Share News

ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా? ఈ తప్పులు చేయొద్దు

ABN , Publish Date - Mar 14 , 2026 | 07:21 PM

ఇండక్షన్ స్టవ్‌ను కొనుగోలు చేసేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా? ఈ తప్పులు చేయొద్దు
induction stove buying guide

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశంలో ఇండక్షన్ స్టవ్స్‌కు గిరాకీ విపరీతంగా పెరిగింది. గ్యాస్‌ సరఫరాపై ఆందోళనతో అనేక మంది ఈ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, వీటిని కొనుగోలు చేసేవారు కొన్ని తప్పులు చేయకూడదని అనుభవజ్ఙులు చెబుతున్నారు. అవేంటంటే..

చాలా మంది ఇండక్షన్ స్టవ్‌ల పవర్ రేటింగ్‌ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వీటిని కొంటుంటారు. సాధారణ మోడల్స్ 1200 వాట్స్ నుంచి 2 వేల వాట్స్ వరకూ పవర్ రేటింగ్‌తో ఉంటాయి. వాట్స్ పెరిగే కొద్దీ ఆహారం త్వరగా ఉడుకుతుంది.

ఇక ఇండక్షన్ స్టవ్‌లకు అనువైన పాత్రలనే వినియోగించాలి. ఈ స్టవ్‌లపై వినియోగించేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్ (ఇనుము) వంటి ఫెర్రో మేగ్నెటిక్ పదార్థాలతో చేసిన పాత్రలనే ఎంచుకోవాలి. ఇతర పాత్రలు ఈ స్టవ్‌లకు అనువు కాదు.


కొందరు తమ వంటింట్లో ఎంత జాగా ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా ఇండక్షన్ స్టవ్స్‌ను కొనుగోలు చేస్తారు. ఇది అస్సలు చేయకూడదని తప్పు. ఇక వివిధ వంటకాల కోసం ప్రీసెట్ కుకింగ్ మోడ్స్, మాన్యువల్‌ టెంపరేచర్ కంట్రోల్ ఉన్న మోడల్స్‌ను ఎంచుకుంటే వంట సులువవుతుంది.

ఇండక్షన్ స్టవ్‌ల విషయంలో భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేయాలి. ఆటోమేటిక్‌గా స్టవ్ ఆఫ్ అవడం, ఓవర్ హీటింగ్ నుంచి రక్షణ ఉన్న వాటినే ఎంచుకోవాలి. కంట్రోల్ ప్యానెల్ డిజైన్, సర్వీస్ సపోర్టు వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే మంచి బ్రాండ్‌ను ఎంచుకోవాలి.

ఈ స్టవ్స్‌ను కొనే సమయంలో చాలా మంది ధరలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎంట్రీలెవెల్ మోడల్స్ రూ.1500లకే అందుబాటులో ఉన్నప్పటికీ కాస్త ధర పెడితే భద్రతా ఫీచర్లు, వారెంటీ ఉన్న స్టవ్‌ను సొంతం చేసుకోవచ్చు. కాబట్టి, ఈ జాగ్రత్తలను పాటిస్తూ వినియోగదారులు తమ అవసరాలకు తగిన ఇండక్షన్ స్టవ్‌ను ఎంచుకోవాలి.


ఈ వార్తలూ చదవండి:

గ్యాస్ సేవ్ చేయాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి

సొరకాయతో నూడుల్స్.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..

Updated Date - Mar 14 , 2026 | 07:44 PM