మొదటిసారి విదేశాలకు వెళ్తున్నారా? ఈ 4 విషయాలు తప్పక గుర్తుంచుకోండి
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:08 PM
విదేశాలకు మొదటిసారి ప్రయాణించడం ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక అనుభవం. అయితే, మొదటిసారి విదేశాలకు వెళ్తున్నవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాలకు వెళ్లడం చాలా మందికి పెద్ద కల. కొత్త దేశం, కొత్త సంస్కృతి, కొత్త ప్రదేశాలు చూడటం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇప్పటివరకు సినిమాలు లేదా సోషల్ మీడియాలో మాత్రమే చూసిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. కానీ ఈ ఉత్సాహంలో చాలామంది కొన్ని చిన్న తప్పులు చేస్తారు. అవే కొన్నిసార్లు మొత్తం ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మారుస్తాయి. మొదటిసారి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా చేసే కొన్ని సాధారణ తప్పులు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అవసరానికి మించి ప్యాకింగ్ చేయడం
మొదటిసారి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా చేసే తప్పుల్లో ఇది ఒకటి. చాలామంది అవసరానికి మించి బట్టలు, ఇతర వస్తువులను బ్యాగుల్లో పెట్టుకుంటారు. దీంతో సామాను బరువుగా మారి విమానాల్లో అదనపు లగేజ్ ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. అంతేకాదు, ఎక్కువ సామాను తీసుకెళ్లడం వల్ల ప్రయాణ సమయంలో తిరగడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే అవసరమైన వస్తువులనే తీసుకెళ్లడం మంచిది.

సరైన ప్రణాళిక లేకపోవడం
మొదటిసారి విదేశాలకు వెళ్లేవారు తరచూ తమ షెడ్యూల్‌ను చాలా బిజీగా ప్లాన్ చేస్తారు. ఒకే రోజులో చాలా ప్రదేశాలు చూడాలని ప్రయత్నిస్తారు. కానీ వాస్తవంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అదనంగా ట్రాఫిక్ సమస్యలు కూడా రావచ్చు. అందుకే షెడ్యూల్‌ను కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి.

ముఖ్యమైన వస్తువులను మర్చిపోవడం
కొంతమంది కొన్ని ముఖ్యమైన వస్తువులను మర్చిపోతారు. ఉదాహరణకు మొబైల్ ఛార్జర్లు, ట్రావెల్ అడాప్టర్లు వంటి వస్తువులు. విదేశాల్లో ఇవి కొన్నిసార్లు ఖరీదుగా ఉండవచ్చు లేదా మీ పరికరాలకు సరిపోకపోవచ్చు. అందుకే ప్రయాణానికి ముందు అవసరమైన వస్తువుల జాబితా తయారు చేసుకుని చెక్ చేసుకోవడం మంచిది.

ప్రయాణ వేగాన్ని అంచనా వేయకపోవడం
చాలామంది విమానాలు, హోటళ్లు బుక్ చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ ఒక రోజులో ఎంత ప్రయాణం చేయగలమో, ఎంత విశ్రాంతి అవసరమో ముందుగా అంచనా వేయరు. దీంతో నిరంతరం ప్రయాణించడం వల్ల అలసట పెరుగుతుంది. చివరకు ట్రిప్ ఆనందంగా కాకుండా ఒత్తిడిగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రయాణాన్ని నెమ్మదిగా, ఆస్వాదిస్తూ ప్లాన్ చేయడం మంచిది.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News