాయిల్ ఎంపిక – మన్నిక ముఖ్యం:

అల్యూమినియం కాయిల్ ఏసీలు చౌకగా ఉన్నా, త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. రాగి (కాపర్) కాయిల్ ఉన్న ఏసీలు.. వేడి త్వరగా గ్రహించి, మంచి కూలింగ్ ఇస్తాయి. ఇవి ఎక్కువ కాలం పనిచేస్తాయి.

AC (2).jpg

స్టార్ రేటింగ్ :

విద్యుత్ ఆదా కోసం స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలను ఎంచుకోవాలి. 5 స్టార్ ఏసీలు తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. ISEER (Indian Seasonal Energy Efficiency Ratio) విలువ కూడా ముఖ్యమే. ఇది 4.5 కంటే ఎక్కువగా ఉంటే మంచి పనితీరు ఇస్తుంది. వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో స్టెబిలైజర్ ఉపయోగించడం మంచిది. సరైన అవగాహనతో ఏసీ కొనుగోలు చేస్తే, మీరు డబ్బు ఆదా చేసుకోవడమే కాకుండా, మంచి కూలింగ్‌ను కూడా పొందగలుగుతారు.


Also Read

వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?

For More Latest News

Updated Date - Mar 17 , 2026 | 01:58 PM